తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM

By

Published : Nov 22, 2020, 6:59 PM IST

1. 'రెండునెలల్లో ప్రభుత్వాన్ని పడగొట్టగలం'

ఎంఐఎం తలుచుకుంటే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టడం పెద్దపని కాదని రెండునెలల సమయం సరిపోతుందని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కిలోబియ్యం పథకానికి కేంద్రమే రూ.30 ఇస్తోంది: కిషన్​రెడ్డి

రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయని వారికి.. గ్రేటర్​ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కులేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. రూపాయికు కిలో బియ్యం పథకానికి కేంద్రం కేజీకి రూ.30 ఇస్తోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. సాయం పేరుతో తెరాస నేతలు దోచుకున్నారు: ఉత్తమ్

హైదరాబాద్‌ అభివృద్ధి కాంగ్రెస్‌ వల్లే జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. వరద సాయం కోసం వందల కోట్లు ఖర్చు చేశామంటూ... తెరాస అసత్యాలు చెబుతోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. బతికుంటే తెరాసకే ఓటు వేస్తానంది: శ్రీనివాస్​గౌడ్​

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో తెరాస వందకు పైగా సీట్లు సాధించడం ఖాయమని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్​గౌడ్​ జోస్యం చెప్పారు. అడిక్​మెట్​ డివిజన్​లోని నాగమయ్య కుంటలో ప్రచారం సందర్భంగా.. పోలింగ్ తేదీ వరకు బతికి ఉంటే తప్పనిసరిగా కారు గుర్తుకే ఓటు వేస్తానని ఓ వృద్ధురాలు చెప్పడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మహారాష్ట్రలో మళ్లీ లాక్​డౌన్​​ ?

పండగ వేళల్లో ప్రజలు కరోనా భయాలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా తిరిగారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్​ అసహనం వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో మరోసారి లాక్​ డౌన్​ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. అక్కడి నుంచే ఉగ్రవాదుల చొరబాటు

జమ్ముకశ్మీర్​ సాంబా సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాలను కనుగొనేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్​ నిర్వహించాయి. నవంబర్​ 19న హతమైన నలుగురు జైషే ముష్కరులు వినియోగించిన టన్నెల్​ను గుర్తించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 6 వారాల్లోనే కరోనా ఖతం!

కరోనాను సమూలంగా రూపుమాపే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్కువ కచ్చితత్వంతో కరోనాను గుర్తించే ర్యాపిడ్ పరీక్షలే ఇందుకు ప్రధాన ఆయుధమని తెలిపారు. భారీ స్థాయిలో, తరచుగా ర్యాపిడ్ పరీక్షలను నిర్వహించడం ద్వారా వైరస్​ను పూర్తిగా నిర్మూలించవచ్చని అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'ఆర్​బీఐ' ప్రపంచ రికార్డు

భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ) అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆర్​బీఐ ట్విట్టర్​ ఖాతా అత్యధికంగా 10లక్షల మంది ఫాలోవర్స్​ను సంపాదించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి సెంట్రల్​ బ్యాంక్​గా ఆర్​బీఐ నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'రోహిత్​తో మాట్లాడాకే కుదుటపడ్డా'

భారత జట్టులో చోటు దక్కని సందర్భంలో, రోహిత్​ శర్మ మాటలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని సూర్యకుమార్​ యాదవ్ చెప్పాడు​. ఈసారి ఐపీఎల్​లో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఆ సమస్యతో టీవీ నటి మృతి

బుల్లితెర నటి లీనా ఆచార్య.. కిడ్నీ సమస్యతో బాధపడుతూ మరణించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details