1. గ్రేటర్ ప్రగతి నివేదిక విడుదల
గ్రేటర్ తెరాస అభ్యర్థులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరుపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ నేతలు కేకే, మంత్రులతో కలిసి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కాంగ్రెస్ ఆరో జాబితా
జీహెచ్ఎంసీ ఎన్నికలకు 35 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం 116 మంది పేర్లను ప్రకటించింది. ఇంకా 34 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆ ప్రాంగణంలో మీడియా రద్దు
గ్రేటర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా సమావేశాలను నిషేధిస్తూ శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సీపీ
గ్రేటర్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. తమ కమిషనరేట్ పరిధిలో 38 డివిజన్లు ఉన్నాయని.. ఎన్నికల కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలు, లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తు సిద్ధం చేశామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ఆధిపత్య ధోరణికి వ్యతిరేకం'
ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆగడాలను ఉద్దేశించి విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో ఆధిపత్య ప్రయత్నాలను తిప్పికొట్టే భావనతోనే ఇండో పసిఫిక్ బంధం ఏర్పడిందని అన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'మోదీ భాయ్- దీదీ భాయ్' చిచ్చు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐకమత్యంలో ముందుకెళ్లి ఎవరూ ఊహించని విధంగా 16 స్థానాలు కైవసం చేసుకున్నాయి వాపపక్షాలు. వచ్చే ఏడాది బంగాల్ శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే విధంగా ముందుకు సాగి రాష్ట్రంలో పూర్వవైభవం సాధించాలని తొలుత భావించాయి. అయితే సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) మధ్య విబేధాలు తలెత్తడం బంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 73వ వివాహ వసంతంలోకి రాజ దంపతులు
బ్రిటన్‌రాణి ఎలిజబెత్-2, యువరాజు ఫిలిప్‌ల వివాహం జరిగి 73వసంతాలు పూర్తయింది. ఈ వేడుక సందర్భంగా తమ మనవళ్లు తయారు చేసిన గ్రీటింగ్ కార్డును పరిశీలిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు రాజ దంపతులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'రెమ్డెసివిర్తో ఎలాంటి ప్రయోజనం లేదు'
గిలీద్ సైన్సెస్‌కు చెందిన యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్.. కరోనా రోగులపై ఎలాంటి ప్రభావం చూపట్లేదని మరోసారి స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). రోగులు కోలుకుంటున్నట్లు, మరణాల రేటును తగ్గిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని డబ్ల్యూహెచ్ఓ నియమించిన కమిటీ తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఆ ఆటగాళ్లకూ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్
ఆటగాళ్లకు ప్రతి ఏటా ప్రకటించే కాంట్రాక్ట్‌లో టీ20లనూ బీసీసీఐ జతచేసింది. ఇప్పటివరకు వన్డేలు, టెస్టు క్రీడాకారులకు మాత్రమే వార్షిక వేతనం ఇచ్చేవారు. ఇకపై పొట్టి ఫార్మాట్ ఆటగాళ్లకు వేతనం అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రేసులో 3 భారతీయ చిత్రాలు
ప్రతిష్ఠాత్మక ఏఏసీటీఏ అవార్డులకు మూడు భారతీయ చిత్రాలు నామినేట్ అయ్యాయి. బెస్ట్ ఆసియా ఫిల్మ్ కేటగిరిలో తప్పడ్, చపాక్, శుభ్‌మంగళ్ జ్యాదా సావదాన్ నిలిచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.