ఎగ్జిట్ పోల్స్ తీర్పు- మహాకూటమిదే బిహార్
బిహార్ ఎన్నికల్లో మహాకూటమికే మొగ్గు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా బిహార్ బరిలోకి దిగగా.. ఆ కూటమికే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని... పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
దీపావళికి బోనస్
సింగరేణి యాజమాన్యం కార్మికులకు శుభవార్త అందించింది. ఏటా మాదిరే దీపావళి బోనస్‌తో ఈసారి సింగరేణి కార్మికులు పండుగ చేసుకోనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఎంత పంపిణీ చేశారు
కూకట్పల్లి జోన్ పరిధిలో వరద బాధితులకు ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఎంత పంపిణీ చేశారనే వివరాలను తనకు రాత పూర్వకంగా ఇవ్వాలని జోనల్ కమిషనర్ మమతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఆబ్కారీశాఖ అధికారిని నిర్భందించిన ఆదివాసీలు
కుమురంభీం జిల్లా జైనూరు లెండిగూడలో ఆబ్కారీశాఖ అధికారులను ఆదివాసీలు నిర్బంధించారు. మద్యం సేవించి.. తమ ఆచారాలకు విరుద్ధంగా బుట్లు వేసుకుని.. మగవారు లేని సమయంలో ఇళ్లల్లో అధికారులు తనిఖీలు నిర్వహించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నెరవేరిన 30ఏళ్ల కల
ఆడపిల్ల పుట్టిందని కొందరు కర్కశత్వం చూపిస్తున్న ఈ కాలంలో ఓ దంపతులు మాత్రం అమ్మాయి పుట్టాలని 30 ఏళ్లు ఎదురుచూశారు. అయితే దాదాపు 14 మంది మగపిల్లల తర్వాత 15వ సంతానంగా ఆడశిశువు జన్మించడం వల్ల వారి ఆనందానికి అవధుల్లేవు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.