తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ వార్తలు @7PM - ETV BHARAT TOP TEN 7PM NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్​ వార్తలు @7PM

By

Published : Jun 19, 2020, 6:56 PM IST

పీజీ మెడికల్ డిప్లొమా పరీక్షల షెడ్యూల్​ విడుదల

రేపటి నుంచి కాళోజీ వర్సిటీ పీజీ మెడికల్ డిగ్రీ డిప్లొమా పరీక్షలు ప్రారంభం. ఆ పరీక్షల పూర్తి వివరాలు చుద్దామా

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ వివరాలేంటంటే..

ఆర్టీసీ పార్సిల్‌ కొరియర్, కార్గో సేవలు ప్రారంభం

ఆర్టీసీకి అదనపు ఆదాయం కల్పించేలా పార్సిల్‌ కొరియర్, కార్గో సర్వీసులు ప్రారంభించామని మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వాటిని ఆయన ప్రారంభించారు. వాటితో ఎంత ఆదాయం అంచనా వేస్తున్నారంటే...

నగల దుకాణానికి కన్నం..

యజమానికి నమ్మకస్తుడిగా ఉంటూ నగల దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి దొంగతనానికి పాల్పడిన ఘటన నేరెడ్​మెట్​లో చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని పట్టుకుని ఆ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగల విలువ ఎంతో తెలుసా..

భారత్​-చైనా 'శాంతి' చర్చలు ఇక ముగిసినట్టేనా?

సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా మధ్య మేజర్ జనరల్స్ స్థాయిలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇరుదేశాల సైనికులు ఆవేశంతో ఉన్న నేపథ్యంలో భవిష్యత్​ చర్చలపై సందిగ్ధం ఏర్పడింది. ఆ పూర్తి వివరాలు చుద్దామా...

లేహ్​, లద్దాఖ్​ సరిహద్దులో యుద్ధ విమానాలు గస్తీ

తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను భారత్ కట్టుదిట్టం చేసింది​. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో గస్తీని పెంచింది. ఈ నేపథ్యంలో అధికారులు స్థావరాలను సందర్శించారు. పూర్తి వివరాలు...

ఆపరేషన్​ కరోనా: మరో డ్రగ్​పై క్లినికల్ ట్రయల్స్

కొవిడ్​ రోగులకు చికిత్స అందించే యుమిఫెనొవిర్​ క్లినికల్​ ట్రయల్స్​కు అనుమతి లభించింది. లఖ్​నవూలోని ఓ విశ్వవిద్యాలయం సహా మరికొన్ని వైద్యశాలల్లో దీనిపై మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు కేంద్ర ఔషధ పరిశోధనా సంస్థ(సీడీఆర్​ఐ) సమ్మతించింది. ఆ ఔషధ వివరాలు చుద్దామా...

దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలు

భారత్​లో 1000 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. క్రీడల్లో మనదేశాన్ని సూపర్​పవర్​గా మార్చే పోరాటంలో భాగంగానే వీటిని ప్రారంభించబోతున్నట్లు కేంద్రక్రీడా మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే...

ఏటా 100 కోట్ల మంది చిన్నారులపై హింస

సరైన రక్షణ చర్యలు లేక ఏటా సుమారు వందకోట్ల మంది చిన్నారులు హింసకు గురవుతున్నారని ఐరాస ఓ నివేదికలో తెలిపింది. బాలల చట్టాలు ఆ దేశాల్లో అమలు లేవు

రజనీకాంత్​కు బాంబు బెదిరింపు అతడి పనే!

సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఇంట్లో బాంబు ఉందని ఫేక్​ కాల్ చేసిన వ్యక్తిని తమిళనాడు పోలీసులు గుర్తించారు. అతను ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడని తేల్చారు. అతనిని ఏం చేశారో తెలుసా...

ABOUT THE AUTHOR

...view details