1. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: భట్టి
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ... ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రెమ్‌డెసివర్ ఇంజిక్షన్‌పై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని... తక్కువ ధరకే కరోనా బాధితులకు అందించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. స్వామికి చక్రస్నానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదావరి నదిలో చేయాల్సిన చక్రస్నానం కార్యక్రమాన్ని... కరోనా కారణంగా ఆలయంలోనే నదీ జాలలు తీసుకొచ్చి నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ముగ్గురు నిందితుల అరెస్ట్
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మౌలాలీలో ఆక్సిజన్ సిలిండర్ల అక్రమ రవాణాను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారు. మాస్ ఫౌండేషన్ ఎన్జీవో పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'పోరాడాల్సింది కరోనాపై.. కాంగ్రెస్‌పై కాదు'
దేశంలో ప్రస్తుతం పోరాడాల్సింది కరోనాపైనేనని, కాంగ్రెస్‌పై కాదని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని మోదీ సర్కార్ గుర్తించాలని ట్వీట్ చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'సంక్షోభాన్ని చూస్తూ ఉండలేం'
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సుమోటోగా కేసు విచారణ జరిపింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో జాతీయ సంక్షోభంపై స్పందించకుండా ఉండలేమని పేర్కొంది. హైకోర్టుల్లో కరోనా అంశాలపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.