1. మూడు రోజులు తేలికపాటి జల్లులు
సూర్యుడు భగ్గుమంటున్న వేళ.. ఓ చల్లని కబురునిచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మహిళా రైతులపై దాడి హేయం: బండి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కుమురంభీం జిల్లాలో అమాయక పేద మహిళా రైతులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'క్రీడల అభివృద్ధికే ప్రాధాన్యం'
దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను మంత్రి తన నివాసంలో అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. జెండాను విరగ్గొట్టిన తెరాస కార్యకర్త
రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా జెండాపైనే తన ప్రతాపం చూపించాడు ఓ వ్యక్తి. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో తెరాస కార్యకర్త భాజపా జెండాను విరగ్గొట్టగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఉద్రిక్తత:అక్కడ పోలింగ్ వాయిదా
బంగాల్ కూచ్‌బెహార్ జిల్లాలోని పోలింగ్ కేంద్రం నెం.126 వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. అక్కడ పోలింగ్‌ను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు ఈ ఘటనపై తమకు పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని ఆదేశించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.