1. మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది ఉండొద్దు'
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. హన్మకొండలో ధాన్యం కొనుగోళ్లు, కరోనా వ్యాప్తి, సమీకృత మార్కెట్లపై అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సహా పలువురు నేతలతో ఆయన సమీక్ష జరిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'ఆ యాప్‌తో వ్యాధుల వ్యాప్తి తెలుసుకోవచ్చు'
కొవిడ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి మంత్రి ఈటల రాజేందర్, అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఐహెచ్‌ఐపీ యాప్ తెచ్చిన కేంద్రానికి ఈటల ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ఆయన ప్రజల కోసం శ్రమించిన వ్యక్తి'
ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి బాబు జగ్జీవన్‌రామ్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా బషీర్‌బాగ్ నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రాష్ట్రంలో నేడు వర్షాలు
గత కొన్ని రోజులుగా వేసవి తాపంతో అల్లాడిపోయిన రాష్ట్ర వాసులకు ఇవాళ కాస్త ఉపసమనం లభించనుంది. రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.