తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​ టెన్​ న్యూస్​@5PM

By

Published : Mar 28, 2021, 4:59 PM IST

1. కూటమి అస్తిత్వ పోరు

బంగాల్​ దంగల్​లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా నువ్వా-నేనా అంటున్న క్రమంలో తాము బంగాల్​లో 'కింగ్​ మేకర్' గా మారతామని అంటోంది మహాకూటమి. తమ మద్దతు లేనిదే ఏ పార్టీ అధికారంలోకి రాలేదని ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'మహా'లో రికార్డు స్థాయిలో కరోనా

దేశంలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్​ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్​ సంక్రమణ రేటు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'అడవి బిడ్డలపై దాడి అమానవీయం'

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అడవి బిడ్డలపై దాడి అమానవీయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఎగువ మానేరుకు కాళేశ్వరం జలాలు

ఎగువ మానేరుకు మరో రెండు రోజుల్లో కాళేశ్వరం జలాలు అందనున్నాయి. కొండపోచమ్మ కాలువ నుంచి కూడెల్లి వాగులోకి పూర్తి సామర్థ్యంతో నీటిని వదలాలన్న మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకు.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'హత్య చేసి ఫిర్యాదు'

ఆస్తి కోసం సొంత అన్నను చంపి, పాతిపెట్టాడు. ఏమీ తెలియనట్లు అమ్మతో కలిసి అన్న కనిపించడం లేదంటూ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కటకటాలపాలయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'మోదీకి తలవంచిన సీఎం'

అవినీతికి పాల్పడటం వల్లే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్​ షా ముందు తమిళనాడు సీఎం కే పళనిస్వామి.. మోకరిల్లారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. తొలి దశలో రికార్డు ఓటింగ్​

బంగాల్ మొదటి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 84.13శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం ​ ప్రకటించింది. తాజా గణాంకాలను విడుదల చేసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందిని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆ విమానాలకు పెరిగిన గిరాకీ

హెలికాప్టర్​లకు, ప్రైవేటు చార్టర్డ్‌ విమానాలకు ఈ మధ్య మళ్లీ గిరాకీ పెరుగుతోంది. దీనికి కారణం ఇటీవల జరుగుతున్న ఎన్నికలేనని నిపుణులు చెబుతున్నారు. సురక్షిత ప్రయాణానికి కుబేరులు వీటిని బుక్‌ చేసుకుంటున్నారని చెబుతున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఓపెనర్లు సరికొత్త రికార్డు

భారత ఓపెనింగ్ ద్వయం రోహిత్-ధావన్ క్రేజీ ఘనతను సాధించింది. జోడీగా వన్డేల్లో 5000 పరుగులు చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సీఎంగా రామ్​చరణ్​!

దర్శకుడు శంకర్​తో చేయబోయే సినిమాలో హీరో రామ్​చరణ్​ యువ ముఖ్యమంత్రిగా నటించబోతున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్​పైకి వెళ్లనుంది. ప్రస్తుతం చెర్రీ 'ఆర్​ఆర్​ఆర్'​, 'ఆచార్య' సినిమాల్లో నటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details