తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్ న్యూస్ @ 5PM

By

Published : Mar 22, 2021, 5:00 PM IST

1. 'జెర్సీ' ఉత్తమ తెలుగు చిత్రం

67వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 'జెర్సీ' ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. సుశాంత్‌ నటించిన 'చిచోరే'కు ఉత్తమ హిందీ చిత్రం అవార్డు దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. స్కూళ్లకు సెలవులు ఇచ్చే యోచన!

రాష్ట్రంలో కరోనా కట్టడికి రేపు మరికొన్ని చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. 8వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'టీశాట్​ ద్వారా 80 శాతం సిలబస్'

రాష్ట్రంలో టీశాట్​ ద్వారా ఇప్పటికే 80 శాతం సిలబస్​ పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తర సమావేశాల్లో ప్రభుత్వ జూనియర్​ కళాశాలల స్థాపనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'భారత్​ బంద్​ విజయవంతం చేయండి'

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 26న చేపట్టన భారత్ బంద్​ను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ కోరారు. నాలుగు నెలలుగా దిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం మొండి వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'ఎన్నికల్లో అక్రమాలు జరిగాయ్'

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని భాజపా నేత రాంచందర్​రావు ఆరోపించారు. ఈ అంశాలపై సీబీఐతో విచారణ చేయించాలని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఈసీ కీలక నిర్ణయం

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్​కు 72 గంటల మందు బైక్​ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో అస్​గ్రామ్ నియోజకవర్గం నుంచి ఓ పనిమనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది భాజపా. ఆమెను ఎంపిక చేయటంపై స్థానిక భాజపా కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కలితా ఎవరు? అంటూ సందేహంలో పడిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. కాంగ్రెస్ మేనిఫెస్టో

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి దీనిని విడుదల చేశారు. అధికారంలోకి వస్తే విద్య, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తామని హమీ ఇచ్చారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'విభేదాలు సాధారణమే'

అహ్మదాబాద్​ వేదికగా జరిగిన ఐదో టీ20లో భారత కెప్టెన్ కోహ్లీ, ఇంగ్లాండ్ వికెట్​ కీపర్​ బట్లర్​ మధ్య జరిగిన మాటల యుద్ధంపై స్పందించాడు ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ఆటలో ఇదంతా సాధారణమేనని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. తగ్గిన వెండి

సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.302 తగ్గి రూ.44,269 వద్దకు చేరింది. వెండి ధర కిలోకు రూ.1,533 మేర తగ్గి.. రూ.65,319కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details