1. అనుమతి తప్పనిసరి: షెకావత్
తెలుగురాష్ట్రాల సీఎంలకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి షెకావత్ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో నిర్మాణంలోని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం అమలుచేయాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన వారి పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. 2020 జీహెచ్ఎంసీ సాధారణ ఎన్నికల్లో 150 డివిజన్ల నుంచి గెలుపొందిన వారి పేర్లను గెజిట్లో పొందుపర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'ఎమ్మెల్సీలో ఏం చేద్దాం'
ఉమ్మడి నల్గొండ జిల్లా తెరాస నేతలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ తెరాస సత్తా చాటాలని స్థానిక నేతలకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కిష్టమ్మ చెప్పిన టీకా ముచ్చట!
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. టీకా కోసం కొన్ని నెలలుగా ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయోనని పలువురు సందిగ్ధంలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
బెదిరింపులకు పాల్పడే ఉగ్రవాద సంస్థల పోస్టర్లను గోడలపై అంటించిన ఐదుగురు ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. పుల్వామా జిల్లాలోని పలు గ్రామాల్లో ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.