1. 'శరవేగంగా ఏర్పాట్లు'
వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న కొవిడ్ నియంత్రణ చర్యలతోపాటు... వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై కేంద్రానికి ఈటల వివరించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కర్రలతో కొట్టి సంతకాలు
సీఎం కేసీఆర్ బంధువుల అపహరణ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియనే ప్రధాన నిందితురాలని రిమాండ్ నివేదికలో పోలీసులు తెలిపారు. హఫీజ్‌పేట భూముల వివాదంలో డబ్బుల కోసం తన భర్త భార్గవ్‌రామ్, ఏవీ సుబ్బారెడ్డితో కలిసి కిడ్నాప్‌నకు పాల్పడినట్లు విచారణలో అఖిలప్రియ అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాష్ట్రానికి అనుమతి
రూ.2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసినందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రాగల 48 గంటలు వర్షాలు
రాష్ట్రంలో రాగల 48 గంటలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న పేర్కొన్నారు. తమిళనాడు తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా దీని ప్రభావం కొనసాగుతుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'విమర్శించే స్థాయి సుమన్‌కు లేదు'
తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బండి సంజయ్‌ను విమర్శించే స్థాయి లేదని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి పేర్కొన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎస్సీలకు బాల్కసుమన్ చేసింది శూన్యమని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.