1. 'కేసీఆర్ నగర్ ప్రత్యేకం'
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేసీఆర్ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. ఇండ్లు నిర్మించామని మంత్రి తెలిపారు. పేదప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్న ప్రభుత్వ లక్ష్యంతోనే అన్ని హంగులు, వసతులతో... రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు నిర్మించి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'రాగానే ఉద్యోగోన్నతులు'
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులపై సీఎం కేసీఆర్ తీరును భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. కేవలం చర్చలతోనే కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. 2023లో భాజపా అధికారంలోకి రాగానే... పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. క్రమబద్ధీకరించాలి: కృష్ణయ్య
తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లో నిర్వహించిన మహాసభలో ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. అంతకుముందు ఇందిరా పార్కు వద్ద పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల బషీర్‌బాగ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పైకప్పు కూలి 18 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో ఓ భవనం పైకప్పు కూలిన ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 4 వేల అత్యాచారాలు
ఉత్తరాఖండ్‌లో అత్యాచార బాధితుల గ్రాఫ్ దిగ్భాంతిని కలిగిస్తోంది. గత 19 ఏళ్లలోనే 4000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. రూ.4కోట్ల 81లక్షల 80వేలను బాధితుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.