తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @3PM

By

Published : Jan 2, 2021, 4:59 PM IST

1. బస్సు హైజాక్

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు 45మంది ప్రయాణికులున్న బస్సును అపహరించారు. హెరాత్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రైతుకు కేసీఆర్ ఫోన్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం రంజోలు రైతుతో సీఎం కేసీఆర్ సంభాషించారు. ఆలుగడ్డ సాగు, విత్తన రకాలు, దిగుబడి గురించి సీఎం తెలుసుకున్నారు. పంటకు సంబంధించిన వివరాలను రైతు నాగిరెడ్డి సీఎంకు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రామతీర్థం రణరంగం

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయం చుట్టూ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. నేతల పర్యటనతో అక్కడ హడావుడి నెలకొంది. బోడికొండ వద్ద మూడు పార్టీలు పోటాపోటీ శిబిరాలు ఏర్పాటు చేసి...నినాదాలు చేయటంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. చూస్తూ ఊరుకోం: ఉత్తమ్

జంగా రాఘవరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి ప్రోద్బలంతోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. తెరాస నేతలు ప్రజాస్వామ్నాన్ని ఖూనీ చేస్తున్నారని మండి పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మరొకరు బలి

దా'రుణ' యాప్‌ వేధింపులు తాళలేక మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఉరేసుకుని చంద్రమోహన్‌ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. నగదు చెల్లించాలంటూ యాప్​ నిర్వాహకులు చంద్రమోహన్‌ను వేధించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఆ రోజున '‌కిసాన్‌ పరేడ్'‌

వ్యవసాయ చట్టాల విషయంలో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీ వైపు ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు. 'కిసాన్ పరేడ్' పేరుతో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'బాహుబలి' శివుడు

మన దేశంలో ఎన్నో శైవ క్షేత్రాలున్నాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ కోవకే చెందుతుంది కేరళలోని అజిమల గంగాధరేశ్వర ఆలయం. కోవలం సమీపంలో సముద్ర తీరానికి ఆనుకొని నిర్మించిన అజిమల గంగాధరేశ్వరుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'కొత్త' మార్గదర్శకాలు

బ్రిటన్​ నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. కరోనా కొత్త రకం స్ట్రెయిన్​ నేపథ్యంలో వీరిపై ప్రత్యేక దృష్టి సారించింది. యూకే నుంచి బయలుదేరడానికి 72 గంటల ముందు నిర్వహించిన పరీక్షలో నెగెటివ్‌గా తేలిన కొవిడ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

9. ఆర్సీబీ పేసర్ స్టెయిన్ దూరం

దక్షిణాఫ్రికా పేసర్​ డేల్​ స్టెయిన్​.. ఐపీఎల్​ 14వ సీజన్​కు దూరమయ్యాడు. కొద్ది కాలం క్రికెట్​కు దూరంగా ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'ఒక్కడు' సీక్వెల్‌కు సిద్ధమైందా!

సూపర్​స్టార్ మహేశ్​ బాబుతో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు దర్శకనిర్మాత ఎంఎస్​ రాజు. ఈ చిత్రం 'ఒక్కడు' సీక్వెల్​ అయి ఉంటుందని సినీ వర్గాల సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details