తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@3PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​ టెన్​ న్యూస్​@3PM NEWS

By

Published : Apr 5, 2021, 3:00 PM IST

Updated : Apr 5, 2021, 3:38 PM IST

1. రేపు కేసీఆర్ పర్యటన

రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటి విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఆ గృహంలో 45 మందికి కరోనా

హైదరాబాద్​ ఎల్బీనగర్‌లోని అనాథ వసతి గృహంలో కరోనా కలకలం రేపింది. 45 మంది విద్యార్థులు వైరస్‌ బారినపడ్డారు. 68 మందికి పరీక్షలు నిర్వహించగా.. 45 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ఆయన సేవలు ఎనలేనివి '

కులరహిత సమాజం కోసం బాబు జగ్జీవన్ రామ్ ఎంతో పాటుపడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్​లోని నిజాం కళాశాల వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. లాక్‌డౌన్ నకిలీ ఉత్తర్వులు, అరెస్టు

తెలంగాణలో మరోసారి లాక్​డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులు సృష్టించిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఇచ్చిన జీవోను డౌన్​లోడ్ చేసుకుని తేదీలు మార్చి పాత జీవోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. నక్సలైట్ల చెరలో జవాను

బీజాపుర్​ ఎన్​కౌంటర్​ సమయంలో కోబ్రా దళానికి చెందిన ఓ జవానును ఎత్తుకెళ్లామన్న నక్సలైట్ల ప్రకటనలో నిజానిజాలు తేల్చేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. విద్యార్థుల విధ్వంసం

బిహార్​లోని సాసారంలో విద్యార్థులు, మరికొందరు ప్రజలు విధ్వంసకాండకు పాల్పడ్డారు. కరోనా నిబంధనల అమల్లో భాగంగా ఓ కోచింగ్ సెంటర్​ను అధికారులు మూయించడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. కార్చిచ్చు- రంగంలోకి వాయుసేన

ఉత్తరాఖండ్​లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేేసేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు అధికారులు. సమీపంలోని సరస్సుల నుంచి నీటిని సేకరించి మంటలు వ్యాపించిన ప్రాంతాల్లో చల్లుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మార్కెట్ నష్టాలకు కారణాలివే!

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఒక్క రోజులో లక్ష దాటాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీనితో సూచీలు రికార్డు స్థాయి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారీ నష్టాలకు నిపుణులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్​గా మాజీ డీజీపీ

బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ) చీఫ్​గా షబీర్​ హుస్సేన్ శెఖాడం ఖాండ్వావాలా నియమితులయ్యారు. ఈయన 1973 బ్యాచ్​ ఐపీఎస్ అధికారి. 2010 డిసెంబర్​లో డీజీపీగా పదవీ విరమణ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'సినీ కార్మికులకు ఉచితంగా కరోనా టీకా'

కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కరోనా టీకా అందించే దిశగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' ప్రెస్​మీట్​లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Apr 5, 2021, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details