1. 'వారితో తెరాసది పేగుబంధం'
ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతోన్న ప్రభుత్వం తెరాస అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులతో తమది పేగుబంధమని పునరుద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'పీఆర్సీ ఎలా ఇస్తుంది?'
జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పీఆర్సీ ఎలా ఇస్తుందని ప్రభుత్వాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎందుకు చెల్లించడం లేదని అడిగారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మద్యం షాపులో మంటలు
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంలోని ఓ వైన్స్లో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.10 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు పగిలి, చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పార్టీల ర్యాలీలు
మరికొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో అభ్యర్థులు జోరుపెంచారు. ఖమ్మంలో పలు పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. వారి స్ఫూర్తిని కొనసాగిస్తాం: మోదీ
స్వాతంత్య్ర ఉద్యమంలో అనేక పోరాటాలు, అనేక బలిదానాలను మరోసారి గుర్తుకుతెచ్చుకొని దేశం మొత్తం పునరుత్తేజం అవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమం నుంచి దండి యాత్రను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.