1. ఉభయ సభలు 15కు వాయిదా
సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగిన క్రమంలో పార్లమెంట్ ఉభయ సభలు ఈనెల 15వ తేదీకి వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశమవగా.. సాగు చట్టాలు, చమురు ధరలపై ఆందోళనకు దిగాయి విపక్షాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'విశాఖ ఉద్యమానికి మద్దతు'
విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఏపీకి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు తెలుపుతామని వెల్లడించారు. ఏపీ వాళ్లు కూడా తెలంగాణకు మద్దతుగా ఉండాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'యజమానులు సతమతం'
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ డివిజన్‌లో జనప్రియ మెట్రో క్లాసిక్ హోమ్స్‌లోని ఫ్లాట్ల యజమానులు ధర్నా చేపట్టారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో బిల్డర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కార్యకర్తల దాడి
ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి భర్తపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు వారందరినీ అక్కడినుంచి పంపివేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. చిరుతను తాళ్లతో కట్టిన యువకులు
జనావాసాల్లోకి తరచూ వస్తున్న చిరుతను.. లేగదూడను పట్టినంత సులువుగా బంధించారు కర్ణాటక మాండ్య జిల్లా, ఆర్కే పేట తాలూకా యచెనహళ్లి గ్రామానికి చెందిన యువకులు. ఎలాంటి రక్షణ వ్యవస్థ లేకుండానే చిరుతను తాళ్లతో కట్టి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.