1. 'హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించండి'
హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ సీజన్‌ను నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కత్తుల కోసం వేట
న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. నిందితులు వాడిన కత్తులను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన గత ఈతగాళ్లను పోలీసులు రంగంలోకి దింపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రైతుపై మోదీ ప్రశంసలు
మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ... హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ రైతును ప్రశంసించారు. వ్యవసాయంలో ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. శాస్త్ర విజ్ఞానం అంటే కేవలం భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన అంశం కాదన్న ప్రధాని.... ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి దానిని విస్తృతపర్చాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది'
అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడలేక ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కాంగ్రెస్ పతనం: షా
వారసత్వ రాజకీయాల కారణంగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనమవుతోందని విమర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. పుదుచ్చేరి నుంచి రూ.15వేల కోట్ల అవినీతి సొమ్మును గాంధీ కుటుంబానికి తరలించిందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.