తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 3PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​టెన్ న్యూస్ @ 3PM

By

Published : Feb 27, 2021, 2:59 PM IST

1. నీటిపై తేలాడే విద్యుద్​ కేంద్రం

ఎన్టీపీసీలో ఏడాదిలోగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. కరోనాతో ఆలస్యమైన సూపర్ థర్మల్ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. త్వరలోనే నీటిపై తేలాడే సోలార్ పలకలతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. పరిష్కారం చేసి చూపిస్తాం: హరీశ్

రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవి తరఫున ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఆమె మంచి విద్యావేత్త, సేవాభావం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. నేతలతో బండి భేటీ

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై భాజపా రాష్ట్ర కార్యాలయంలో సుదీర్ఘంగా నియోజకవర్గ నేతలతో చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. బిట్టు శ్రీను కోసం పోలీసుల పిటిషన్

న్యాయవాద దంపతుల హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసులో ఇప్పటికే ముగ్గురిని కస్టడీకి తీసుకున్న పోలీసులు... నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును కూడా కస్టడీకి ఇవ్వాలని మంథని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు

జోగులాంబ గద్వాల జిల్లాలో జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి గద్వాల ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి బ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'మహిళల రిజర్వేషన్లకు మద్దతు'

న్యాయవ్యవస్థ, పార్లమెంట్‌లో మహిళల రిజర్వేషన్లకు తాను పూర్తి మద్దతు ఇస్తానని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వెల్లడించారు. ఆర్​ఎస్​ఎస్​పై ఆరోపణలు చేశారు. దేశంలోని వ్యవస్థలను ఆ సంస్థ ‌ నాశనం చేస్తోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. న్యాయవాది దారుణ హత్య

కర్ణాటకలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. కోర్టు పరిధిలోనే న్యాయవాది​ని హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ప్రతినిధుల సభ​ ఆమోదం

కరోనాతో చిన్నాభిన్నమైన ప్రజల జీవితాలను ఆదుకునేందుకు జో బైడెన్​ ప్రభుత్వం ప్రకటించిన 1.9 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్​ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సెనేట్​ ఆమోదం కోసం పంపనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. జిమ్నాస్టిక్స్​ సమాఖ్యకు గుర్తింపు

ఎట్టకేలకు భారత జిమ్నాస్టిక్స్​ సమాఖ్యకు మోక్షం లభించింది. దానిని జాతీయ సమాఖ్యగా గుర్తిస్తూ కేంద్ర క్రీడా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'హౌస్​ అరెస్ట్​' టీజర్

కొత్త సినిమా కబుర్లు మిమల్ని అలరించేందుకు వచ్చేశాయి. ఇందులో 'హౌస్​ అరెస్ట్'​ టీజర్​, 'యువరత్న', 'ఏ1 ఎక్స్​ప్రెస్'​ సినిమా విశేషాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details