తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @3PM

By

Published : Jan 15, 2021, 2:59 PM IST

1. రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో టాప్​!

భారతదేశానికి అక్షయపాత్రగా తెలంగాణ ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అతి కొద్ది కాలంలోనే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. భారత ఆహార భద్రత సంస్థ ఆధ్వర్యంలో నిలవ ఉన్న ధాన్యంలో దాదాపు 63 శాతం వాటా తెలంగాణదే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు'

ప్రకృతివనాలు, వైకుంఠ ధామాల పనులు త్వరగా పూర్తి చేయాలని... పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు... గ్రామీణ మంచి నీటి సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కాళ్లు దువ్విన కోళ్లు

ఏపీలోని సంక్రాంతి సంబురాలు..... అంబరాన్నంటాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చిన పిల్లలు, పెద్దలు కలిసి పండుగ చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. వెనక్కి తగ్గని అన్నదాతలు

రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. సాగు చట్టాలపై రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిదో విడత చర్చలు జరుగుతున్నాయి. రైతుల తరపున చర్చల్లో 41 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కొత్త పార్లమెంటు పనులు షురూ

సెంట్రల్‌ విస్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి మరుసటి రోజును అత్యంత పవిత్రంగా భావించి ఈ నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఆలయానికి రాష్ట్రపతి విరాళం

అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరానికి తొలి విరాళం అందించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. చెక్కు రూపంలో రూ.5 లక్షలు ఇచ్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​, విశ్వహిందూ పరిషత్​ నేతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 35కు చేరిన మృతులు

ఇండోనేసియా భూకంప ఘటనలో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు 35 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు విపత్తు నిర్వహణ బృందం ముమ్మర చర్యలు చేపట్టింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. రోగులు తరలింపు- కారణమిదే...

భూమండలానికే ఆక్సిజన్​ అందించే అమెజాన్​ అటవీ ప్రాంతం కలిగిన బ్రెజిల్​లోని మనౌస్​ నగరంలో కొవిడ్​ రోగులకు ప్రాణవాయువు కొరత ఏర్పడింది. ఆక్సిజన్​ అందక మృత్యు ఒడికి దగ్గరవుతున్నారు. డజన్ల కొద్దీ రోగులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆస్ట్రేలియా పరుగులేంతో తెలుసా

బ్రిస్బేన్​ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతోన్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్​ చేస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్​ జట్టు 274 పరుగులు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'సలార్​' షురూ

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ కొత్త చిత్రం 'సలార్'​.. పూజా కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్​లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కన్నడ సూపర్​స్టార్​ యశ్​ విచ్చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details