తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్ @3PM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​ టెన్ న్యూస్ @3PM

By

Published : Jan 7, 2021, 2:55 PM IST

1. అఖిల ప్రియ తీర్పు వాయిదా

అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా పడింది. పిటిషన్‌పై వాదనలు ముగిసిన అనంతరం సికింద్రాబాద్ కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటం వల్ల వైద్యులు ఎంఆర్​ఐ, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'గ్యాస్ ​పైప్​లైన్ వద్దే వద్దు'

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు రైతులు గ్యాస్​పైప్​లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. గ్యాస్ పైప్​లైన్ నిర్మాణం జరిగే చోట అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మాదకద్రవ్యాల కేసులో విచారణ

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలతో పట్టుబడిన వేద ప్రకాశ్​ వ్యాస్‌ ఇంట్లో సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కూకట్‌పల్లి ప్రగతినగర్‌లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేయగా మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని సీపీ సజ్జనార్​ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ట్రాక్టర్ల ర్యాలీతో నిరసన

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్న అన్నదాతలు.. గురువారం ట్రాక్టర్ ర్యాలీ చెేపట్టారు. గణతంత్ర దినోత్సవం నాడు రాజ్​పథ్​లో నిర్వహించబోయే.. కవాతుకు రిహార్సల్​గా దీన్ని జరిపారు. 3,500కు పైగా ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఆరోగ్య మంత్రులతో హర్షవర్ధన్​​

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో వచ్చే లోటుపాట్లు గుర్తించి, వాటిని అధిగమించేందుకు ఈ నెల 8న దేశవ్యాప్తంగా మరోసారి డ్రైరన్ నిర్వహించనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో రేపటి డ్రై రన్, వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, ముందస్తు జాగ్రత్తలు, ఇతర విషయాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వర్చువల్​గా సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బైడెన్ విజయం ఖరారు

అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఖరారయ్యారు. ఈమేరకు బైడెన్​, కమల విజయాన్ని ఎలక్టోరల్ ఓట్ల ఆధారంగా అమెరికా కాంగ్రెస్​ ధ్రువీకరించింది. అధికారం చేపట్టేందుకు 270 ఓట్లు అవసరం కాగా... బైడెన్​కు 282, ట్రంప్​కు 138 ఓట్లు వచ్చినట్లు తేల్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ట్రంప్​ వర్గం రచ్చ

అమెరికా క్యాపిటల్​లో జరిగిన హింసాకాండ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బైడెన్​ విజయాన్ని ధ్రువీకరించేందుకు సమావేశమైన కాంగ్రెస్​ను అడ్డుకునేందుకు... ట్రంప్​ మద్దతుదారులు చేసిన ప్రయత్నంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరికొందురు గాయపడ్డారు. ఈ పూర్తి వ్యవహారాన్ని అమెరికా మాజీ అధ్యక్షులు, నేతలు ఖండించారు. హింసకు ట్రంప్​ ప్రేరేపించారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. తొలిరోజు ఆసీస్​దే

టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటల ఆట సాధ్యం కాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సామ్ ట్వీట్

'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్​ సిరీస్ రెండో భాగం గురించి నటి సమంత ట్వీట్ చేసింది. ఇందులో రాజీ ఎవరు? అంటూ అడుగుతూ రిలీజ్​ డేట్​ వెల్లడించి, ఓ వీడియోను పోస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details