1. సేఫెస్ట్ సిటీ హైదరాబాద్
భౌగోళికంగా హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక్కరోజులో, ఒక్క ప్రభుత్వంతో హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ రాలేదన్నారు. గత ఐదేళ్లల్లో నగరంలో ఐటీ పెట్టుబడులు రెట్టింపయ్యాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఎలక్ట్రిక్ హబ్
అమెజాన్ హైదరాబాద్‌కు వచ్చేందుకు అధికారులు ఎంతగానో కృషిచేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ హబ్‌గా మారుతోందని వెల్లడించారు. డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీసెంట్రలైజేషన్.. ఈ మూడు 'డి'లదే భవిష్యత్ అంతా అని మంత్రి పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కనబడట్లేదా?
గ్రేటర్ పోరులో తెరాస నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. డివిజన్లను చుట్టేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బన్సీలాల్‌పేట తెరాస అభ్యర్థి హేమలతకు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత తెరాసకే దక్కుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ప్రశ్నించే గొంతునే గెలిపించండి'
సొంత దేశంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలేసి వచ్చానని హైదర్ నగర్ డివిజన్ భాజపా అభ్యర్థి వెలగ శ్రీనివాస్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తనని కార్పొరేటర్‌గా గెలిపించాలని ఓటర్లను కోరారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ప్రతి ఇంటికి నీరు'
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్, సోన్‌భద్ర జిల్లాల్లో రెండు తాగునీటి సరఫరా ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు యూపీలోని కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.