1. వైభవంగా తుంగభద్ర పుష్కరాలు
వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఒంటి గంటా 20 నిమిషాల సుముహూర్త సమయంలో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్
వరద సాయంపై ఎస్‌ఈసీకి భాజపా లేఖరాసినట్టు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ముందుగా చెప్పినట్టుగానే భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే నకిలీ లేఖను సృష్టించారని, తన సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనత తెరాసదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆ సేవల వల్లే ఆర్టీసీ పుంజుకుంది!
కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఆర్టీసీ ఆదాయం సరికొత్త మార్గంలో దూసుకుపోతోంది. యువతకు ఉపాధినిచ్చేందుకు వారిలో వృత్తి నైపుణ్యాన్ని కలిగించే శిక్షణకు సై అంటోంది. కరోనా భయంతో ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించకపోవడం వల్ల డ్యూటీలు లభించట్లేదని ఆవేదన చెందిన ఉద్యోగులకు కార్గో వల్ల చేతినిండా పని కల్పిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ఉల్లంఘనలపై చర్యలు'
జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారి విశ్వజిత్ తెలిపారు. ఈ తొలగింపు ప్రక్రియ పోలింగ్ అయ్యేంతవరకు కొనసాగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'పాన్షాప్లా మారిన సీబీఐ'
మహారాష్ట్రకు చెందిన మంత్రి అస్లామ్ షేక్ సీబీఐపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాజపా పాలనలో సీబీఐ ఓ పాన్షాప్లా తయారైందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.