1. లేఖరాసినా స్పందించలేదు: కేటీఆర్
1916 తర్వాత ఈ ఏడాదే భారీ వర్షాలు కురిశాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మానవ తప్పిదాల వల్లనే ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొన్నారు. తక్షణ సాయం కోసం సీఎం రూ.550 కోట్లు కేటాయించారని.. బాధితులకు రూ.10 వేల చొప్పున వరద సాయం ప్రకటించారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మూడు రోజులు సెలవు
మిర్యాలగూడ మిల్లర్లు... మరో రెండు రోజులు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కొన్న ధాన్యాన్ని సర్దుబాటు చేసే క్రమంలో... ఈ నెల 9, 10 తేదీల్లో సరకు తీసుకురావొద్దని రైతులకు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. చర్చల్లోనూ పురోగతి శూన్యం!
చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిపిన ఎనిమిదో విడత చర్చల్లోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇరు దేశాల మధ్య శుక్రవారం జరిగిన చర్చల్లో.. సరిహద్దు ఉద్రిక్తతలపై నిర్మాణాత్మకంగా,లోతుగా సమాలోచనలు చేసినట్లు తాజాగా స్పష్టం చేసింది భారత సైన్యం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అమానవీయంగా ప్రవర్తించిన యజమాని
బెంగళూరు నేలమంగళలో అమానవీయ ఘటన జరిగింది. చేసిన పనికి జీతం అడిగితే వికృత చర్యలకు పాల్పడ్డాడు ఓ యజమాని. వంట చేసి వ్యక్తిని సిగరెట్‌తో కాల్చి, మూత్రం తాగేలా చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బైడెన్ సాఫీగా సాగేనా?
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా కట్టడి లక్ష్యంగానే తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టిసారించినట్లు స్పష్టమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.