1. చిరంజీవికి కరోనా పాజిటివ్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవికి కరోనా సోకింది. అయితే లక్షణాలు ఏం లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. లింక్ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్ ఎదుగుతుందని తెలిపారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక వసతులను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మరికొన్ని గంటల్లో ఉపఎన్నిక ఫలితం
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గానికి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరగగా.. ఫలితాలపై ఎప్పుడూ లేనంత ఆసక్తి ఈసారి ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బాణసంచా అమ్మకాలపై నిషేధం
దిల్లీతోపాటు దేశంలోని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో టపాసుల విక్రయాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధం విధించింది. వాయునాణ్యత మోస్తరుగా ఉన్న ప్రాంతాల్లో హరిత టపాసుల వినియోగించవచ్చని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మోదీ, నితీశ్‌కూ ట్రంప్‌కు పట్టిన గతే: శివసేన
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ లాంటి యువనేత ముందు ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ లాంటివారు నిలువలేరంటూ శివసేన వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరాభవం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.