1. 'సరిహద్దుల వరకు రండి'
"తెలంగాణలో స్థిరపడిన వారు ఏపీకి రావాలని చూస్తున్నారు. ఏపీ సరిహద్దు వరకు బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీని కోరుతున్నాం. తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. సరిహద్దు నుంచి గ్రామాలకు చేరవేసేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'కిలో ఉల్లి 35 రూపాయలే'
వినియోగదారులకు శుభవార్త. హైదరాబాద్ జంట నగరాల్లో ఉల్లిగడ్డల ధరలు 80 నుంచి 90 రూపాయలకు పెరిగిన నేపథ్యంలో సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం... వ్యాపారులు నిల్వచేసే పరిమితులపై ఆంక్షలు విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. '10 లక్షల ఉద్యోగాలు'
బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్జేడీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం 10లక్షల ఉద్యోగాలిస్తామని.. రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీనిచ్చారు యాదవ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆటోలో పేలుడు
జగద్గిరిగుట్ట సమీపంలో ఆటోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వక్తికి గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆకట్టుకుంటోన్న అమ్మవారి సైకత శిల్పం
నవరాత్రి సందర్భంగా ఒడిషా పూరీ బీచ్లో దుర్గామాత సైకత శిల్పాన్ని అద్భుతంగా రూపొందించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. 'కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నవరాత్రి పండుగను జరుపుకోమని' సందేశం ఇచ్చారు. ఈ శిల్పం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.