1. కేజ్రీవాల్‌కు కేసీఆర్ కృతజ్ఞతలు
భారీ వర్షంతో భాగ్యనగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు వరదలతో అస్తవ్యస్తమయ్యాయి. ఆర్థికంగా ఎంతో నష్టం చవిచూసిన తెలంగాణకు ఆపద సమయంలో అండగా నిలుస్తున్నాయి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు. రాష్ట్రానికి రూ.15 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్.. కష్టకాలంలో తెలంగాణకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'కాళేశ్వరంలో అతిక్రమణలు!'
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్-ఎన్జీటీ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్పు వెల్లడించిన ఎన్జీటీ.. పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు గుర్తించామని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కేటీఆర్ సమీక్ష
వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. కేసీఆర్ పిలుపు మేరకు 2 నెలల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేందుకు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. భారీ వర్షాలు !
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఆర్.కె. పురం డివిజన్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, చంపాపేట్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, బార్కస్‌లో వాన మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఐదుగురు మృతి!
కేరళలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతిచెందారు. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.