1. నాలుగు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
రాష్ట్ర శాసన మండలి ప్రారంభమైంది. సభలో నాలుగు చట్టసవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలి బయట వరద నీరు చేరడం వల్ల జీహెచ్‌ఎంసీ సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అప్రమత్తం చేశాం: కేటీఆర్
హైదరాబాద్‌లో వర్షాలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అన్ని విభాగాలు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేశామని చెప్పారు. ఆకాశం చిల్లులు పడుతుందా అన్నట్లుగా హైదరాబాద్‌లో వర్షాలు పడుతున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నామినేషన్
దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ వెళ్లి పత్రాలను సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. లైవ్ వీడియో: చూస్తుండగానే కొట్టుకుపోయిన వ్యక్తి
జంటనగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా సమీపంలోని బార్కాస్‌లో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే వరద నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ రెస్య్కూ టీమ్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. భాజపా గూటికి కుష్బూ- లాభం ఎవరికి?
రాజకీయ నాయకురాలిగా మారిన నటి కుష్బూ.. కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. ఆరేళ్లు అధికార ప్రతినిధిగా పనిచేసిన తర్వాత హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తమిళనాట అభినయంతో ఎంతో ఆదరణ దక్కించుకున్న కుష్బూ కాంగ్రెస్‌ను వీడటానికి బలమైన కారణాలే ఉన్నాయనే వాదనలు ఓవైపు.. ఇన్నాళ్లూ విమర్శలు గుప్పించిన భాజపాలో చేరటం వెనుక మర్మమేంటనే ప్రశ్నలు మరోవైపు. ఇంతకీ కుష్బూ ఇమేజ్ తమిళనాడులో భాజపాకు కలిసొస్తుందా? లేదంటే భాజపాలో చేరటం కుష్బూనే అందలం ఎక్కిస్తుందా ? మొత్తంగా కాషాయ కండువా కప్పుకున్న కుష్బూ భవిష్యత్ ప్రణాళికలెలా ఉండనున్నాయి ?పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.