1. 'ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీటింగ్'
హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని, పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సింగరేణి పంచాయతీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి పంచాయితీ సర్పంచ్ స్రవంతి ఉరివేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి చేర్చారు. కొద్ది నెలల నుంచి పంచాయితీలో నిధుల దుర్వినియోగంపై చర్చ కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. యాదాద్రీశుడి గోపురాలకు విద్యుత్ వెలుగులు
యాదాద్రీశుడి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతోన్నాయి. అందులో భాగంగా ప్రధానాలయ గోపురాలకు రంగురంగుల మెరిసే విద్యుద్దీపాలను అమర్చి అధికారులు ట్రయల్‌రన్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నడ్డివిరుస్తున్న ప్రైవేటు పరీక్షా కేంద్రాలు
కరోనా ఆపత్కాలంలోనూ ప్రైవేటు పరీక్ష కేంద్రాలు బాధితులను దోచుకుంటున్నాయి. ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.2200 వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని ల్యాబ్‌ల్లో రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. రూ.50 ఉండే ఎక్స్‌రేకి రూ.500-1000 వరకు వసూలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. నిరాడంబరంగా బక్రీద్ వేడుకలు
కరోనా వేళ బక్రీద్ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉదయం ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.