1. దేశంలో కొత్తగా 47 వేల మందికి వైరస్
భారత్‌లో వైరస్ ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 47,262 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 275 మంది కొవిడ్‌తో మరణించారు. 23 వేల మందికిపైగా వైరస్‌ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రాష్ట్రంలో మరో 431 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 431 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఫ్రీడం రన్ ప్రారంభం
అమృత్ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో ఫ్రీడం రన్ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఎల్బీ స్టేడియం వరకు 3కె రన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆ పరీక్షలుంటాయా ఉత్కంఠ
పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయా? రాష్ట్రంలో విద్యాసంస్థలన్నింటినీ బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఇది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. షటిల్ ఆడుతూ సీఐ మృతి
షటిల్ ఆడుతుండగా గుండెపోటుతో ఓ పోలీసు అధికారి ప్రాణాలొదిలారు. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయారు. సహచరులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.