తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 11AM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @11AM

By

Published : Oct 7, 2020, 10:59 AM IST

1. దేశంలో 67 లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 67 లక్షలు దాటింది. కొత్తగా 70,049 మంది ఈ వైరస్​ బారిన పడ్డారు. మరో 986 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులోనే దాదాపు 12 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. అదే సమయంలో కరోనా రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రాష్ట్రంలో 2,154

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 2,154 కొవిడ్​ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,04,748కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 1,189 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'త్వరలో జీహెచ్​ఎంసీ ఎన్నికలు'

నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన... త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'నన్నెవరూ పట్టించుకోవడం లేదు'

నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఆసుపత్రుల్లో కరోనాకు సరైన చికిత్స అందించండం లేదు... చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్​కు రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మళ్లీ 'పళనిస్వామి'కే ఓటు

వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'సిట్'‌ నివేదిక ఆలస్యం

హాథ్రస్​ ఘటనపై నియమించిన సిట్​ నివేదిక ఆలస్యం కానుంది. దర్యాప్తు ఇంకా పూర్తికాని నేపథ్యంలో నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజులు సమయమిచ్చింది యోగి సర్కార్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. లాభాల బాటలోకి..

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్​ 306 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 39 వేల 881 వద్ద ఉంది. నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 11 వేల 740 వద్దకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ప్రశ్నించిన 40 దేశాలు

మైనారిటీ వర్గాలపై చైనా తీరును 40 పశ్చిమ దేశాలు తప్పుబట్టాయి. నూతన జాతీయ భద్రత చట్టం వల్ల హాంకాంగ్​లోని మానవహక్కులకు భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'సూర్య బ్యాటింగ్​ అద్భుతం'

జట్టులో మెరుగైన ఆటగాళ్లు ఉండటం వల్లే తమను విజయం వరిస్తోందని ముంబయి ఇండియన్స్ కెప్టెన్​ రోహిత్​ శర్మ అన్నాడు. మంగళవారం రాజస్థాన్​తో మ్యాచ్​ అనంతరం పలు విషయాలు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఫిల్మ్​సిటీలో రవితేజ 'క్రాక్'

రవితేజ 'క్రాక్'​ సినిమా షూటింగ్.. రామోజీ ఫిల్మ్​సిటీలో బుధవారం నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో, లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశముంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details