1. కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 2,083 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 64,786కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఒక్కరోజులో 57 వేలకుపైగా కేసులు
దేశంలో కొవిడ్ విలయతాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 57,117 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 764 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు
బక్రీద్ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలతో ఈ ఆనందాన్ని పంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీటింగ్తో అరికడదాం: కిషన్ రెడ్డి
హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని, పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. శానిటైజర్ తాగిన వారిలో నలుగురికి కరోనా
ఏపీలోని కురిచేడులో శానిటైజర్ తాగి 10మంది మృతి చెందిన ఘటనలో.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మృతదేహాలకు కరోనా ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. పాక్ సైన్యం కాల్పులు
సరిహద్దు వెంట పాకిస్థాన్ దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోని పుంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్ సైన్యం. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'సచిన్ నాలోని ఉత్తమ బౌలర్‌ను వెలికితీశాడు'
సచిన్ వంటి దిగ్గజ క్రికెటర్‌కు బౌలింగ్ చేయడం ఆనందంగా ఉందని ఆస్ట్రేలియీ మాజీ పేసర్ బ్రెట్‌లీ అన్నాడు. తనలోని ఉత్తమ బౌలర్‌ను సచిన్ బయటకు తీసుకొచ్చినట్లు తెలిపాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించాడు లీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. '2జీ సేవలను చరిత్రలో కలిపేయాలి'
2జీ సేవలపై కీలక వ్యాఖ్యలు చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ. 2జీ సేవలను చరిత్రలో కలిపేయాలన్నారు. దేశంలో తొలి మొబైల్‌కాల్ ఆరంభమై 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అంబానీ మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. చైనా విషయంలో భారత్‌కు అగ్రరాజ్యం సంపూర్ణ మద్దతు
చైనాతో ఘర్షణ విషయంలో భారత్‌కు అగ్రరాజ్యం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణ, సైనిక ఘర్షణను.. అమెరికా పార్లమెంట్ సభ్యులే కాకుండా ఇతర నేతలు సైతం తప్పుబడుతున్నారు. భారత్‌కు సంఘీభావంగా ప్రధానికి లేఖలు రాస్తున్నారు. భారత్‌కు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు 'జెర్సీ' చిత్రం
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జెర్సీ'. గతేడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. తాజాగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు నోచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.