1. దేశంలో ఒక్కరోజే 22 వేల 771 కేసులు, 442 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22 వేల 771 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులోనే మరో 442 మంది కొవిడ్‌కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వందే భారత్ మిషన్‌లో.. బంగారం స్మగ్లింగ్!
రాజస్థాన్ జైపుర్ విమానాశ్రయంలో... బంగారం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్ల ముఠాను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ
రాష్ట్రపతి భవన్లో గురుపూర్ణిమ, ధర్మచక్ర దినోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయమని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అర్హులైన రైతులందరికీ రైతుబంధు సొమ్ము
రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ రైతుబంధు సొమ్ము అందజేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు డబ్బులు అందకపోతే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో శుక్రవారం... 20 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఏడేసి చొప్పున... యాదాద్రి జిల్లాలో ఆరు ఉన్నాయి. మూడు జిల్లాల్లో వలస జాబితాలో చేరిన వారితో కలిపి... కేసుల సంఖ్య 250 దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.