1. దంపతులపై కత్తులతో ఎటాక్..
అర్ధరాత్రి భార్యాభర్తలపై దుండగులు కత్తులతో దాడి చేశారు.. కారణం తెలియలేదు కానీ విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. దాడిలో భర్త అక్కడికక్కడే రక్తపు మడుగుల్లో మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. ఐదు లక్షలకు చేరువలో కేసులు..
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 17,296 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 407 మంది కరోనా కాటుకు బలయ్యారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
3. 'సర్వ విఘ్నాలను తొలిగించే విఘ్నేశ్వరుడికి విఘ్నాలు'
సర్వ విఘ్నాలను తొలిగించే విఘ్నేశ్వరుడికి.. విఘ్నాలు తప్పడం లేదు. ఈ ఏడాది భారీ విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో తయారు చేయవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. విగ్రహాలను రూపొందించేందుకు సామగ్రి లభించక బొజ్జ గణపయ్యల తయారీకి ఆటంకం ఏర్పడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. పిడుగుల వర్షం: 105కు చేరిన మృతుల సంఖ్య
బిహార్లోని వివిధ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 105కు పెరిగింది. రానున్న 72 గంటల్లో ఉత్తర బిహార్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతారవరణ శాఖ హెచ్చరించింది. అధికారులను అప్రమత్తం చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. వందే భారత్ మిషన్: స్వదేశానికి 3.6 లక్షల మంది
వందే భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 3.6 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. మొత్తం 5 లక్షల 13 వేల 47 మంది ఇందులో నమోదు చేసుకున్నట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
6. ఉన్నవి ఉపయోగించరు.. కొత్తవాటికి అనుమతివ్వరు!
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుంటే.. ప్రభుత్వం, అధికారులు మాత్రం.. అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కేసులు పెరుగుతూ.. పరీక్షలు చేయాల్సిన అవసరం పెరుగుతుంటే.. పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచకుండా వైద్య ఆరోగ్య శాఖ జాప్యం చేస్తున్నది.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
7. 30 ఏళ్ల తర్వాత విజేతగా నిలిచిన లివర్పూల్
ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్లో లివర్పూల్ జట్టు విజేతగా నిలిచింది. ఇంకా 7 మ్యాచ్లు ఉండగానే టైటిల్ను సొంతం చేసుకుంది. అనంతరం కరోనా ప్రభావంతో స్టేడియం బయట చాలామంది తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
8. లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో పాటు ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు వంటి హెవీ వేయిట్ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
9. చైనాకు సవాల్: భారత్కు అమెరికా బలగాలు!
ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు పొరుగు దేశాలతో దుస్సాహసాలకు పాల్పడుతోన్న చైనాకు దీటైన సమాధానం చెప్పేందుకు ప్రణాళిక రచిస్తోంది అమెరికా. ఇటీవలి కాలంలో భారత్ సహా ఇతర దేశాలపై బెదిరింపులకు పాల్పడుతోన్న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కొనేందుకు ఆసియాలో తమ బలగాల మోహరింపుపై సమీక్షిస్తున్నట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
10. తోటమాలిగా చిరంజీవి.. కెమెరా పట్టిన మమ్ముట్టి
లాక్డౌన్తో ఇంట్లోనే ఉంటున్న పలువురు సినీ సెలబ్రిటీలు.. తమకిష్టమైన అభిరుచులవైపు దృష్టి సారిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మమ్ముట్టి, తమన్నా, సమంత, పూజాహెగ్డే తదితరులు ఉన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.