తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2022, 12:58 PM IST

Updated : Aug 18, 2022, 1:04 PM IST

ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 1PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS

  • గోదావరికి తగ్గిన వరద, కృష్ణాలోకి పోటెత్తుతున్న ప్రవాహం

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా, గోదావరిల్లోకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. అయితే నిన్నటి కంటే గోదావరి వద్ద నీటిమట్టం స్వల్పంగా తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 53 అడుగుల వద్ద ప్రవహిస్తోందని చెప్పారు. మరోవైపు జూరాలకు మాత్రం వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోందని అన్నారు.

  • నగ్న వీడియోలతో బెదిరింపులు, చివరికి కటకటాల లెక్కింపు

మహిళలను భయపెట్టో, ప్రలోభపెట్టో నగ్నంగా వీడియో కాల్‌ చేసేలా ఒత్తిడి తెచ్చి.. దాన్ని రికార్డు చేసి, వారిని బెదిరించి కొందరు మోసగాళ్లు లొంగదీసుకుంటున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో మూడు వారాల వ్యవధిలోనే ఇలాంటివి రెండు కేసులు నమోదవడం గమనార్హం. అసలు ఏం జరిగిందంటే.

  • జాతీయ రహదారిపై దోపిడీ దొంగల హల్​చల్​

తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు హల్‌చల్‌ చేశారు. దొంగలు నలుగురు డ్రైవర్లను కత్తులతో పొడిచారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లను విసిరారు.

  • బిల్కిస్​ బానో ఘటనలో దోషుల విడుదలపై బాధితురాలు అసహనం

గోద్రా అల్లర్లలో బిల్కిస్​ బానోపై జరిగిన అత్యాచార ఘటనలో దోషులను విడుదల చేయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దోషులను విడుదల చేయడం తనతోనే కాకుండా కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతీ మహిళ స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

  • ప్రేమ పేరుతో వేధింపులు, నడిరోడ్డులో యువతిపై కాల్పులు

ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిపై కాల్పులు జరిపిన ఘటన బిహార్‌లో జరిగింది. ఈ ఘటనలో గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పట్నాలోని సిపారా ప్రాంతంలోని ఇంద్రాపురి వద్ద.. ఈ ఘటన జరిగింది.

  • నకిలీ ముఠా గుట్టురట్టు, ఏకంగా పోలీస్​ స్టేషన్​నే ఏర్పాటు చేసి

నకిలీ పోలీసులుగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటన బిహార్​లోని బాంకా జిల్లాలో జరిగింది. నిందితుల వద్ద నుంచి ఆయుధాలు, యూనిఫామ్స్, ఎఫ్​ఐఆర్​ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

  • ముగ్గురు కుమార్తెలతో కలిసి వ్యక్తి బలవన్మరణం, రైలు కింద పడి

ఒక వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతటి హృదయ విదారక సంఘటనకు కారణమేంటన్న విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో ఈ ఘటన జరిగింది.

  • ప్రపంచకప్​పై కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

ఫిఫాతో చర్చలు జరిపి అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను దేశం దాటి వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఆ వివరాలు

  • వీల్​చైర్​లో దిగ్గజ బాక్సర్​ మైక్​టైసన్​, ఏమైంది

లైగర్​ సినిమాలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ బాక్సర్ మైక్​టైసన్​ వీల్​చైర్​లో కదలలేని పరిస్థితిలో ఉన్న ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయనకు ఏం అయిందంటే.

  • ప్రోమోతో ఆ పదానికి క్లారిటీ ఇచ్చిన నాగ్​ ఘోస్ట్​ టీమ్

తమ హగనే ఈ ఒక్క పదానికి అర్ధం తెలియక సినీ ప్రియులు తికమక పడుతున్న సమయంలో ది ఘోస్ట్​ చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దానికి అర్థం చెబుతూ ఓ ప్రోమోను విడుదల చేసింది.

Last Updated : Aug 18, 2022, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details