తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

TOP NEWS
TOP NEWS

By

Published : Dec 9, 2021, 6:16 AM IST

Updated : Dec 9, 2021, 10:05 PM IST

21:44 December 09

టాప్​న్యూస్​@ 10PM

  • రావత్​ పార్థివదేహానికి మోదీ నివాళి

Mortal remains of cds: భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా 11 మంది సైనికులు భౌతికకాయాలకు నివాళులర్పించారు మోదీ, పలువురు ప్రముఖులు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

  • త్రివిద దళాల అధినేతల​ నివాళులు

భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలకు నివాళులర్పించారు ఆర్మీ, వాయుసేన, నౌకాదళ అధినేతలు జనరల్​ ఎంఎం నరవాణె, మార్షల్​ వీఆర్​ చౌదరి, అడ్మిరల్​ ఆర్​ హరి కుమార్​. పాలం ఎయిర్​బేస్​కు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. అమరుల కుంటుంబాలకు సంతాపం తెలిపారు.

  • ఎయిర్​పోర్ట్​లో రూ.200 కోట్లపైగా హెరాయిన్​​ సీజ్​

Drugs News Mumbai: మహారాష్ట్ర, త్రిపుర, బంగాల్​ రాష్ట్రాల్లో అధికారులు జరిపిన సోదాల్లో మాదకద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి. ముంబయిలో రూ.247 కోట్లు విలువ చేసే హెరాయిన్​ను గుర్తించారు అధికారులు

  • రాజమౌళిని డామినేట్​ చేసిన హీరో అతడే!

ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలంటే ఓ రేంజ్​లో ఉంటాయి. హీరోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి రాజమౌళి డైరెక్షన్​ డామినేట్​ చేసిన ఓ హీరో ఉన్నారు. ఇంతకీ అతడెవరు? ఏ సినిమాకు అలా జరిగింది?

  • 'అలా ఆటగాడి విలువను చెప్పలేం'

Virat Kohli Captaincy: టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వన్డే జట్టుకు సారథిగా తప్పించడంపై మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ స్పందించాడు. బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుందని సమర్థించాడు.

20:47 December 09

టాప్​న్యూస్​@ 9PM

  • పార్థివదేహాలకు రాజ్​నాథ్​, అజిత్​ డోభాల్​ నివాళులు

తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలకు నివాళులర్పించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. దిల్లీలోని పాలం ఎయిర్​బేస్​కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల కుటుంబాలతో మాట్లాడి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • దేశం గర్వించేలా తీర్చిదిద్దాలి

సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో కలిసి సాయంత్రం సచివాలయ ప్రాంగణానికి వచ్చిన సీఎం... గంటన్నర పాటు పరిశీలించారు.

  • అంబులెన్స్​కు ప్రమాదం!

తమిళనాడులోని కున్నూర్‌లో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్సుకు ప్రమాదం జరిగింది.

  • ఆ విమాన సర్వీసులపై కీలక ప్రకటన

Flights Ban: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోమారు పొడిగించింది డీజీసీఏ. 2022 జనవరి 31 వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలే ఇందుకు కారణమని పేర్కొంది.

  • కోహ్లీని అందుకే తొలగించాం

Ganguly on Virat Kohli: టీమ్​ఇండియా వన్డే జట్టు సారథిగా కోహ్లీని తొలగించి రోహిత్​ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఈ అంశంపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

19:45 December 09

టాప్​న్యూస్​@ 8PM

  • 'అగ్గిపెట్టె'తో ఆర్మీలోకి​..!

Bipin Rawat first job: సైన్యంలో నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన భారత తొలి త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​.. బుధవారం జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కఠిన పరీక్షలను దాటుకుని ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. సైన్యంలో చేరేందుకు ఎదుర్కొన్న తొలి ఇంటర్వ్యూ తనకు ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పేవారు రావత్‌. ఆ రోజు తాను చెప్పిన 'అగ్గిపెట్టె' సమాధానమే తనను ఇక్కడిదాకా తీసుకొచ్చింది అనేవారు.

  • రాష్ట్రపతితో రాజ్​నాథ్​ భేటీ

Rajnath Singh Kovind: భారత త్రిదళాధిపతి సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన హెలికప్టర్​ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు కీలక విషయాలు తెలిపారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఇప్పటికే త్రివిధ దళాలు దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

  • పీఆర్సీపై కీలక ప్రకటన..!

PRC Update: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఎంత మేర ఫిట్​మెంట్ ఇవ్వాలనే విషయమై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఉద్యోగుల ఆందోళన దృష్ట్యా.. వారి డిమాండ్ల పరిష్కార మార్గాలపై సీఎం సమాలోచనలు జరిపారు. రేపో మాపో పీఆర్సీపై ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన జారీ చేసే అవకాశాలున్నాయి.

  • 'రావత్​ నిజమైన నాయకుడు'

Rawat Helicopter Crash: సీడీఎస్​ బిపిన్​ రావత్​ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్​, నేపాల్​ ప్రధానులు. రావత్​ తమకు మంచి స్నేహితుడని ఇరు దేశాల ప్రధానులు పేర్కొన్నారు.

  • ఆ స్టెప్​తో ఎన్టీఆర్​కు​ కష్టాలు!

'నాటు నాటు' పాట వెనకున్న కష్టాన్ని హీరో ఎన్టీఆర్ వివరించారు. ముంబయిలో ట్రైలర్​ ఆవిష్కరణలో ఈ విషయాన్ని చెప్పారు.

18:40 December 09

టాప్​న్యూస్​@ 7PM

  • ఆర్మీకి అది సవాలే

Bodies Identification: తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రమాద తీవ్రత కారణంగా ఆ మృతదేహాలను గుర్తించడం ఆర్మీకి చాలా కష్టంగా మారింది.

  • ఇద్దరు దుర్మరణం

మహబూబ్‌నగర్ జిల్లా అప్పాయిపల్లి స్టేజి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- కారు ఢీకొని ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

  • పల్లకిలో అంబులెన్సు సేవలు .. !

Palki ambulance: అటవీ ప్రాంతాల్లో నివసించేవారి వైద్య అవసరాలను తీర్చేందుకుగాను బంగాల్​లోని ఓ జిల్లా అధికారులు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. 'పాల్కీ అంబులెన్సు' ద్వారా రోగుల ప్రాణాలను కాపాడవచ్చని వారు చెబుతున్నారు. ఇంతకీ ఈ అంబులెన్సు విశేషాలేంటంటే..?

  • ఒక్కటైన విక్కీ-కత్రినా

విక్కీ-కత్రినా వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు. గురువారం మధ్యాహ్నం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

  • అతని అవసరం ఎంతో ఉంది

Rohit Sharma ODI Captain: టీమ్​ఇండియా వన్డే సారథి రోహిత్​ శర్మ.. తన భార్య రితికను పొగుడుతూ పలు వ్యాఖ్యలు చేశాడు. మొదటి నుంచి రితిక తనకు అండగా నిలిచిందని అన్నాడు. మాజీ సారథి విరాట్​ కోహ్లీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు రోహిత్. జట్టుకు కోహ్లీ అవసరం ఎంతో ఉందని గుర్తుచేశాడు.

17:54 December 09

టాప్​న్యూస్​@ 6PM

  • శిల్పా చౌదరికి మరోసారి పోలీసు కస్టడీ

శిల్పా చౌదరికి మరోసారి పోలీసు కస్టడీ కోర్టు అనుమతి ఇచ్చింది. దర్యాప్తులో పురోగతి కోసం మళ్లీ పోలీసులు కస్టడీ కోరారు.

  • ' బ్లాక్ బాక్స్ కీలకం'

త్రివిధ దళాలను సమన్వయ పరిచి దేశానికి ఎనలేని సేవలు సీడీఎస్ బిపిన్ రావత్ అందించారని వైమానిక దళ విశ్రాంత వింగ్ కమాండర్ టీజే రెడ్డి తెలిపారు. సైనిక హెలికాప్టర్ కూలి బిపిన్ రావత్‌ దుర్మరణం చెందడం త్రివిద దళాలకు తీరనిలోటన్నారు. హెలికాప్టర్ కూలిన ఘటనలో దర్యాప్తు తర్వాత కారణాలు వెల్లడవుతాయంటున్న టీజే రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.

  • ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Local Body MLC Elections 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే బ్యాలెట్‌ బాక్సులు పోలింగ్‌ కేంద్రాలకు చేరాయి. సిబ్బందికి శిక్షణ, ఓటర్లకు అవగాహన, భద్రత సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.

  • '2030 నాటికి ​ సొంత అంతరిక్ష కేంద్రం'

India Space Station Program: 2030 నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ అంశాన్ని వెల్లడించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

  • అందుకు సిద్ధంగా ఉండాల్సిందే..

Corona Situation India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్​-19 క్లినికల్​ చికిత్సలో ఉపయోగించే 8 డ్రగ్స్​ బఫర్​ స్టాక్​ ఉండేలా చూసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది.

16:51 December 09

టాప్​న్యూస్​@ 5PM

  • సచివాలయ పనులను పరిశీలించిన సీఎం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకొంది.

  • అమరుల కాన్వాయ్​పై పూలవర్షం

తమిళనాడులోని బుధవారం జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం వారి భౌతికకాయాలను తరలిస్తున్న క్రమంలో స్థానికులు నివాళులు అర్పించారు

  • మూడేళ్ల తర్వాత ​ విడుదల

Sudha Bharadwaj released: భీమా-కోరెగావ్​ కేసులో అరెస్టయిన సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్​ విడుదలయ్యారు. బాంబే హైకోర్టు ఇటీవలే డీఫాల్ట్​ బెయిల్​ మంజూరు చేసిన క్రమంలో మూడేళ్ల తర్వాత బయటకు వచ్చారు.

  • ఆరేళ్ల తర్వాత రిలీజ్

రానా చేసిన ఓ సినిమాకు ఆరేళ్ల తర్వాత మోక్షం లభించింది. ఎట్టకేలకు థియేటర్లలో విడుదలవుతోంది. గురువారం ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

  • బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

Fans Reaction on Kohli ODI Captaincy: విరాట్​ కోహ్లీని వన్డే జట్టుకు సారథిగా తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. రోహిత్ శర్మను కెప్టెన్​గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో బీసీసీఐ, గంగూలీపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు అభిమానులు.

15:46 December 09

టాప్​న్యూస్​@ 4PM

  • వారిద్దరిదీ కుమ్మక్కు రాజకీయం

తెరాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. వికారాబాద్​ జిల్లా కొడంగల్‌ గాంధీనగర్‌లో కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రేవంత్‌ ప్రారంభించారు.

  • 'సీఎం జగన్ పట్టించుకోవడం లేదు'

సినిమా వ్యాపారంలో రాజకీయ జోక్యం తగదని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. ఏపీ సీఎం జగన్ ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • మూడేళ్ల తర్వాత ​ విడుదల

Sudha Bharadwaj released: భీమా-కోరెగావ్​ కేసులో అరెస్టయిన సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్​ విడుదలయ్యారు. బాంబే హైకోర్టు ఇటీవలే డీఫాల్ట్​ బెయిల్​ మంజూరు చేసిన క్రమంలో మూడేళ్ల తర్వాత బయటకు వచ్చారు.

  • కన్నతల్లే కూతురిని బలవంతంగా..

బలవంతంగా రొంపిలోకి దింపుతున్న తల్లి చెర నుంచి పదహారేళ్ల అమ్మాయిని చైల్డ్​లైన్​ ప్రతినిధులు కాపాడారు. ఆ అమ్మాయిని తమ రక్షణలోకి తీసుకుని విచారించగా.. మరిన్ని దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రతినిధులు వెంటనే ఆ అమ్మాయిని పోలీసులకు అప్పగించి.. తల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

  • లాభాల్లో ముగిసిన​ మార్కెట్లు

Stock Market Today: గురువారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 30 పాయింట్లు పైగా పుంజుకుంది.

14:36 December 09

టాప్​న్యూస్​@ 3PM

  • సచివాలయ పనుల పరిశీలనకు సీఎం

సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.కాసేపట్లో సచివాలయ నిర్మాణ పనుల వద్దకు సీఎం కేసీఆర్‌ చేరుకోనున్నారు.

  • అలా అయితేనే చాపర్ జర్నీ సేఫ్​

Helicopter Safe Travel: బుధవారం జరిగిన ఘోర హెలికాప్టర్​ ప్రమాదంలో.. భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో.. అసలు హెలికాప్టర్​లో ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వాయు రవాణాలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? లోహవిహంగాలు గాల్లోకి ఎగిరేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూడండి.

  • నిరసనలకు ముగింపు- ఇళ్లకు రైతులు

Farmers protest end: దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఎట్టకేలకు ఇళ్లకు వెళ్లనున్నారు. ఏడాదికిపైగా చేస్తున్న నిరసనలకు ముగింపు పలికినట్లు సంయుక్త కిసాన్​ మోర్చా స్పష్టం చేసింది. ఈ క్రమంలో సింఘూ సరిహద్దులో కొందరు రైతులు.. తమ తాత్కాలిక నివాసాలను (టెంట్లు) తొలగిస్తున్నారు.

  • ట్విట్టర్ ట్రెండింగ్​లో తెలుగు సినిమాలు

ఈ సంవత్సరం అత్యధికంగా చర్చించుకున్న సినిమా విశేషాలను ట్విట్టర్​ గురువారం వెల్లడించింది. ఇందులో తెలుగు నుంచి సర్కారు వారి పాట, వకీల్​సాబ్ సినిమాలకు చోటు దక్కడం విశేషం.

  • ఇక మిగిలింది అదొక్కటే..!

మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేపట్టడం, తీరిక లేని బిజీ షెడ్యూల్‌, భారీ అంచనాలు, ప్రధాన ట్రోఫీలు సాధించలేకపోవడం.. లాంటి మానసిక ఒత్తిడి పరిస్థితుల్లోనూ జట్టును విజయవంతంగా నడిపించాడు విరాట్ కోహ్లీ. ఐసీసీ ట్రోఫీలను సాధించకపోవడం మినహా జట్టును అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా నడిపించాడు.

13:51 December 09

టాప్​న్యూస్​@2PM

  • ఈ రూల్స్​ ఫాలో అయితేనే..

Helicopter Safe Travel: బుధవారం జరిగిన ఘోర హెలికాప్టర్​ ప్రమాదంలో.. భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో.. అసలు హెలికాప్టర్​లో ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వాయు రవాణాలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? లోహవిహంగాలు గాల్లోకి ఎగిరేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూడండి.

  • 'నయాగరా'లో పడిన కారు

నయాగరా నది ప్రవాహంలో ఓ కారు చిక్కుకుపోయింది. నయాగరా ఫాల్స్​గా పిలిచే మూడు జలపాతాల సమూహంలోని అమెరికన్ ఫాల్స్​లో ఈ వాహనం బుధవారం మధ్యాహ్నం ఇరుక్కుపోయింది.

  • ఇకపై ఆడియో, వీడియో కాల్స్​

Gmail app update: సరికొత్త ఫీచర్లతో గూగుల్​ జీమెయిల్ యాప్​ అప్​డేట్​ను​ తీసుకురానుంది. ఇప్పటివరకు చాట్​కే పరిమితమైన జీమెయిల్ యాప్​లోని 'గూగుల్ చాట్'తో ఇకపై ఆడియో, వీడియో కాల్స్​ ద్వారా కూడా సంభాషించే అవకాశాన్ని కల్పించనుంది.

  • పసిడి పట్టేసిన వెయిట్​లిఫ్టర్

commonwealth weightlifting championship: తాష్కెంట్​లో జరుగుతున్న కామన్వెల్త్​ వెయిట్​లిఫ్టింగ్​ ఛాంపియన్​షిప్స్​లో భారత యువ వెయిట్​లిఫ్టర్​ జిల్లీ దాలబెహరా అదరగొట్టింది. మహిళల 49 కిలోల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకుంది.

  • ఢీ-13 టైటిల్‌ విజేత ఎవరంటే?

12:48 December 09

టాప్​న్యూస్​@ 1PM

  • బిపిన్​ రావత్​ మృతదేహానికి స్టాలిన్​ నివాళి

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతదేహానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ నివాళులు అర్పించారు. హెలికాప్టర్ ఘటనలో మరణించిన 13మందికి శ్రద్ధాంజలి ఘటించారు.

  • ధర్నాచౌక్ వద్ద అఖిలపక్షం రైతు ధర్మాగ్రహ దీక్ష

గతంలో మాదిరి కేంద్ర సర్కార్ వానాకాలం ధాన్యం కొనుగోలు చేయాలని అఖిల పక్షం డిమాండ్ చేసింది. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర విధానాలను నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రైతు ధర్మాగ్రహ దీక్ష చేపట్టింది.

  • 'నశా విముక్త భారత్‌ అభియాన్‌'

మత్తు మాయ..! పెద్దోళ్ల వ్యవహరమిది..! ఒకప్పుటి మాట ఇది. ఈ మాయ ఇప్పుడు మన గల్లీల్లోకి చొరబడింది. విద్యార్థులను, యువతను ఈ రొంపిలోకి దింపుతోంది. ఆరోగ్యాన్నే కాదు... మానసిక ప్రశాంతతనూ నాశనం చేస్తోంది. విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయి. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతు న్నాయి...డీ-అడిక్షన్‌ కేంద్రాలు.

  • రావత్​ దుర్మరణంపై చైనా, పాక్ రియాక్షన్​

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి(సీడీఎస్​)​ జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్​ సహా వివిధ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. భారత రక్షణ రంగంలో రావత్ చేసిన సేవలను స్మరించుకున్నాయి.

  • 'టీమ్​ఇండియాకు గోల్డెన్​ ఛాన్స్​'

Harbhajan singh: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్​ఇండియాకు సువర్ణావకాశం ఉందన్నాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఆ జట్టు ప్రస్తుతం పటిష్ఠంగా లేదని, సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్​ విజయం నమోదు చేసేందుకు ఇదే సరైన సమయమని చెప్పాడు.

12:05 December 09

టాప్​న్యూస్​@ 12PM

  • గ్రూప్‌ కెప్టెన్ వరుణ్‌సింగ్ ఆరోగ్యం విషమం

Pilot Varun Singh: కూనూర్​ హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కెప్టెన్​ వరుణ్​ సింగ్​.. ప్రస్తుతం వెల్లింగ్​టన్​ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రకటించారు.

  • బిపిన్​ రావత్​ మృతదేహానికి స్టాలిన్​ నివాళి

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతదేహానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ నివాళులు అర్పించారు. హెలికాప్టర్ ఘటనలో మరణించిన 13మందికి శ్రద్ధాంజలి ఘటించారు.

  • దిల్లీ రోహిణి కోర్టులో పేలుడు..

Rohini court explosion today: దిల్లీ రోహిణి కోర్టులో ల్యాప్​టాప్​ పేలుడు జరిగినట్టు సమాచారం. పేలుడులో ఒకరు గాయపడినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ప్రారంభమైంది. వర్చువల్‌గా సమావేశమైన ఈ భేటీలో .. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల తాగు, సాగు అవసరాలకు నీటి విడుదలపై చర్చిస్తున్నారు.

  • బీజింగ్​ ఒలింపిక్స్​ బహిష్కరణ

Beijing Olympics boycott: అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా, యూకే, కెనడా పయనించాయి. 2022 బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. పలు అంశాలపై చైనాతో తీవ్ర విభేదాలు కొనసాగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

10:56 December 09

టాప్​న్యూస్​@ 11AM

  • హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం

IAF helicoptor black box found: తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ తాలూకు బ్లాక్​బాక్స్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్​బాక్స్ లభ్యమైంది.

  • రావత్ భౌతికకాయానికి నివాళులు

తమిళనాడు హెలికాప్టర్ ఘటనలో మరణించిన సీడీఎస్​ జనరల్​ బిపిన్ రావత్ భౌతిక కాయాన్ని మిలిటరీ ఆస్పత్రి నుంచి వెల్లింగ్టన్‌ మద్రాస్ రెజిమెంటల్ కేంద్రానికి తరలించారు.

  • బిపిన్​ రావత్​ కోసం..

సీడీఎస్​ బిపిన్​ రావత్​కు నివాళిగా.. విపక్షాలు ఓ నిర్ణయం తీసుకున్నాయి. 12మంది ఎంపీల సస్పెన్షన్​పై ఆందోళనలు చేస్తున్న విపక్షాలు.. గురువారం నిరసనలను నిలిపివేశాయి.

  • జవాన్ సాయితేజ ప్రస్థానం

Jawan Saiteja Journey in Army: బాల్యం నుంచే సైన్యంలో చేరాలన్నది అతని ఆశయం.. అహోరాత్రులు శ్రమించి కలలు గన్న ఆశయాన్ని చేరుకున్నారు.. ఆర్మీలో తొలుత డ్రైవర్‌గా చేరి.. కఠినమైన వడపోత తర్వాత పారా కమాండో అయ్యారు. అదే క్రమంలో త్రివిధ దళాధిపతి వ్యక్తిగత భద్రత సిబ్బంది స్థాయికి ఎదిగాడు చిత్తూరు జిల్లా ఎగువరేగడ బిడ్డ సాయితేజ.

  • 'ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్​ రిలీజ్​

RRR Movie Trailer: 'ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్​ విడుదలతో థియేటర్లలో సందడి నెలకొంది. ఈ ప్రచార చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని సోషల్​మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు అభిమానులు. వాటిని మీరు చూసేయండి..

09:44 December 09

టాప్​న్యూస్​@ 10AM

  • క్రాష్​కి ఒక్క నిమిషం ముందు వీడియో

Coonoor army helicopter crash video: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయిన హెలికాప్టర్ ప్రమాదం తాలూకు దృశ్యాలు బయటకు వచ్చాయి. ప్రమాదం చివరి క్షణంలో హెలికాప్టర్.. దట్టమైన పొగమంచులోకి వెళ్లిపోవడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఆ తర్వాత హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది.

  • మరో 9 వేల మందికి కరోనా

Corona cases in India: భారత్​లో కరోనా రోజువారీ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 9,419 మంది కొవిడ్​ బారినపడ్డారు. వైరస్​​ ధాటికి మరో 159 మంది మృతి చెందారు. ఒక్కరోజే 8,251 మంది వైరస్​ను జయించారు.

  • స్పెషల్​ పోలీస్​కు ఆ బాధ్యత!

Telangana New Secretariat : కొత్త సచివాలయానికి కొత్త తరహా భద్రతా విధానాన్ని అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ కాకుండా స్పెషల్ పోలీస్​కు సచివాలయ భద్రతా బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒక ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 363 మంది సిబ్బంది పహారా కాసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

  • రోహిత్​కు వన్డే పగ్గాలు

rohit sharma captaincy news: టీమ్​ఇండియా వన్డే కెప్టెన్​గా రోహిత్​ శర్మను నియామకం మంచి నిర్ణయమని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. అయితే టెస్టులకు విరాట్​ కోహ్లీనే సారథిగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు కెప్టెన్లతో ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుందని చెప్పాడు వ్యాఖ్యాత హర్షా భోగ్లే.

  • విక్కీ-కత్రిన పెళ్లి-సెలబ్రిటీల సందడి

Vicky kaushal Katrina kaif wedding: బాలీవుడ్​ ప్రేమజంట విక్కీకౌశల్​-కత్రినాకైఫ్​ ఎట్టకేలకు తమ ప్రేమను సాధించుకోబోతున్నారు. మరి కొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులు, స్నేహితులు, పలువురు సెలబ్రిటీల సమక్షంలో సంగీత్​, హల్దీ, మెహందీ వేడుకలు బాగా జరిగాయి.

08:44 December 09

టాప్​న్యూస్​@ 9AM

  • శుక్రవారం బిపిన్​ అంత్యక్రియలు

Cremation of CDS Bipin Rawat: సీడీఎస్ జనరల్​ బిపిన్ రావత్ ఆయన సతీమణి ముధులికా రావత్ అంత్యక్రియలు శుక్రవారం దిల్లీలోని కంటోన్మెంట్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో దిల్లీకి తరలించనున్నారు.

  • సింగరేణిలో మోగిన సమ్మె సైరన్

Singareni Samme Today : కేంద్ర సర్కార్​ తీరును నిరసిస్తూ సింగరేణి కార్మికుల మూడ్రోజుల సమ్మె ప్రారంభమైంది. సమ్మె ప్రభావంతో చాలా చోట్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విధుల్లోకి వెళ్తున్న కార్మికులను కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి.

  • ఒమిక్రాన్‌.. టెస్టుల్లో సైతం గుర్తించలేని

Omicron stealth version: ఒమిక్రాన్‌ వేరియంట్‌ జన్యువులో మరిన్ని మార్పులకు గురైనట్లు ఆస్ట్రేలియా నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా నిర్ధరణ పరీక్షల్లో గుర్తించలేని ఒమిక్రాన్‌ తరహా రకాన్ని కనుగొన్నామని క్వీన్స్‌లాండ్‌ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.

  • చైనాతో టిమ్​ కుక్​ భారీ డీల్​

China Apple deal: యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​.. చైనాతో 275 బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా చైనాలో యాపిల్‌ భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఆ దేశ తయారీ రంగానికి అత్యాధునిక సాంకేతికతను సమకూర్చాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణను అందించాలి. ఒప్పందంలోని చాలా అంశాలను యాపిల్‌ ఇప్పటికే అమలు చేసినట్లు తెలుస్తోంది.

  • బాలకృష్ణను ఆ పాత్రలో చూడాలి'

Balakrishna C Kalyan Movie: బాలకృష్ణతో తన కలల ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉందని చెప్పారు నిర్మాత సి.కల్యాణ్‌. రామానుజ చార్యులు పాత్రలో బాలయ్యను చూడాలనేది చాలా మంది కోరిక అని పేర్కొన్నారు.

07:52 December 09

టాప్​న్యూస్​@ 8AM

  • రావత్​ మృతితో సైనిక సంస్కరణలకు శరాఘాతం!

General Bipin Rawat death: తమిళనాడు కూనూర్​లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ మరణించారు. దీంతో దేశంలో సైనిక సంస్కరణల ప్రక్రియకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

  • త్రిదళాధిపతిగా బిపిన్ రావత్ బాధ్యతలేంటంటే..?

Cds responsibilities: త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్ రావత్​ బుధవారం జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భారత సైన్యానికి దాదాపు 43 ఏళ్ల పాటు సేవలందించిన ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంతకీ త్రిదళాధిపతి​ ఏయే విధులు నిర్వర్తిస్తారంటే..?

  • ఒమిక్రాన్​పై రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖ

Omicron News: పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైన దృష్ట్యా తగు జాగ్రత్తలను సూచిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రోగులను ప్రత్యేకంగా ఐసోలేషన్​లో ఉంచాలని పేర్కొంది.

  • 246 రోడ్డు ప్రమాదాలే జరిగాయట

Road Accidents Telangana : తెలంగాణలో 2019లో 21,570 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో మద్యం మత్తులో జరిగినవి కేవలం 246 మాత్రమేనని పోలీస్‌శాఖ చెబుతున్న లెక్క. అంటే మొత్తం ప్రమాదాల్లో కేవలం 1.1 శాతం. అతి వేగం కారణంగా 20,669 (95.8 శాతం) ప్రమాదాలు సంభవించాయని నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలు సేకరించలేకపోవడం వల్లే అధిక శాతం ప్రమాదాలను ‘అతి వేగం’ ఖాతాలో వేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • 'బాలకృష్ణను ఆ పాత్రలో చూడాలనేది చాలా మంది కోరిక'

Balakrishna C Kalyan Movie: బాలకృష్ణతో తన కలల ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉందని చెప్పారు నిర్మాత సి.కల్యాణ్‌. రామానుజ చార్యులు పాత్రలో బాలయ్యను చూడాలనేది చాలా మంది కోరిక అని పేర్కొన్నారు.

06:43 December 09

టాప్​న్యూస్​@ 7AM

  • ఏప్రిల్​లో వస్తానని చెప్పి..

Bipin Rawat Home: భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ మృతి పట్ల ఆయన మామయ్య భరత్ సింగ్​ రావత్​(70) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్​ 2018లోనే పుట్టిన గ్రామానికి వచ్చాడని గుర్తుచేసుకున్నారు. రిటైర్​మెంట్ కాగానే ఊర్లో ఇళ్లు నిర్మిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.

  • ఎంఐ-17వీ5 హెలికాప్టర్​ నమ్మకమైందే

Mi 17 v5 helicopter: భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ తమిళనాడు కూనూర్​లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరగడం వెనుక హెలికాప్టర్‌ లోపమేదైనా ఉందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే.. ఈ ప్రమాదంలో నేలకూలిన ఎంఐ-17వీ5 నమ్మకమైనదేనని సైనిక నిపుణులు చెబుతున్నారు.

  • ఐఐటీ హైదరాబాద్​ రికార్డు

IIT Hyderabad : క్యాంపస్ ప్లేస్​మెంట్స్ తొలిదశలో ఐఐటీ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఈ సంస్థ చరిత్రలో ఈసారి అత్యధికంగా 427 మంది విద్యార్థులకు 466 ఆఫర్లు లభించాయి. 104 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు నియామకాలు జరిపాయి. 65లక్షల రూపాయల గరిష్ట వేతనంతో విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.

  • అండర్​ కవర్​ పోలీస్​గా మెగాస్టార్ ?

సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ విభిన్న పాత్రలు చేస్తున్న అగ్రకథానాయకుడు చిరంజీవి.. కొత్త చిత్రంలో అండర్​ కవర్​ పోలీస్​గా కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారింది.

  • కృతిశెట్టి కోసం లేడి ఓరియేంటెడ్​​​ కథ!

Krithi Shetty New Film: దర్శకుడు విరించి వర్మ.. యువ హీరోయిన్​ కృతిశెట్టి కోసం కథానాయిక ప్రాధాన్యం ఉన్న ఓ కథను సిద్ధం చేసినట్టు తెలిసింది. చిరు తనయ సుస్మిత ఈ మూవీని నిర్మించనున్నారట!

05:33 December 09

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • నేలరాలిన త్రిదళపతి...

CDS General Bipin Rawat Passed Away: నాలుగు దశాబ్దాలకు పైగా భరతమాత సేవలో తరిస్తున్న మేరునగ శిఖరం కూలిపోయింది! భారత తొలి త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ నీలగిరి కొండల్లో నేలకొరిగారు. మాతృభూమి సేవకు సైనిక కళాశాలలో సన్నద్ధమవుతున్న యువ కిశోరాలకు సందేశాన్నిచ్చేందుకు తరలివెళ్లిన ఆయన.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

  • మోగిన కర్మికుల సమ్మె సైరన్‌...

Singareni strike: సింగరేణిలో సమ్మె ప్రారంభమైంది. నాలుగు బ్లాకులను ప్రైవేట్‌ వారికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాలతో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మూడ్రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే నోటీసులు అందజేసిన కార్మికులు... ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు విధులను బహిష్కరించనున్నారు.

  • నేడు సమావేశం కానున్న కేఆర్ఎంబీ

KRMB Meeting: తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలకు నీటి విడుదల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని... ఇరు రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నీటిపై నిర్ణయం తీసుకుంటారు.

  • మీ కాళ్లు మొక్కుతా... నాకు టీకా వద్దు సర్‌

old woman rajected covid vaccine: ఇంటింటికి తిరుగుతూ టీకాలు పంపిణీ చేస్తున్న సిబ్బందికి జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలంలో వింత పరిస్థితి ఎదురైంది. ఓ వృద్ధురాలు టీకా వేసుకోనని తెగేసి చెప్పడంతో వైద్యాధికారులు నిర్ఘాంతపోయారు. వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని తప్పనిసరిగి వేసుకోవాలని నచ్చచెబుతూ ప్రజాప్రతినిధులు బతిమలాడగా... మీకు దండం పెడుతా నాకు టీకా వద్దంటూ వృద్ధురాలు హంగామా సృష్టించింది.

  • లక్షల్లో కరెంటు బిల్లు..

Heavy current bill: యాదాద్రి భువనగిరి జిల్లాలో కరెంటు బిల్లుతో ఓ దుకాణ యజమానికి షాక్‌ కొట్టింది. అదేంటి కరెంటు బిల్లు షాక్‌ కొట్టడం ఏంటని ఆలోచిస్తున్నారా... ఆ బిల్లులో వచ్చిన మొత్తం చూస్తే ఎవరికైనా షాక్‌ కొట్టడం ఖాయం. ఎందుకంటే... నెలనెలా నాలుగైదు వందలు రావాల్సిన బిల్లు... ఏకంగా ఎంతవచ్చిందో తెలుసా?

  • శెభాష్ పోలీస్​..​

HYD Police saves life: తన అన్నతో చిన్న గొడవ జరిగింది. చాలా బాధపడ్డాడు. బతకటమే వృథా అనుకున్నాడు. వెంటనే గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇదంతా చూస్తున్న అతడి భార్య.. వద్దని ఎంత బతిమాలినా లాభం లేకపోయింది. ఇక ప్రాణం పోతోంది అన్న సమయంలో వారు వచ్చారు.. పోయే ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చారు.

  • సెప్టిక్ ట్యాంక్​ విషాదాన్ని సుమోటో పిల్​గా..

High Court on septic tank tragedy: గచ్చిబౌలిలో సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు మరణించిన ఘటనను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది.

  • 57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్​..

Omicron variant: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌.. 57 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ​ తెలిపింది. వైరస్‌ వ్యాప్తితో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

  • అండర్​ కవర్​ పోలీస్​గా మెగాస్టార్ ...

సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ విభిన్న పాత్రలు చేస్తున్న అగ్రకథానాయకుడు చిరంజీవి.. కొత్త చిత్రంలో అండర్​ కవర్​ పోలీస్​గా కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారింది.

  • ధోనీ లేకపోతే నా కెరీర్​ లేదు..

తనకు ధోనీతో ఉన్న అనుబంధం గురించి స్టార్ ఆల్​రౌండర్ బ్రావో చెప్పాడు. మహీ లేనిదే తన కెరీర్​ లేదని అన్నాడు. సీఎస్కేలో గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి ఆడారు.

Last Updated : Dec 9, 2021, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details