తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - తెలంగాణ న్యూస్​

TOP NEWS
TOP NEWS

By

Published : Dec 7, 2021, 6:06 AM IST

Updated : Dec 7, 2021, 10:00 PM IST

21:56 December 07

టాప్ న్యూస్@ 10PM

  • హైదరాబాద్​లో కలకలం..

Dead body in Water tank: హైదరాబాద్‌ ముషీరాబాద్‌ పరిధిలోని వాటర్‌ ట్యాంకులో మృతదేహం లభ్యమైంది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నీటి నుంచి దుర్వాసన వస్తోందని.. అప్పడప్పుడూ వెంట్రుకలు, చిన్న చిన్న మాంసం ముద్దలు వచ్చేవని స్థానికులు చెబుతున్నారు.

  • ఆ దేశంలో నాలుగున్నర రోజులే!

UAE Workweek change : వారంలో నాలుగున్నర రోజులు మాత్రమే పని కల్పించే మొదటి దేశంగా యూఏఈ అవతరించింది. జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ వారానికి ఐదురోజుల పనివిధానం అమల్లో ఉంది.

  • ట్రిప్​ పేరుతో టీచర్ అత్యాచారం

ట్రిప్​ పేరుతో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాజ్​నంద్​గావ్​ జిల్లాలో జరిగింది. డిసెంబరు 2న ఈ దుర్ఘటన జరిగనట్లు పోలీసులు వెల్లడించారు.

  • ఉర్రూతలూగిస్తున్న యువీ 'టీజర్'​..

Yuvraj Singh: టీమ్​ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్​ యువరాజ్ సెకండ్ ఇన్నింగ్స్​కు సమయం ఆసన్నమైంది. 'అభిమానులారా? అందుకు సిద్ధంగా ఉన్నారా?' అంటూ ఉర్రూతలూగించే ఓ వీడియోను పోస్టు చేశాడు యువీ.

  • 'ఆర్​ఆర్​ఆర్'​ క్రేజీ ప్రోమో..

RRR Trailer: కొత్త సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. ఇందులో 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రోమో, 'కేజీఎఫ్​ 2' డబ్బింగ్​ సహా పలు చిత్రాలకు సంబంధించిన విశేషాలున్నాయి.

20:44 December 07

టాప్ న్యూస్@ 9PM

  • ' బాయ్‌కాట్ చేస్తున్నాం..'

తెరాస ఆందోళనపై కేంద్రం స్పందించడం లేదని, కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా శీతాకాల సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని ఎంపీ కె.కేశవరావు స్పష్టం చేశారు. చట్టసభను బాయ్‌కాట్‌ చేయడం బాధకలిగించే విషయమేనని.. ఇలా చేయాలని ఎవరూ కోరుకోరని అన్నారు. లోక్‌సభలో-9, రాజ్యసభలో-7 మంది బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు తెలిపారు.

  • కేఆర్ఎంబీకి మరో లేఖ

నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్​లోని రెండో షెడ్యూల్ నుంచి మూడో షెడ్యూల్​లోకి మార్చాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది.

  • సీఎస్​కు హెచ్చరిక

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా పట్టణ ప్రాంత స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ను హెచ్చరించింది.

  • ' మారకపోతే మార్చేస్తా'... !

BJP Parliamentary party meeting: భాజపా పార్లమెంటరీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్​కు హాజరయ్యే విషయంపై పార్టీ ఎంపీలకు హెచ్చరికలు చేశారు.

  • ' కుదరని ఏకాభిప్రాయం'

Booster dose in India: కరోనా అదనపు డోసు పంపిణీ అంశంపై నిపుణుల కమిటీ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పిల్లలపై టీకా విషయంలోనూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి.

19:46 December 07

టాప్ న్యూస్@ 8PM

  • బుధవారమే నిర్ణయం!

తమ డిమాండ్లకు అంగీకరిస్తూ కేంద్రం పంపిన ప్రతిపాదనపై పలు అభ్యంతరాలు ఉన్నాయని రైతు సంఘాలు పేర్కొన్నాయి. నిరసనలు ఆపితేనే రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామనడాన్ని తప్పుపట్టాయి. భవిష్యత్ కార్యాచరణపై బుధవారం చర్చించి, నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి.

  • 'నేను నిన్నే చెప్పానుకదా..'

ధాన్యం కొనుగోళ్ల అంశం మరింత క్లిష్టంగా మారుతున్నా తెరాస ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించడం వెనుక ఆంతర్యమేంటని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. భాజపా-తెరాస లోపాయకారి అవగాహనలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. తెరాస ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాల నుంచి పారిపోతారని నిన్న తాను చెప్పినట్లుగానే జరిగిందని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

  • రూ.77 కే లీటరు పెట్రోల్.. తీరా చూస్తే ..​!

Illegal petrol storage in Maharashtra: దేశంలో అనేక రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110గా ఉండగా.. నాగ్‌పుర్‌లో మాత్రం రూ.77కే లభిస్తోంది. అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? ట్యాంకర్ల నుంచి అక్రమంగా సేకరించిన పెట్రోల్​తో ఇంట్లో ఏకంగా మినీ పెట్రోల్ బంకునే నడుపుతోన్న ముఠా ఈ విధంగా విక్రయిస్తోంది.

  • గోల్డ్​ షాప్​లో రూ.1000 కోట్లు..!

తమిళనాడులోని ఓ బడా రిటైల్​ సంస్థపై చేపట్టిన ఐటీ సోదాల్లో రూ. 1000 కోట్ల నల్లధనం బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. సంస్థకు సంబంధించిన 37 కేంద్రాల్లో తనిఖీలు చేసిన అధికారులు.. రూ.10 కోట్లు నగదు, రూ.6 కోట్లు విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

  • ​ 'సుడిగాలి సుధీర్' టీమ్​ సంచలన నిర్ణయం

Sudigali Sudheer team change: జబర్దస్త్​లో సుడిగాలి సుధీర్​ టీమ్​కు ఉండే క్రేజే వారు. సినిమాల్లో బ్రహ్మానందం కనిపిస్తే ఆటోమెటిగ్గా నవ్వేసినట్టుగా.. బుల్లితెరపై గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రామ్​ప్రసాద్ ఏదో ఒక మాయ చేసి నవ్వించేస్తారు. ఇన్నేళ్ల పాటు కలిసి పనిచేసి, లక్షలాది ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చిన ఈ కమెడియన్లు త్వరలో షాకింగ్ వార్త చెప్పేలా కనిపిస్తున్నారు.

18:54 December 07

టాప్​న్యూస్ @ 7PM

  • ప్రభుత్వం మరో లేఖ

కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. గెజిట్‌లో సవరణలు చేయాలని లేఖలో కోరారు.

  • హెచ్చరించిన కేంద్ర ఎన్నికల సంఘం

రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది.

  • రజనీకాంత్​ను కలిసిన శశికళ

Rajinikanth Sasikala: అన్నాడీఎంకే మాజీ నేత, జయలలిత నెచ్చెలి వీకే శశికళ రజనీకాంత్​ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు సూపర్​స్టార్​ను అభినందించారు.

  • కోర్టులోనే కత్తితో దాడి

Knife attack in court: కర్ణాటకలో కోర్టు ఆవరణలోనే దారుణం జరిగింది. తన బావపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. విడాకుల విషయమై కోర్టుకు వెళ్లిన ఇరు కుటుంబాల మధ్య జరిగిన వాగ్వాదం ఈ ఘటనకు దారితీసింది.

  • ఏటీపీ కప్​లో జకోవిచ్

ATP Cup 2022: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ వచ్చే ఏడాది జరగనున్న ఏటీపీ కప్​లో ఆడనున్నట్లు టోర్నీ నిర్వాహకులు స్పష్టం చేశారు. సిడ్నీ వేదికగా జనవరి 1 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది.

17:52 December 07

టాప్​న్యూస్ @ 6PM

  • 'పాఠశాలల మూసివేత పుకార్లు నమ్మకండి'

పాఠశాలల్లో కొవిడ్ ప్రమాణాలు పాటించేలా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సూచించారు. విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. పాఠశాలలు మూసివేస్తున్నారన్న పుకార్లు నమ్మవద్దని తెలిపారు.

  • చిన్నారిపై అత్యాచారం.. 'ఉరి' తీర్పు!

గత నెలలో రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనలో 35 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించింది గుజరాత్‌ పోక్సో కోర్టు. తీర్పు సందర్భంగా ఇది 'అరుదైన' కేసు అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

  • వారి సస్పెన్షన్​ రాజ్యాంగ విరుద్ధం

12 మంది ఎంపీల సస్పెన్షన్​కు సంబంధించి కేంద్రంపై తీవ్రవిమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత మల్లికార్జున ఖర్గే. ప్రభుత్వం చేపట్టిన చర్య ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమని.. కేంద్రం తమ గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

  • 'సిరివెన్నెల' చివరిగీతం విడుదల

దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణం పోసిన ఆఖరి పాట విడుదలైంది. నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్​' కోసం ఈ పాటను రాశారు సిరివెన్నెల.

  • ద్విచక్రవాహనం పేలి నలుగురు మృతి

ద్విచక్రవాహనం పేలి నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఇరాక్​లోని బస్రా నగరంలో జరిగింది.

16:53 December 07

టాప్​న్యూస్ @ 5PM

  • నకిలీ వీసాలతో వెళ్లేందుకు యత్నం

నకిలీ వీసాలతో కువైట్‌ వెళ్లేందుకు 44 మంది మహిళల యత్నించిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది

  • ప్రధాని టీకా తీసుకుంది ఆ గ్రామంలోనే!

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బాలీవుడ్ దిగ్గజ నటుడు అక్షయ్ కుమార్, అంతర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా టీకా కరోనా టీకా తీసుకునేందుకు బిహార్​కు క్యూ కట్టిన విషయం మీకు తెలుసా?.

  • ' సస్పెన్షన్​ రాజ్యాంగ విరుద్ధం.. '

Suspension of Rajya Sabha Members: 12 మంది ఎంపీల సస్పెన్షన్​కు సంబంధించి కేంద్రంపై తీవ్రవిమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత మల్లికార్జున ఖర్గే. ప్రభుత్వం చేపట్టిన చర్య ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమని.. కేంద్రం తమ గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

  • ' దేనికి పనికిరాడని అన్నారు'

ఎలాగైనా సినిమా హీరో అవ్వాలనే కోరికతో ఇంట్లో నుంచి పారిపోయినట్లు చెప్పారు నటుడు శ్రీకాంత్. సినిమా ఫీల్డ్​లో కష్టపడటం, మంచితనం, నిజాయతీ అనేవి చాలా కీలకమని చెప్పారు. 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'చెప్పాలని ఉంది' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

  • భారత్​కు 16 పతకాలు

Asian Youth Para Games: బహ్రెయిన్​లో జరిగిన ఆసియా యూత్ పారా క్రీడల్లో భారత షట్లర్లు సత్తా చాటారు. 16 పతకాలు సాధించారు.

15:48 December 07

టాప్​న్యూస్ @ 4PM

  • ' టీకా తీసుకుంటేనే జీతం'

కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటేనే డిసెంబర్ నెల జీతాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సహకార ఏపెక్స్‌ బ్యాంక్ నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులందరూ వ్యాక్సిన్ తీసుకున్న ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది

  • నకిలీ వీసాలతో 44 మంది మహిళలు

నకిలీ వీసాలతో కువైట్‌ వెళ్లేందుకు యత్నించిన 44 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో మహిళల వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

  • ప్రాక్టికల్స్ పేరుతో 17మంది బాలికలపై..!

UP molestation news: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపల్.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈటీవీ భారత్​ కథనంపై స్పందించిన ఉత్తర్​ప్రదేశ్​ మహిళా కమిషన్​.. ఈ ఘటనను సుమోటోగా పరిగణించింది.

  • ఒమిక్రాన్​ను జయించినా కరోనా వద్లలేదు..!

Omicron in Karnataka: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న బెంగళూరు వైద్యుడికి మళ్లీ కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని బృహత్​ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తెలిపారు. ఆ వైద్యుడు ఐసోలేషన్‌లో ఉన్నారని.. ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు.

  • ఒకే నెలలో నాలుగు సినిమాల్లో..!

Chiranjeevi: తన జోరు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వరుస చిత్రాలను ప్రకటించడం సహా ఈ డిసెంబర్​లో ఏకంగా నాలుగు చిత్రాల షూటింగ్​లలో పాల్గొంటున్నారు.

14:38 December 07

టాప్​న్యూస్ @ 3PM

  • ధాన్యం కుప్పపైనే ప్రాణం విడిచిన రైతు

ఐకేపీ కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి చెందాడు. ధాన్యం కుప్పపైనే రైతు ఐలేష్(50) ప్రాణం విడిచాడు.

  • 'ఐదేళ్లుగా అభివృద్ధి సాధిస్తోంది'

త ఐదేళ్లలో తెలంగాణ పారిశ్రామికంగా మంచి అభివృద్ధి సాధిస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. టీఎస్ ఐపాస్​తో అభివృద్ధి వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు.

  • 'రెట్టింపు వేగంతో అభివృద్ధి'

MODI UP VISIT: కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రెట్టింపు వేగంతో అభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అణగారిన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం.. కష్టపడి పనిచేయడమే కాకుండా ఫలితాలు కూడా సాధిస్తుందని చెప్పారు.

  • అమెజాన్ ప్రైమ్ షాక్... ఆ రోజు నుంచే...!

Amazon Prime Subscription Charges: అమెజాన్ ప్రైమ్​ వినియోగదారులకు బ్యాడ్​ న్యూస్​. నెలవారీ సబ్​స్క్రిప్షన్ ఛార్జీలను ఈ నెల నుంచి పెంచేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్లను సవరిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.

  • భారత్​తో తలపడే సఫారీ సేన ఇదే

న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు సిరీస్ గెలుచుకున్న టీమ్ఇండియా త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 26న భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల ఈ సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.

13:40 December 07

టాప్​న్యూస్ @2PM

  • వెలుగులోకి విస్తుపోయే విషయాలు

Nagaland Army killings: భద్రతా దళాల కాల్పుల్లో 13 మంది మరణించిన ఘటనపై నాగాలాండ్ రాష్ట్ర డీజీపీ, స్థానిక కమిషనర్ సంయుక్త నివేదిక రూపొందించారు. పౌరుల గుర్తింపును నిర్ధరించుకునే ప్రయత్నాలేవీ సైన్యం చేయలేదని నివేదికలో పేర్కొన్నారు. మృతదేహాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారని వివరించారు.

  • 'మీరు మారకపోతే నేనే మార్చేస్తా

BJP Parliamentary party meeting: భాజపా పార్లమెంటరీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్​కు హాజరయ్యే విషయంపై పార్టీ ఎంపీలకు హెచ్చరికలు చేశారు.

  • ​​బాలికపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్​ సుల్తాన్​బజార్​ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు.

  • అజాజ్ ట్విట్టర్​ ఖాతాకు బ్లూటిక్

న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒక్క ఇన్నింగ్స్​లో 10 వికెట్లు సాధించడంపై ప్రశంసల జల్లు కురిపించాడు టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్. అలాగే ఇంతటి ఘనత సాధించిన అజాజ్ ట్విట్టర్ ఖాతాను వెరిఫై చేయాల్సిందిగా యాజమాన్యాన్ని కోరాడు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ట్విట్టర్ అజాజ్ ఖాతాకు బ్లూ టిక్ ఇచ్చింది.

  • వాట్సాప్ కొత్త అప్డేట్​

12:37 December 07

టాప్​న్యూస్ @1PM

  • లోక్​సభ నుంచి​ తెరాస బాయ్‌కాట్

TRS MPs boycott in loksabha:ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్​లో తెరాస నిరసన కొనసాగుతూనే ఉంది. కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడం పట్ల గులాబీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న తెరాస ఎంపీలు ఇవాళ.. నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు. లోక్​సభ నుంచి బాయ్​కాట్ చేశారు.

  • మరిన్ని ఆధునిక వైద్య సేవలు

Harish Rao at NIMS: హైదరాబాద్​ నిమ్స్ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరికరాలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

  • ఏటీఎం ఛార్జీల మోత!

ATM Withdrawal Charges: జనవరి 1వ తేదీ నుంచి బ్యాంకింగ్‌ రంగ సేవల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏటీఎంల నుంచి పరిమితికి మించి నగదు విత్‌డ్రా చేస్తే అధిక ఛార్జీలు విధించనున్నాయి బ్యాంక్​లు. ఆర్​బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా... యాక్సిస్‌ బ్యాంకు నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

  • వాంఖడే క్యూరేటర్​కు బహుమతి

Team India Wankhede Curator: వాంఖడే వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. అనంతరం ఈ పిచ్ క్యూరేటర్​కు రూ.35 వేల నగదు బహుమతి అందజేసి మంచి మనసు చాటుకుంది భారత జట్టు యాజమాన్యం.

  • బాలయ్య 'అఖండ'కు సీక్వెల్​

Akhanda Sequel: బోయపాటి-బాలకృష్ణ కాంబోలో వచ్చిన 'అఖండ' చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. బాలయ్య కెరీర్​లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. అయితే ఈ బ్లాక్​బస్టర్ చిత్రానికి సీక్వెల్ రాబోతుందట. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే అంశం హాట్ టాపిక్​గా మారింది.

11:42 December 07

టాప్​న్యూస్ @12PM

  • రాజ్యసభ వాయిదా

ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. 12మంది ఎంపీల సస్పెన్ష్​ను తొలగించాలని విపక్షాలు డిమాండ్​ చేశాయి. భారీ ఎత్తున నినాదాలు చేశాయి. కార్యకలాపాలు తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్నాయి.

  • తొలి టెస్టుకు అండర్సన్ దూరం

James Anderson Ashes 2021: యాషెస్ సిరీస్​కు ముందు ఇంగ్లాండ్​ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. పిక్క కండరాల గాయంతో ఆ జట్టు సీనియర్ పేసర్ అండర్సన్ తొలి టెస్టుకు దూరమైనట్లు తెలుస్తోంది.

  • 'బీజింగ్​ ఒలింపిక్స్​ దౌత్యపరంగా బహిష్కరణ

America Winter Olympics: 2022లో చైనాలో జరగబోయే ఒలింపిక్స్​ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అమెరికాకు చెందిన అథ్లెట్లు.. ఒలింపిక్స్​లో పాల్గొంటారు కానీ అధికారులను మాత్రం పంపించబోమని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్​ సాకి తెలిపారు.

  • లక్ష్యానికి చేరువలో జీఎస్టీ వసూళ్లు

GST collections in Telangana : రాష్ట్రంలో నిర్దేశించిన లక్ష్యంలో 80శాతం జీఎస్టీ, వ్యాట్‌ రాబడులు వచ్చాయి. నవంబరులో 25 శాతం ఆదాయం తగ్గినప్పటికీ... ఎనిమిది నెలల్లో సగటున 42 శాతం వృద్ధి నమోదైంది. పెట్రోల్‌ అమ్మకాల ద్వారా 81 శాతం, మద్యం విక్రయాల ద్వారా 21 శాతం లెక్కన వ్యాట్‌, జీఎస్టీ 18 శాతం ప్రకారం వృద్ధి నమోదు చేశాయి.

  • పెళ్లి వీడియోకు 100 కోట్ల ఆఫరా?

katrina kaif vicky kaushal wedding: బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ వివాహం డిసెంబరు 9న జరగనుంది. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ప్రసారహక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.100కోట్ల భారీ ఆఫర్‌ ఇచ్చిందట. అయితే, ఈ విషయంలో విక్కీ-కత్రిన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

10:36 December 07

టాప్​న్యూస్ @11AM

  • పార్లమెంటరీ సమావేశంలో మోదీకి సన్మానం

BJP Parliamentary party meeting: భాజపా పార్లమెంటరీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు, కీలక నేతలు సైతం భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీని సత్కరించారు నేతలు.

  • ఫేస్​బుక్ ప్రొఫైల్స్​తో కి'లేడి' వల

ఇంటర్ చదివింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లిచేశారు. కొన్నేళ్లకే విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కూడా ఫెయిల్​ అయింది. మళ్లీ విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ.. మిషన్ భగీరథలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. వచ్చే జీతం సరిపోక.. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంది. దానికి ఫేస్​బుక్​ బెటర్​ ఆప్షన్ అనుకుంది.

  • ఏపీ, తెలంగాణలో పెరిగిన పసిడి ధర

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర కాస్తా క్షీణించింది. క్రితం రోజుతో పోలిస్తే మేలిమి పుత్తడి ధర రూ.35 పుంజుకుంది. కిలో వెండి ధర రూ.430 తగ్గింది. పెట్రోల్​, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • కోహ్లీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో

Steve Harmison on Ravi Ashwin: న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్​గా ఎంపికయ్యాడు టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్. అయినప్పటికీ అతడికి దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్​ల్లో అవకాశం దక్కుతుందో లేదోనని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్.

  • లెహంగాలో జాన్వీ.. ముద్దుముద్దుగా అవంతిక

జాన్వీకపూర్​, అవంతిక, మెహరీన్ అదిరిపోయే డ్రెస్​లు ధరించి దిగిన ఫొటోలు నెట్టింట హల్​చల్ చేస్తున్నాయి. వారి లుక్స్​ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వాటిని చూసేద్దాం..

09:53 December 07

టాప్​న్యూస్ @10AM

  • భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి

India Covid cases: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 6,822‬ మందికి వైరస్ సోకినట్లు తేలింది. రోజువారీ కేసుల సంఖ్య 558 రోజుల కనిష్ఠానికి చేరింది.

  • పాముల కోసం పొగ పెడితే..

Man Burns Home: పాముల బెడదను వదిలించుకునేందుకు పెట్టిన పొగ.. రూ. 13కోట్ల ఇంటిని కాల్చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. దీనికి సంబంధించిన చిత్రాలను అగ్నిమాపక శాఖ ట్విట్టర్​లో షేర్ చేసింది.

  • ప్రమాదాల్లో నిండు ప్రాణాలు బలి

Road accident cases: పొద్దున లేచి వార్తా పత్రిక తిరగేస్తే చాలు.. ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాల వార్తలు చూస్తూనే ఉంటాం. ఇంత మంది చనిపోయారు.. పలువురికి గాయాలయ్యాయనే విషయాలు.. మనల్ని ఆ సమయంలో కాస్త ఆవేదనకు గురిచేస్తాయి.

  • టీమ్ఇండియా అంబాసిడర్

IND vs NZ Test: న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో గెలుపొందిన టీమ్ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌కు భారత జట్టు రాయబారిగా మారిందని పేర్కొన్నాడు.

  • లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు (Stock Market today) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 420 పాయింట్లకుపైగా లాభంతో 57,168 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 129 పాయింట్లకుపైగా పెరిగి 17,041 వద్ద కొనసాగుతోంది.

08:48 December 07

టాప్​న్యూస్ @9AM

  • సాగర్ కాల్వలో ముగ్గురు గల్లంతు!

Missing in Sagar Canal : పొట్టకూటి పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన వారు అదృశ్యమైపోయారు. తమ వారు ఏమయ్యారో తెలియక.. బంధువులు, స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో సాగర్​ కాల్వలో ముగ్గురు గల్లంతైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. వరికోత కోసం పంజాబ్​ వాసులు ముదిగొండ మండలంలోని కట్టంకూరుకు వచ్చారు. వారిలో ముగ్గురు సోమవారం సాయంత్రం కట్టంకూరులోని సాగర్​ కాల్వ వద్దకు వెళ్లారు. అప్పటి నుంచి వారు వెనుదిరిగి రాలేదు.

  • నలుపైతే ఇక్కడ.. తెలుపైతే ఇంగ్లాండ్‌కు

Azadi Ka Amrut Mahotsav: ఆంగ్లేయుల జాత్యహంకారం ఎక్కడిదాకా వెళ్లిందంటే వారి రక్తం పంచుకు పుట్టిన పిల్లలను కూడా ఈ తరాజులోనే బేరీజు వేసేంతగా! ఆంగ్లేయులు-భారతీయులకు పుట్టిన పిల్లల భవిత తెల్ల-నల్ల గీటురాయి ఆధారంగానే తేలేది. తెల్లగా పుడితే ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లేవారు... లేదంటే ఇక్కడే ఉంచేవారు.

  • విమానయాన అభివృద్ధికి నవీకరణ మద్దతు

International Aviation Day: ఏటా డిసెంబరు 7న అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం జరుగుతుంది. సామాజిక, ఆర్థికాభివృద్ధికి అంతర్జాతీయ విమానయానరంగం ఎలా తోడ్పడుతోందో ప్రజలందరికీ అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ఉద్దేశం.

  • జియో వినియోగదారులకు మరో షాక్​

Jio New Plans: టెలికాం దిగ్గజం జియో.. వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. గతంలో రూ.499కే ప్రారంభమైన డిస్నీ హాట్​స్టార్​ ప్లాన్లు.. రూ.601కు పెంచింది. మిగతా ప్లాన్స్ ఎంత పెరిగాయంటే..?

  • కదనోత్సాహంతో ఆసీస్-ఇంగ్లాండ్

Ashes 2021 News: యాషెస్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ సిరీస్​లో గెలుపు కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

07:57 December 07

టాప్​న్యూస్ @8AM

  • టీకా తీసుకుంటేనే ఈ నెల జీతం

Corona Vaccination Telangana : ఓవైపు కరోనా మూడో ముప్పు.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదలతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. మరో విలయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే కరోనా నిబంధనల పాలన, వ్యాక్సినేషన్​ను తప్పనిసరి చేసింది. టీకా తీసుకునే విషయంలో ఎంత అవగాహన కల్పించినా కొందరు మాత్రం ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదు. అలాంటి వారిపై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. టీకా తీసుకోని వారికి వేతనాలు, వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ టెస్కాబ్ నిర్ణయం తీసుకుంది.

  • కరోనా కంటే ప్రాణాంతకం

Future Pandemics: భవిష్యత్తులో సంభవించే మహమ్మారులు కరోనా కంటే ప్రాణాంతకంగా ఉంటాయని ఆక్స్​ఫర్డ్ టీకా సృష్టికర్తల్లో ఒకరైన సారా గిల్బర్ట్ హెచ్చరించారు. అందువల్ల కరోనా నేర్పిన పాఠాలను వృథా కానీయొద్దని పిలుపునిచ్చారు. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ గురించి మరింత సమాచారం తెలుసుకునేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

  • వర్క్​ ఫ్రం హోం'కి చట్టబద్ధత

WFH Legal framework: దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా.. వర్క్​ఫ్రం హోంకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అన్ని రంగాలకూ ఈ విధానాన్ని విస్తరించాలని భావిస్తోంది. దీనికోసం ఓ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • పేసర్​ అవ్వాలనుకున్నా.. కానీ

Ashwin Ajaz Patel Interview: టెస్టుల్లో 10 వికెట్ల ఘనత సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్. మొదట పేసర్ కావాలనుకున్నా ఎత్తు తక్కువగా ఉండటం వల్ల స్పిన్​ను ఎంచుకున్నానని వెల్లడించాడు. భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్​తో కలిసి పలు విషయాలు పంచుకున్నాడు అజాజ్.

  • అలాంటి సినిమాల్లో నటించలేను

Shivakandukuri Interview: ఇళయరాజాతో పని చేసే అవకాశమొస్తుందని కలలో కూడా అనుకోలేదని అన్నారు యువ హీరో శివ కందుకూరి. ఈ నెల 10న ఆయన నటించిన 'గమనం' సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం తన కెరీర్​లో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఇంకా ఈ చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

06:43 December 07

టాప్​న్యూస్ @7AM

  • దివ్య కాశీ భవ్య కాశీ' వేడుకకు మోదీ

Pm Modi Varanasi Visit: వారణాసిలో 'దివ్య కాశీ భవ్య కాశీ' వేడుకను డిసెంబర్ 13, 14న భాజపా ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకకు 12 భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలను ప్రధాని ఆహ్వానించారు.

  • మంత్రి పేరుతో నకిలీ ఈమెయిల్

Cyber crime: ఇన్నాళ్లు సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులనూ తమ ఉచ్చులో బిగిస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్​ పేరుతో ఆర్టీసీ చీఫ్ కంట్రోల్ మేనేజర్​కు నకిలీ ఈమెయిల్ పంపించారు. అది నకిలీ ఈమెయిల్ అని గుర్తించిన ఆ అధికారి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • పతనమవుతున్న పత్తి ధర

Cotton prices: తెల్లబంగారంగా పేరొందిన పత్తి ధరలు పతనవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మార్కెట్లలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్ల సిండికేట్‌గా మారిన వ్యాపారులు ఏకపక్ష నిర్ణయాలతో ధరలను నేలకు దించుతున్నారు. మద్దతు ధరకంటే ఎక్కువే చెల్లిస్తున్నామనే అంశాన్ని తెరపైకి తెస్తున్న వ్యాపార వర్గాలకే.. మార్కెటింగ్‌శాఖ వెన్నుదన్నుగా నిలుస్తోంది తప్ప.. అంతర్జాతీయ మార్కెట్‌ సరళికి అనుగుణంగా రైతులకు మేలు చేయాలనే ప్రయత్నం చేయడంలేదు.

  • యూఎన్​కు పాక్​ మంత్రి లేఖ

Pak in Kashmir Issue: కశ్మీర్​ అంశంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ మరోసారి వివాదాస్పదంగా స్పందించారు. ఆర్టికల్ 370తో సహా కశ్మీర్ ఇతర అంశాల్లో భారత్ వెనక్కి తగ్గాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి అధికారులకు లేఖ రాశారు.

  • ఓటీటీలో దీపిక-అనన్య సినిమా

Deepika paukone Ananya pandye movie: షకున్​ బత్రా దర్శకత్వంలో దీపికా పదుకొణె, అనన్యా పాండే కలిసి నటించిన సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బోల్డ్​ సీన్స్​ మోతాదు కాస్త ఎక్కువగా ఉండటమే కారణమట!

05:18 December 07

టాప్​న్యూస్ @ 6AM

  • భారత్‌ బాహుబలి...

India russia summit: భారత్‌ బలమైన శక్తి అని, కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచిన తమ మిత్రదేశమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కొనియాడారు. ఉభయ దేశాల మధ్య బంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు.

  • ఆర్టీఐకి సంకెళ్లు!...

సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి ఒరటిన్నర దశాబ్దం పూర్తయినా.. కేంద్రం, రాష్ట్రాలు ఆ చట్టానికి ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు తక్కువ అని సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ పరిశీలనలో తేటతెల్లమైంది. తెలంగాణలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన దరఖాస్తులను పరిష్కరించడానికి 53 నెలలు సమయం పడుతుందని అంచనా వేసింది.

  • విస్తృతంగా ప్రచారం చేయాలి..

KTR Tweet on Gussadi book:అంతర్జాతీయ అవార్డు గ్రహీత జెన్నిఫర్‌ ఆల్ఫోన్స్‌ సంకలనం చేసిన 'గుస్సాడి' పుస్తకాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఈ పుస్తకం తెలంగాణలో జరుపుకునే గుస్సాడి, దండారి పండుగలకు సంబంధించిన సంప్రదాయాలను, నృత్య రూపాన్ని వర్ణిస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు.

  • ప్రజాప్రతినిధులపై సైబర్​ నేరగాళ్ల పంజా..

Cyber crime: ఇన్నాళ్లు సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులను సైతం తమ సైబర్ ఉచ్చులో బిగిస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్​ పేరుతో ఆర్టీసీ చీఫ్ కంట్రోల్ మేనేజర్​కు నకిలీ ఈమెయిల్ పంపించారు. అది నకిలీ ఈమెయిల్ అని గుర్తించిన చీఫ్ కంట్రోల్ మేనేజర్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • దిల్లీలో వరి నిరసన దీక్ష అక్కర్లేదు...

Decisions of Congress PAC: దిల్లీలో వరి నిరసన దీక్ష అవసరం లేదని కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఎక్కువ మంది నాయకులు అభిప్రాయపడ్డారు. వరి నిరసన దీక్ష వల్ల పార్టీకి ప్రయోజనం ఉండదని నేతలు భావించారు. అది సీఎం కేసీఆర్‌కు మేలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

  • నాకు టీకా వద్దు బాబోయ్...

Vaccine Rejected: కరోనా వ్యాక్సిన్ వద్దంటూ ఓ వ్యక్తి హంగామా సృష్టించిన ఘటన జగిత్యాల జిల్లా తాటిపల్లిలో చోటుచేసుకుంది. అందరికీ టీకా అందాలనే ఉద్దేశంతో గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో టీకా వేయడానికి వెళ్లిన వారిని చూసిన ఆ వ్యక్తి హల్​చల్ చేశాడు.

  • కశ్మీర్​పై పాక్​ మంత్రి లేఖ..

Pak in Kashmir Issue: కశ్మీర్​ అంశంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ మరోసారి వివాదాస్పదంగా స్పందించారు. ఆర్టికల్ 370తో సహా కశ్మీర్ ఇతర అంశాల్లో భారత్ వెనక్కి తగ్గాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి అధికారులకు లేఖ రాశారు.

  • దక్షిణాఫ్రికా సిరీస్​లో మార్పులు

South Africa vs India: దక్షిణాఫ్రికాలో టీమ్​ఇండియా పర్యటనకు సంబంధించి మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. ఈనెల 17న ప్రారంభం కావాల్సిన టెస్టు సిరీస్​, జనవరి 11 నుంచి జరిగే వన్డే సిరీస్​ తేదీల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది.

  • 'రాధేశ్యామ్' పాట​కు 5 కోట్ల​ వ్యూస్..

Radhe Shyam Song Update: 'రాధేశ్యామ్' గీతం.. అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో 'నగుమోము తారలే', హిందీలో 'ఆషికీ ఆగయి' అంటూ సాగుతున్న ఈ గీతం.. సంగీత ప్రియుల్ని తెగ అలరిస్తోంది.

  • ఆ నమ్మకంతోనే అఖండ సినిమా తీశా

Akhanda movie: నటసింహం బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి కాంబినేషన్​.. అఖండ సినిమాతో హ్యాట్రిక్​ కొట్టింది. వెండితెరపైన బాలయ్యను చూసుకుని అభిమానులు మురిసిపోయారు. మరి ఈ విజయంపై చిత్ర బృందం ఏమంటోందంటే...

Last Updated : Dec 7, 2021, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details