తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

etv bharat top news
etv bharat top news

By

Published : Oct 24, 2021, 5:56 AM IST

Updated : Oct 24, 2021, 9:46 PM IST

21:10 October 24

టాప్​న్యూస్​@ 10PM

  • పాకిస్థాన్​ లక్ష్యం 152

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. పాక్​ బౌలర్లలో షహీన్​ అఫ్రిది 3, హసన్​ అలీ 2 వికెట్లు తీశారు.

  •  ఇటలీకి మోదీ

జీ-20 సదస్సులో(G20 Summit 2021) పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటలీకి(Modi Italy Visit) వెళ్లనున్నారు. అక్కడి నుంచి గ్లాస్​గౌలో(Glasgow Summit) జరిగే కాప్​-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్​కు వెళ్లనున్నారు. అక్టోబరు 29 నుంచి నవంబరు 2 వరకు ఈ పర్యటన కొనసాగనుంది.

  • వారిద్దరిపై రేవంత్​ కీలక వ్యాఖ్యలు

వేషం మార్చినంత మాత్రాన ఈటల రాజేందర్‌ ఇవాళ ఉత్తముడు కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదన వాటాల్లో గొడవ వల్లే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక (HUZURABAD BYPOLL)వచ్చిందన్నారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనన్న కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలన్న రేవంత్​.. రైతులు పండించిన పంటను కొనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని.. ధాన్యం కొనలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? అని రేవంత్​ ప్రశ్నించారు.

  • మన డీపీని ఎవరు చూశారో తెలుసుకోవచ్చా?

వాట్సాప్‌ స్టేటస్‌ను ఎవరు చూశారనేది తెలుస్తుంది కానీ వాట్సాప్‌ డీపీ లేదా ప్రొఫైల్ ఫొటో ఎవరు చూశారనేది మనకు మాత్రం తెలియదు. అయితే.. కొన్ని థర్డ్​పార్టీ యాప్​ల సాయంతో మన డీపీ చూసిన వివరాలు తెలుసుకోవచ్చనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. మరి.. ఈ వార్తల్లో నిజమెంత?

  • హీరోయిన్లను అవమానిస్తే  ఊరుకోను

కథానాయికల(maa association president 2021) పట్ల హద్దులు మీరే యూట్యూబ్ ఛానెల్స్​పై ఇక నుంచి కఠిన చర్యలు తప్పవని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(maa elections 2021 winner) హెచ్చరించారు. నటీమణుల గౌరవాన్ని దెబ్బతిసే ఛానల్స్​ను ఉపేక్షించేదే లేదన్న విష్ణు... త్వరలోనే మా అసోసియేషన్ నుంచి ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

20:51 October 24

టాప్​న్యూస్​@ 9PM

  • నాలుగో వికెట్​ కోల్పోయిన టీమ్​ఇండియా

ధనాధన్​ బ్యాటింగ్​ చేస్తున్న పంత్​ను(39; 6x2, 4x2) కట్టడి చేశాడు షాదబ్​ ఖాన్​. దీంతో 12.4 ఓవర్లకు 84/4స్కోరు నమోదైంది. క్రీజులోకి జడేజా వచ్చాడు. కోహ్లీ(29) ఆచితూచి ఆడుతున్నాడు. 

  • మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రమే లక్ష్యం

మత్తు పదార్థాల తయారీ, రవాణా, విక్రయాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అబ్కారీ​ శాఖమంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. మాదకద్రవ్యాలు పట్టుకున్న అబ్కారీ శాఖ అధికారులను హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఘనంగా సన్మానించారు.

  • కేరళలో తగ్గిన కరోనా కేసులు

కేరళలో కరోనా(kerala corona cases today) ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అక్కడ కొత్తగా 8,538కేసులు నమోదయ్యాయి. మరో 363 మంది కరోనాతో మృతిచెందారు. మహారాష్ట్రలో కొత్తగా 1410 కరోనా కేసులు వెలుగుచూశాయి.

  • భారీ కొండచిలువను పట్టి..!

ఇంటి సమీపంలోకి వచ్చిన ఓ కొండచిలువ హాని చేస్తుందని భావించిన ఓ వ్యక్తి దాన్ని తాడుతో కట్టేశాడు. ఒడిశా సంబల్‌పూర్‌ జిల్లా తల్పాలి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు దాన్ని రక్షించి సమీపంలోని అడవిలో వదిలేశారు.

  • భీమ్లా నాయక్, సర్కారు వారి పాట విడుదల వాయిదా!

టాలీవుడ్ అగ్రనటులు పనన్ కల్యాణ్, మహేశ్​ బాబు నటిస్తోన్న సినిమాల విడుదల తేదీలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాల రిలీజ్​ డేట్​పై క్లారిటీ రానుంది.

19:51 October 24

టాప్​న్యూస్​@ 8PM

  •  రెండో వికెట్​ కోల్పోయిన టీమ్​ఇండియా

టీమ్​ఇండియా వరుసగా రెండో ఓవర్​లో రెండో వికెట్​ను కోల్పోయింది. కేఎల్​ రాహుల్​(3) షహీన్​ అఫ్రిది బౌలింగ్​లోనే వెనుదిరిగాడు. సూర్యకుమార్​ యాదవ్​ క్రీజులోకి రాగా.. కోహ్లీ మూడు పరుగులతో కొనసాగుతున్నాడు. 

  • వారిద్దరిపై రేవంత్​ కీలక వ్యాఖ్యలు

వేషం మార్చినంత మాత్రాన ఈటల రాజేందర్‌ ఇవాళ ఉత్తముడు కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదన వాటాల్లో గొడవ వల్లే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక (HUZURABAD BYPOLL)వచ్చిందన్నారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనన్న కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలన్న రేవంత్​.. రైతులు పండించిన పంటను కొనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని.. ధాన్యం కొనలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? అని రేవంత్​ ప్రశ్నించారు.

  •  మరో ఆరుగురు అరెస్ట్

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో(attack on tdp office case news) మరో ఆరుగురు అరెస్టు అయ్యారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్న పోలీసులు.. మిగతా వారికోసం 4 బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు.

  • ఆ పాము విషం  రూ.12 కోట్లు ..?

వరి పొలాల్లో ఓ గాజు పాత్రలో అక్రమంగా నిల్వ చేసిన పాము విషాన్ని సరిహద్దు భద్రతా దళ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ విషం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని చెప్పారు.

  • ప్రపంచకప్​లో శ్రీలంక బోణీ

టీ20 ప్రపంచకప్​లో బంగ్లాదేశ్​పై 5 వికెట్ల తేడాతో గెలిచింది శ్రీలంక. 18.5 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

18:56 October 24

టాప్​న్యూస్​@ 7PM

  • హనీట్రాప్​తో 300 మందికి!

యువకులను టార్గెట్ చేస్తూ.. వలపు వల(Honey trap) విసురుతారు. నగ్నంగా వీడియోకాల్ చేసి​ కవ్విస్తారు. అవతలి వారినీ అలాగే చేయమంటారు. ఆ తర్వాతే అసలు డ్రామాకు తెరలేపుతారు. నగ్న వీడియోలను రికార్డు చేసి అమాయకుల వద్ద నుంచి అందినకాడికి దోచుకుంటారు. ఉత్తర్​ప్రదేశ్​ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో బాధితులెవరూ ఫిర్యాదు చేయనప్పటికీ.. మరో కేసు దర్యాప్తులో భాగంగా 'హనీ ట్రాప్' మోసం బయటికొచ్చింది.

  • 'వారికి అదే గొప్ప'

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress in UP) పెద్దగా ప్రభావం చూపదని భాజపా నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. కాంగ్రెస్ తన ఏడు స్థానాలు (UP Election 2022) నిలబెట్టుకుంటే.. అది గొప్ప ఘనత అవుతుందని వ్యాఖ్యానించారు. సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూడా భాజపా విజయానికి అడ్డుకాదని అన్నారు.

  •  మోస్ట్​ వాంటెడ్​ డ్రగ్స్​ వ్యాపారి అరెస్ట్​

దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మాదకద్రవ్యాల వ్యాపారిని పట్టుకున్నాయి కొలంబియా భద్రతా బలగాలు. అవినీతి అధికారుల అండ, ప్రైవేటు సైన్యం రక్షణతో పదేళ్లుగా పరారీలో ఉన్న డైరో ఆంటోనియా ఉసుగా అలియాస్​ ఒటోనియల్​.. అధికారులకు ఎట్టకేలకు చిక్కాడు.

  • ఇలా చేసి ఆ లక్ష్యాలను అందుకోండి!

స్వల్పకాలంలో ఎలాంటి వాటిపై పెట్టుబడి పెట్టాలన్నది చిక్కు ప్రశ్న. అయితే మన లక్ష్యాలను వర్గీకరించి.. అత్యవసరం, ముఖ్యమైన కేటగిరీలోకి వచ్చే అంశాల కోసం ముందుగా పెట్టుబడి పెట్టాలి. సురక్షితమైన, కచ్చితమైన రాబడినిచ్చే పథకాల్లో మాత్రమే మదుపు చేయాలి.

  • '​ ఈ ఒక్క మ్యాచ్​ వదిలేయండి.. ప్లీజ్'

మరికొద్ది గంటల్లో టీమ్ఇండియా, పాకిస్థాన్ హై వోల్టేజీ మ్యాచ్(Ind vs Pak t20) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ పాకిస్థానీ లేడీ అభిమాని వీడియో తెగ వైరల్​ అవుతోంది. శనివారం ప్రాక్టీస్​ అనంతరం.. కేఎల్​ రాహుల్, మెంటార్​ ధోనీలను(Dhoni Mentor).. 'ఈ ఒక్క మ్యాచ్​ వదిలేయండి' అంటూ అభిమాని కోరింది. దీనిపై ధోనీ ఏమన్నాడంటే..

17:56 October 24

టాప్​న్యూస్​@ 6PM

  • ఈజీ మనీతో బురిడీ

మోసపోయే వాడుంటే మోసం చేసే వాళ్లు ఎంతమందైనా పుట్టుకొస్తూనే ఉంటారు. ఓ వైపు సైబర్ మోసాల పేరిట రోజుకో కొత్త తరహా మోసం వెలుగుచూస్తోంది. అప్రమత్తంగా ఉండాలంటూ పోలీస్ శాఖ అవగాహన కల్పిస్తున్నా.. ఈ తరహా మోసాలు ఆగడం లేదు. అదే సమయంలో ఈజీ మనీ మోజులో పడి మోసాల ఊబిలో చిక్కుకుంటున్న బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

  • హుజూరాబాద్​ భాజపాదే

పదవి పోయాక ప్రజలు నాకు చాలా దగ్గరయ్యారని హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్(huzurabad bjp candidate etela rajender) అన్నారు. నా రాజీనామా వల్లే హుజూరాబాద్​లో పథకాలన్నీ వస్తున్నాయని తెలిపారు. నాపై రోజుకొక లేఖ పుట్టించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని కనపర్తి, వల్భాపూర్‌, నర్సింగాపూర్‌, కొండపాక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

  • ఇంట్లోకి దూరి మరీ దారుణం.!

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. నిందితులను కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ సంఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

  • వారిని అవమానిస్తే ఊరుకోను

కథానాయికల(maa association president 2021) పట్ల హద్దులు మీరే యూట్యూబ్ ఛానెల్స్​పై ఇక నుంచి కఠిన చర్యలు తప్పవని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(maa elections 2021 winner) హెచ్చరించారు. నటీమణుల గౌరవాన్ని దెబ్బతిసే ఛానల్స్​ను ఉపేక్షించేదే లేదన్న విష్ణు... త్వరలోనే మా అసోసియేషన్ నుంచి ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

  •  శ్రీలంకకు భారీ లక్ష్యం

టీ20 ప్రపంచకప్​లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బంగ్లాదేశ్​ ఓపెనర్ నయీమ్(62), రహీమ్(57*) అర్థశతకాలతో రాణించారు.

16:54 October 24

టాప్​న్యూస్​@ 5PM

  • ఈనెల 29న ఇటలీకి మోదీ

జీ-20 సదస్సులో(G20 Summit 2021) పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటలీకి(Modi Italy Visit) వెళ్లనున్నారు. అక్కడి నుంచి గ్లాస్​గౌలో(Glasgow Summit) జరిగే కాప్​-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్​కు వెళ్లనున్నారు. అక్టోబరు 29 నుంచి నవంబరు 2 వరకు ఈ పర్యటన కొనసాగనుంది.

 

  • ఆర్యన్​ ఖాన్​ కేసులో కొత్త ట్విస్ట్.. ​!​

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్ నిందితుడిగా ఉన్న మాదక ద్రవ్యాల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న వేళ సంచలన విషయం తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ సంచలన విషయాలను వెల్లడించాడు.

  • 'అప్పుడే  ఓట్లడగండి'

రైతులు కారెక్కాలని సీఎం కేసీఆర్​ ఆశపడుతుంటే.. భాజపా మాత్రం రైతులపైన కారెక్కించి చంపుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెంచుతూ పేదలపై భారం వేస్తోందని మండిపడ్డారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని విమర్శించారు.

  • ఆ జవాన్లకు శౌర్య పతకాలు 

సరిహద్దు ఘర్షణల్లో భాగంగా (China India Clash) చైనా సైన్యంతో పోరాడి పరాక్రమాలను చాటిన 20 మంది ఐటీబీపీ సిబ్బందికి కేంద్రం శౌర్య పతకాలు (Gallantry Award Winners 2021) ప్రదానం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. జవాన్లకు మెడల్స్ అందించారు.

  • తైవాన్​​లో భారీ భూకంపం

తైవాన్​లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5తీవ్రత నమోదైంది. కొన్నిచోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

15:49 October 24

టాప్​న్యూస్​@ 4PM

  • 'యువత భాగస్వామ్యంతోనే అడ్డుకట్ట'

జమ్మూ ప్రజలకు అన్యాయం జరిగే కాలం ముగిసిపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah News) తెలిపారు. జమ్ముకశ్మీర్​ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ఈ అభివృద్ధిలో యువత భాగమవ్వాలని, దాని ద్వారానే ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడుతుందన్నారు.

  • ఆ ఉడుత మా ఫ్యామిలీనే..!

మీ ఇంట్లో ఎంతమందిఉ న్నారు అనడిగితే నలుగురు అంటారు ఆకుటుంబ సభ్యులు. మరి ముగ్గురే కనిపిస్తున్నారు..? నాలుగో వ్యక్తి ఎవరని అడిగిన వారికి... వారు చూపించిన దానిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. అవును ఆ ఇంట్లో నాలుగో ప్రాణంగా... ఆ ఇంటి అందరికి ఆరోప్రాణంగా మారిందో ఉడుత. వారిలో ఒక్కరిగా కలిసిపోయిన ఆ ఉడుతను చూసిన వారు దాని కథను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఆ కథేంటో మీరూ తెలుసుకోండి..

  • ముగ్గురు కూతుళ్లతో సహా ..!

ఓ తల్లి.. తన ముగ్గురు కూతుళ్లతో సహా బావిలో దూకిన విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు చనిపోగా.. ఒకరిని స్థానికులు కాపాడారు.

  • పెళ్లిపై  విజయ్​దేవరకొండ ఏమన్నారంటే?

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ.. తన సోదరుడు ఆనంద్​తో కలిసి ఓ స్పెషల్​ చిట్​చాట్​లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అన్నదమ్ములిద్దరూ తమ పెళ్లి గురించి మాట్లాడారు. ఇంకా తమకు సంబంధించిన పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను చూసేయండి..

  • వారితో అంత ఈజీ కాదు!

టీ20 ప్రపంచకప్​లో(T20 worldcup 2021 schedule) భాగంగా మరి కొన్ని గంటల్లో యూఏఈ వేదికగా పాకిస్థాన్​తో టీమ్​ఇండియా తలపడనుంది. అయితే ఈ పిచ్​పై పాక్​కు ఉన్నంత అవగాహన మరే ఇతర జట్టుకు లేదనే చెప్పాలి. కాబట్టి భారత జట్టు(T20 worldcup teamindia pakisthan match) చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. కాగా, గతంలో ఇరు జట్లు తలపడిన మ్యాచ్​లకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం..

14:43 October 24

టాప్​న్యూస్​@ 3PM

  •  మిగిలింది ఇక మూడు రోజులే..!

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ప్రచారానికి మరో మూడు రోజులే గడువు ఉంది. దీనితో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు చివరి రెండు రోజుల పోల్​ మేనేజ్​మెంట్​పై తలమునకలై ఉన్నాయి. 

 

  • లోయలో పడిన పెళ్లి బస్సు

60మంది ప్రయాణిస్తున్న ఓ పెళ్లి బస్సు 30అడుగుల లోయలో పడిపోయింది(karnataka bus accident news). ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 27మంది గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

  • ఐదో రోజు ప్రజాప్రస్థానం

వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర(YS Sharmila Padayatra 202) ఐదో రోజుకు చేరుకుంది. ఈ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామం నుంచి ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం వరకు మహేశ్వరానికి చేరుకుంటారు.

  • చైనా చట్టంతో భారత్​పై ప్రభావం!

భారత్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నూతన సరిహద్దు (China Border news) చట్టాన్ని తీసుకొచ్చింది. సరిహద్దుల్లో ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు చట్టంలో వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటు పడనున్నట్లు (China news today) తెలిపింది.

 కప్పు వేటలో సవాళ్లెన్నో!

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్(T20 worldcup 2021 latest news)​ ప్రారంభమైపోయింది. టీమ్​ఇండియా తమ తొలి మ్యాచ్​ను నేడు(అక్టోబర్​ 24) పాకిస్థాన్​తో(t20 worldcup teamindia vs pakisthan) మొదలుపెట్టనుంది

13:51 October 24

టాప్​న్యూస్​@ 2 PM

  • మందకృష్ణకు కేంద్ర మంత్రుల పరామర్శ..

ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కేంద్ర మంత్రులు(Central ministers met manda krishna).. హైదరాబాద్​లోని ఆయన నివాసంలో పరామర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, మురుగన్​, నారాయణ స్వామి.. మందకృష్ణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

  • 'లఖింపుర్' ప్రధాన నిందితుడికి డెంగీ...

లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనలో (Lakhimpur Kheri Case) ప్రధాన నిందితుడు కేంద్రమంత్రి తనయుడు ఆశిష్​ మిశ్రాకు (Ashish Mishra Lakhimpur) డెంగీ సోకింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్...

జమ్ముకశ్మీర్​లో (Kashmir Encounter) ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మరో ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ పౌరుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

  • తరుచూ ఆ సమస్యలు వేధిస్తున్నాయా?

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా మతిమరుపు, కీళ్ల నొప్పులు, ఐరన్ లోపం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. మీకూ ఇలాంటి సమస్యలు(health tips in telugu) ఉన్నాయా? అయితే ఇలా చేయండి మరి..!

  • అభిమానికి మెగాస్టార్ భరోసా..

12:50 October 24

టాప్​న్యూస్​@ 1 PM

  • రేపటి నుంచే ఇంటర్​ పరీక్షలు..

ఈనెల 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. 

  •  తెరాసలో ముసలం ఖాయం...

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను స్థానికేతరుడు అనడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఆత్మత్యాగాలెవరు చేశారని రేవంత్‌ ప్రశ్నించారు. త్వరలో తెరాసలో ముసలం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

  • తల్లడిల్లుతున్న పేగుబంధం..

భార్యాభర్తలిద్దరూ రెక్క ఆడిస్తే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. కుమారుడి వైద్యం కోసం ఉన్న ఆస్తిని, పొలాన్ని వాళ్లు ధారపోసుకున్నారు. చేతిలో ఉన్న డబ్బు అయిపోవడంతో వైద్యం కోసం దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని వేడుకుంటున్నారు.

  • గుర్రపు స్వారీ ఎక్కడ మొదలైందో తెలుసా..?

గుర్రాలు మానవులు మధ్య స్నేహం ఎప్పుడు మొదలైంది? ఈ ప్రశ్నపై 162మంది శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం పరిశోధన చేపట్టింది. ఎట్టకేలకు సమాధానాన్ని కనుగొంది. అదేంటంటే..

  • గతం గురించి మాకనవసరం...

టీ20 ప్రపంచకప్​లో భారత్​-పాక్ పోరు ఆదివారం(అక్టోబర్ 24) జరగనుంది. మైదానంలో పోటీ పడటానికి ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌ ఆడేముందు రెండు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. ఎవరు ఏమన్నారంటే?

11:56 October 24

టాప్​న్యూస్​@ 12 PM

  • ప్రేమజంట ఆత్మహత్య..

ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. ఎన్నో ఊసులు చెప్పుకున్నారు. జీవితాంతం కలిసుంటామని కలలు కన్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆ ప్రేమ పావురాలు రాలిపోయాయి. కలిసి బతకాలనుకున్న ఆ జంట చావులో(Lovers Suicide in nalgonda district) ఒక్కటయ్యింది.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.

నాన్న బైక్ నడుపుతుండగా... ఆ అక్కాతమ్ముడు హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న చెట్లను, పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ... ప్రయాణిస్తున్న వారికి మృత్యవు తమను వెంటాడుతోందని తెలియదు. ఓ లారీ రూపంలో చావు దూసుకొచ్చింది. ఆ తండ్రి, అక్కాతమ్ముడు విగతజీవులుగా మిగిలారు.

  • కాంగ్రెస్​ పాదయాత్ర..

ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలకు(fuel price hike) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. నవంబరు 14 నుంచి 29 వరకు 15 రోజులపాటు ఆందోళనలు నిర్వహించనుంది. పార్టీ ప్రతినిధులు తమ ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్నారు.

  • ఆ విషయాన్ని నేను మర్చిపోయాను..

తనకు నటిగా అవకాశాలు వస్తున్నాయని, కానీ వాటిపై పెద్దగా ఆసక్తి లేదని నిర్మాత ఛార్మి(charmi kaur movie list) చెప్పింది. భవిష్యత్తులోనూ నటించకపోవచ్చని తెలిపింది.

  • కోహ్లీకి ధోనీ టిప్స్!

టీ20 ప్రపంచకప్​.. విరాట్ కోహ్లీ, ధోనీకి ఎంతో ప్రత్యేకమైనది. ఒకరికి చివరి అవకాశం కాగా.. మరొకరికి మొదటి సవాలు. ఈ సారి భారత్​కు కప్పు తెచ్చి తీరతామని (T20 world cup 2021 latest news) తాము నిరూపించుకోవాలని చూస్తున్నారు ఈ క్రికెట్ వీరులు. ఈ క్రమంలో మాస్టర్​ మైండ్ ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు కోహ్లీ. అక్టోబర్ 24న భారత్​- పాక్ మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టు నెట్​లో ప్రాక్టీస్​ చేస్తోంది.


 

10:51 October 24

టాప్​న్యూస్​@ 11 AM

  • 'ఆత్మబంధువు' పుస్తకాన్ని ఆవిష్కరించిన  కేసీఆర్​..

దళితబంధు పథకంపై జూలురి గౌరిశంకర్ సంపాదకత్వంలో వెలువడిన 'ఆత్మబంధువు' పుస్తకాన్ని ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆవిష్కరించారు. 

  • అరె మామా... మనం సేమ్‌ కాలేజీరా!

‘అరె మామా... మనం సేమ్‌ కాలేజీరా!’- హ్యాపీడేస్‌ సినిమా క్లైమాక్స్‌లోని ఈ డైలాగ్‌ గుర్తుందా. ఇంటర్వ్యూలో జూనియర్‌ ఇబ్బంది పడుతుంటే సీనియర్‌ సాయం చేసి ఈ మాట అంటాడు. ఆ సాయానికి ఓ పకడ్బందీ వేదికను కల్పిస్తోంది ‘వావ్‌’ అంకుర సంస్థ.

  • చీకటి పడ్డాక పోలీస్‌స్టేషన్లకు వెళ్లొద్దు..

సాయంత్రం ఐదు దాటాక మహిళలు పోలీస్ స్టేషన్​కు వెళ్లొద్దంటూ ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, భాజపా నేత బేబీరాణి మౌర్య (Baby Rani Maurya BJP) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా (UP news) స్పందించాయి.

  • మళ్లీ పెరిగిన పెట్రోల్​ ధర..

దేశంలో ఇంధన ధరలు(Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు​, డీజిల్​పై 36 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

  • హిస్టరీ రిపీట్ అవుతుందా..?

దాయాదుల పోరంటేనే భావోద్వేగాలతో ముడిపడి ఉండే అంశం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌ల ఊసే లేనందున ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. 

09:52 October 24

టాప్​న్యూస్​@ 10 AM

  • బంగారం కొనాలనుకుంటున్నారా..?

బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు...

పక్క తరగతి గదికి వెళ్లి అల్లరి చేస్తున్నాడంటూ వీపు కమిలిపోయేలా ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదాడు (teacher who beat student). ఈ ఘటన భువనగిరి పట్టణంలోని రాంనగర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది.

  • స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో తాజాగా మరో 15,906 మందికి కొవిడ్​ (Coronavirus update) పాజిటివ్​గా తేలింది. 561 మంది ప్రాణాలు కోల్పోగా.. 16,479 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • సైన్యంలో కంచర గాడిదల ప్రాధాన్యం?

దేశ రక్షణ విధుల్లో కంచర గాడిదల సహకారంతో సైన్యం ఎన్నో సమస్యలను అధిగమిస్తోంది భారత సైన్యం. కొండలు, గుట్టలు, ఆక్సిజన్‌ అందని వాతావరణంలో సరకు రవాణాకు గాడిదలే ఆధారం.

  • సినీ సంగీత సామ్రాజ్యానికి రారాజు!

ఆయన స్వరాలు.. మండు వేసవిలో మంచు తెమ్మెరలు.. తొలకరి వానతో జనించే మట్టి పరిమళాలు. ఆయన గమకాలు.. సాయం సంధ్యవేళ మేనిని చల్లగా తాకే చిరుగాలులు. ఆయనే సినీ సంగీత సామ్రాజ్యానికి రారాజు.. ఇళయరాజా..!

08:50 October 24

టాప్​న్యూస్​@ 9AM

  • గెలుపుపై అభ్యర్థుల ధీమా..

హుజూరాబాద్‌లో ప్రచారం(Huzurabad by election campaign 2021) ఊపందుకుంది. ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉపఎన్నిక పట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల మనోగతం ఇలా..

  • రూ.2 వేలు దొరకలేదని ఆత్మహత్య..

అప్పు తీర్చేందుకు రూ.2 వేలు దొరకలేదని ఓ యువకుడు ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. రూ.2 వేల కోసం తనను ఎవరూ నమ్మలేదనే మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు. 

  • అక్క భర్తకి నేను నచ్చానంట..!

మా అక్కకు ఈమధ్యే పెళ్లైంది. బావ చూడటానికి బాగుంటాడు. నేనంటే చాలా అభిమానం చూపిస్తున్నాడు. దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. ఇదంతా చెబితే మావాళ్లు నన్ను అపార్థం చేసుకుంటారని భయంగా ఉంది. - ఓ సోదరి

  • మా నాన్న కన్నుమూసేలోపు..

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో చక్కటి విజయం సాధించిన అజయ్‌ భూపతి... మూడేళ్ల గ్యాప్‌ తర్వాత తన 'మహా సముద్రం'తోనూ ఆకట్టుకున్నాడు. ఈ రెండు సినిమాల వెనక తాను నడిచొచ్చిన గతుకుల బాటలోని అనుభవాల్ని ఇలా పంచుకుంటున్నాడు..

  •  విమర్శలకు కోహ్లీ కౌంటర్​..

తన రిటైర్మెంట్​(kohli retirement updates) పట్ల వస్తున్న విమర్శలను భారత జట్టు కెప్టెన్​ విరాట్ కోహ్లీ సాఫ్ట్​గా తిప్పికొట్టాడు. కొందరు అనవసర విషయాలను తవ్వుకుంటూ కూర్చుంటారని విమర్శించాడు.

07:44 October 24

టాప్​న్యూస్​@ 8AM

  • ధరణి​ దరఖాస్తులపై స్పెషల్ ఫోకస్..

ధరణి పోర్టల్​పై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షించారు(CS somesh kumar Review on Dharani). ఉన్నతాధికారులతో కలిసి పోర్టల్ అమలుపై చర్చించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రక్రియ సులభతరం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

  • రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు కేంద్రం నోటీసు..

దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభంతో థర్మల్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో అధిక విద్యుదుత్పత్తి చేస్తూ ఎందుకు విక్రయిస్తున్నారో వివరణ ఇవ్వండని తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు, కేంద్ర విద్యుత్‌ శాఖ నోటీసు జారీచేసింది

  • ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చనున్న భాజపా?

ఇటీవల పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మారుస్తూ వస్తున్న భాజపా.. గోవా సీఎంను (Goa CM change news) కూడా తప్పించనుందా? ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు తనకు చెప్పాయని ఆప్​ సీనియర్​ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

  • పండగలు వస్తున్నాయి.. జాగ్రత్త సుమీ!

పండగల సమయంలో ప్రజలు కరోనా జాగ్రత్తలను (Covid Festive Season) పాటించాలని కేంద్రం కోరింది. విదేశాల్లో నిబంధనలను తుంగలో తొక్కడం వల్ల మరలా కేసులు పెరుగుతున్నట్లు గుర్తు చేసింది. 

  • అందం విషయంలో భయాలుండేవి...

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకు భయాలుండేవని సాయిపల్లవి(sai pallavi new movies) చెప్పింది. 'ప్రేమమ్' తర్వాత తన ఆలోచనలు తప్పని అర్థమైనట్లు తెలిపింది.

06:54 October 24

టాప్​న్యూస్​@ 7AM

  • హుజూరాబాద్‌లో వేడెక్కిన రాజకీయం..

హుజురాబాద్‌లో ప్రచారం ఊపందుకుంది. అధికార, విపక్షాల గెలుపు కోసం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పదునైన విమర్శలకు ఎక్కుపెట్టాయి. ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

  • నగరంలో మరోసారి గుప్పుమన్న డ్రగ్స్‌..

హైదరాబాద్‌లో మరోసారి మాదక ద్రవ్యాల కలకలం రేగింది. వేర్వేరు కేసుల్లో ఎక్సైజ్, ఎన్సీబీ అధికారులు వేర్వేరు కేసుల్లో 8 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. సరకు విలువు సుమారు 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

  • తెదేపా సీనియర్ నేత హఠాన్మరణం...

ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేత కాట్రగడ్డ బాబు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

  • 'కాంగ్రెస్‌, వామపక్షాలకు ఓటేస్తే నోటాకు వేసినట్లే'

కాంగ్రెస్‌, వామపక్షాలకు ఓటేస్తే నోటాకు వేయటంతో సమానమని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) వ్యాఖ్యానించారు. 

  • నవంబరు 14న టీఎఫ్​సీసీ ఎన్నికలు

ఫిల్మ్ ఛాంబర్​ ఆఫ్ కామర్స్ తెలంగాణకు సంబంధించిన ఎన్నికలు నవంబరు 14న జరగనున్నాయి. ఇందులో ఎవరైనా సరే పోటీ చేయొచ్చని ప్రకటించారు.

05:22 October 24

టాప్​న్యూస్​@ 6AM

  • నవంబరు 8 నుంచి దరఖాస్తులు..

పోడు భూముల సమస్య పరిష్కారం కోసం వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి నెలరోజుల పాటు దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ, పోలీసు అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

  • దుబాయ్​లో వికసించిన పూల సింగిడి..

ఎడారి దేశంలో తంగేడువనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక వైభవం ఖండాంతరాలను దాటింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా సౌధం తెరపై బతుకమ్మ ఆవిష్కృతమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం రాత్రి పూలపండగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

  • రేపే గులాబీ పండుగ..

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ(TRS Plenary 2021) ఏర్పాట్లు తుది దశకు చేరాయి. హైటెక్స్‌లో రేపు జరగనున్న ప్లీనరీ(TRS Plenary 2021)కి గులాబీ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. సుమారు ఆరువేలకు పైగా పార్టీ ప్రతినిధులు హాజరు కానున్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తొమ్మిదో అధ్యక్షుడిగా రేపు లాంఛనంగా ఎన్నుకోనున్నారు. రాష్ట్ర, జాతీయ అంశాలపై ఏడు తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. ప్లీనరీ వేళ హైదరాబాద్ నగరం గులాబీమయంగా మారింది.

  • వేడెక్కిన ఉపఎన్నిక ప్రచారం..

హుజురాబాద్‌లో ప్రచారం ఊపందుకుంది. అధికార, విపక్షాల గెలుపు కోసం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పదునైన విమర్శలకు ఎక్కుపెట్టాయి. ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

  • ఐదో రోజుకు చేరిన ప్రజాప్రస్థానం..

వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల తలపెట్టిన పాదయాద్ర ఐదో రోజుకు చేరుకుంది. ఈ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర... మహేశ్వరానికి చేరుకోనుంది.

  • సంప్రదాయాల్లో ఆరోగ్యం..

శుచి శుభ్రతలను ఆచారాలుగా రూపొందించిన జాతి మనది. రకరకాల ఆభరణాలతో, లేపనాలతో దేహాన్ని ముస్తాబు చేయడం మన సంస్కృతి. సౌందర్య ఆపేక్ష ఒకటే కాదు- ఈ సంస్కృతీ సంప్రదాయాల (Indian Culture and Tradition) నడుమ విలువైన ఆరోగ్య సూత్రాలను, ఆధ్యాత్మిక సమన్వయాలను ఇమిడ్చింది.

  • సినిమాలు నిజం కానున్నాయా..?

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, అడవుల్లో కార్చిచ్చులు, ప్రపంచవ్యాప్తంగా వరదల బీభత్సం.. సర్వ సాధారణం అయిపోయాయి. నానాటికీ జీవవైవిధ్యం దెబ్బతిని, అనేక వన్యప్రాణులు (Effects of Global Warming on Animals ) వేగంగా అంతరించిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే హరిత గృహ వాయువులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవరసం ఉంది.

  • అగ్గిపెట్టె ధర పెరింగింది..

14 ఏళ్లుగా రూపాయికే లభిస్తున్న అగ్గిపెట్ట ధర పెరగనుంది (Matchbox Price Hike). డిసెంబర్ 1 నుంచి అగ్గిపెట్టెను రూ.2 లకు విక్రయించనున్నట్లు తయారీ సంస్థలు ప్రకటించాయి.

  • పైచేయి ఎవరిదో!

దాయాది జట్లు భారత్-పాకిస్థాన్(ind vs pak t20 world cup)​ మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2021(t20 world cup 2021)లో భాగంగా దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్​లో ఏ జట్టు బలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • సూపర్​ సీన్​ కట్​ చేశారు..

అఖిల్ అక్కినేని(akkineni akhil new movie), పూజా హెగ్దే జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్' సినిమా(Most Eligible bachelor movie) విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాకు సంబంధించిన ఓ డిలిటెడ్​ సీన్​ను సోషల్​ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం.
 

Last Updated : Oct 24, 2021, 9:46 PM IST

ABOUT THE AUTHOR

...view details