తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్ న్యూస్

etv bharat
ఈటీవీ భారత్

By

Published : Oct 1, 2021, 5:57 AM IST

Updated : Oct 1, 2021, 9:55 PM IST

21:45 October 01

టాప్​న్యూస్​ @ 10PM

  • తెలంగాణ హరిత నిధి ఏర్పాటు

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండేలా బిల్లు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. అటవీశాఖ సాయంతో పంచాయతీ సిబ్బంది నర్సరీలను పెంచుతున్నారన్నారు. తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన ఉందని సీఎం పేర్కొన్నారు. హరిత నిధికి తెరాస ప్రజాప్రతినిధులు అంగీకరించారని.. హరితనిధికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నామన్నారు.

  • కాళేశ్వరంపై హైకోర్టులో పిల్​..

కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram project) మూడో టీఎంసీ పనులపై హైకోర్టులో పిల్​ దాఖలైంది. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి పిల్ దాఖలు చేశారు. మూడో టీఎంసీకి అనుమతుల్లేకుండా పనులు చేపట్టారని పిటిషనర్ ఆరోపించారు. కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. 

  • హుజూరాబాద్​పై ఈసీ స్పష్టత..

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో (huzurabad by elections 2021)ఉపఎన్నికల ప్రవర్తనా నియమావళిపై (Model Code of Conduct ) ఈసీ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమాచారం ఇచ్చింది. 2018 రాజస్థాన్​లోని ఓ నియోజకవర్గంలో ఉపఎన్నికల సందర్భంగా తీసుకున్న నిర్ణయమే.. హుజూరాబాద్​లోనూ అమలుకానుందని తెలిపింది.


  • బ్రిటన్​ పౌరులపై భారత్​ ఆంక్షలు..

బ్రిటన్​ నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్​ను తప్పనిసరి చేయాలని (India UK quarantine rules) ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 4 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలిపాయి.

  • పోసానిపై బండ్లగణేశ్​ ఫైర్​..

పవన్​ కల్యాణ్​పై పోసాని కృష్ణ మురళి(Posani on Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్​(Bandla Ganesh News) తప్పుబట్టారు. పోసాని ఎక్స్​పైరీ డేట్​ అయిపోయిన ట్యాబ్లెట్​ లాండివాడని అభిప్రాయపడ్డారు.



 

21:01 October 01

టాప్​న్యూస్​ @ 9PM

  • కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై ..

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి పిల్ దాఖలు చేశారు. మూడో టీఎంసీకి అనుమతుల్లేకుండా పనులు చేపట్టారన్న తన పిటిషన్​లో పేర్కొన్నారు. కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారన్న పేర్కొన్నారు. 

  • 'ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా..'

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​(Nirmala Sitharaman News) హైదరాబాద్​లో పర్యటించారు. హోటల్​ తాజ్​ కృష్ణలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, జీఎస్టీ, కస్టమ్స్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలపాటు శాఖాపరమైన అంశాలపై మంత్రి సమీక్షించారు.

  • బ్రిటన్​ పౌరులపై భారత్​ ఆంక్షలు.. 

బ్రిటన్​ నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్​ను తప్పనిసరి చేయాలని (India UK quarantine rules) ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 4 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలిపాయి.

  • కశ్మీర్​లో ముగ్గురు ఉగ్ర అనుచరులు అరెస్ట్​

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్ర అనుచరులను (Militant Arrested in Jammu) పోలీసులు జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో అరెస్ట్​ చేశారు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

  • 'పోసాని ఎక్స్​పైరీ అయిపోయిన ట్యాబ్లెట్'

పవన్​ కల్యాణ్​పై పోసాని కృష్ణ మురళి(Posani on Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్​(Bandla Ganesh News) తప్పుబట్టారు. పోసాని ఎక్స్​పైరీ డేట్​ అయిపోయిన ట్యాబ్లెట్​ లాండివాడని అభిప్రాయపడ్డారు.

19:52 October 01

టాప్​న్యూస్​ @ 8PM

తెలుగు అకాడమీ డైరెక్టర్​పై వేటు

తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై విద్యాశాఖ వేటు వేసింది. అకాడవీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. అకాడమీ డైరెక్టర్‌గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది.

కల్లు తాగిన బండి సంజయ్​..

బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర(praja sangrama yatra) హుస్నాబాద్​ చేరుకుంది. పందిల్ల గ్రామంలో మానసిక వైకల్యంతో బాధపడుతున్న పదేళ్ల బాలుడికి వైద్య ఖర్చులు భరిస్తానని బండి సంజయ్(bandi sanjay)​ ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. అదే గ్రామ శివారులో గౌడ కులస్తులతో కలిసి సరదాగా కల్లు తాగారు. రేపు హుస్నాబాద్(husnabad)​లో జరిగే సభతో ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది.

పండగల వేళ ముప్పు తప్పదు..

పండుగల సీజన్​లో (covid during festivals) అజాగ్రత్త వహిస్తే ముప్పు తప్పదని హెచ్చరించారు ఐసీఎంఆర్​ మాజీ డైరెక్టర్​ జనరల్​ ఎన్​కే గంగూలీ. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కొవిడ్​ నిబంధనలు(covid appropriate behaviour) పాటించాలని సూచించారు. దేశంలో కేసుల సంఖ్య(Corona cases) తగ్గుముఖం పడుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు.
 

ముగ్గురు ఉగ్ర అనుచరులు అరెస్ట్​..

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్ర అనుచరులను (Militant Arrested in Jammu) పోలీసులు జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో అరెస్ట్​ చేశారు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడండి..

ఎవరి గురించైనా మట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని నరేశ్, మంచు విష్ణులను (Maa Elections) ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్. పవన్​ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా? అని విష్ణు అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు.


 

19:08 October 01

టాప్​న్యూస్​ @ 7PM

వారిని ఎప్పటికీ రక్షించదు

అధికార పార్టీ అండతో చెలరేగే పోలీసులను న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI Ramana Latest News) జస్టిస్​ ఎన్​వీ రమణ. అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

మోదీతో పంజాబ్​ ముఖ్యమంత్రి భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో(PM Modi) పంజాబ్​ ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​ చన్నీ(charanjit singh channi latest news) భేటీ అయ్యారు. నూతన సాగు చట్టాల సమస్య పరిష్కరించాలని మోదీని కోరినట్లు చన్నీ వెల్లడించారు.

హుస్నాబాద్‌లో ముగింపు సభ

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర 'ప్రజాసంగ్రామ యాత్ర' (prana Sangrama yatra) తొలిదశ హుస్నాబాద్‌లో ముగియనుంది. అక్టోబర్‌ 2న హుస్నాబాద్‌లో నిర్వహించే ముగింపు సభకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరుకానున్నారు. లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కమలనాథులు ప్రకటించారు. బహిరంగ సభ విజయవంతం కోసం బండి సంజయ్‌.. జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలకు దిశానిర్దేశం చేశారు.

మహిళపై ఆవు దాడి..

మహారాష్ట్ర కొల్హాపూర్‌లో.. ఓ ఆవు మహిళలపై దాడి(cow attacks on humans) చేసింది. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఇంటి ముందు పనిచేసుకుంటున్న ఓ మహిళపై మెుదట ఆవు దాడికి(cow attack) దిగింది. అడ్డుకునేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు యత్నించినా.. వెనక్కి దగ్గలేదు. వారిని కూడా తన కొమ్ములతో కుమ్ముతూ బీభత్సం సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఒకే రోజు సుమారు 20 మందికిపైగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

కొవిడ్​ టెస్టుకు రూ. 40 లక్షలు

ఫలితాలు త్వరగా వస్తాయని భావించిన ఓ వ్యక్తి కరోనా పరీక్షలను ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకున్నాడు. అతను అనుకున్నట్టుగానే పరీక్షలు వేగంగా అయిపోయాయి కానీ.. ఆ తర్వాత వచ్చిన బిల్లు చూసి అతనికి నోటమాటరాలేదు. ఇంతకీ అతనికి వచ్చిన బిల్లు ఎంతో తెలుసా?.. రూ.40 లక్షలకు పైనే!


కర్నూల్​లో కొండపొలం..

టాలీవుడ్​ నుంచి కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'కొండపొలం'(Vaishnav Tej Rakul Preet Singh Movie) ఆడియో రిలీజ్​ ఈవెంట్​ సహా 'లవ్​స్టోరి'(Naga Chaitanya Sai Pallavi Movie) మ్యాజికల్​ సెలబ్రేషన్స్​, సూర్య 'జై భీమ్​' సినిమా ఓటీటీ రిలీజ్​ డేట్​(Jai Bhim Movie Release Date) అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.


 

17:54 October 01

టాప్​న్యూస్​ @ 6PM

  • తెలంగాణలో హరితనిధి

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండేలా బిల్లు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. అటవీశాఖ సాయంతో పంచాయతీ సిబ్బంది నర్సరీలను పెంచుతున్నారన్నారు. తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన ఉందని సీఎం పేర్కొన్నారు. హరిత నిధికి తెరాస ప్రజాప్రతినిధులు అంగీకరించారని.. హరితనిధికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నామన్నారు.

  • ఎరుపు రంగు చూసి ఆవు బీభత్సం

మహారాష్ట్ర కొల్హాపూర్‌లో.. ఓ ఆవు మహిళలపై దాడి(cow attacks on humans) చేసింది. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఇంటి ముందు పనిచేసుకుంటున్న ఓ మహిళపై మెుదట ఆవు దాడికి(cow attack) దిగింది. అడ్డుకునేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు యత్నించినా.. వెనక్కి దగ్గలేదు. వారిని కూడా తన కొమ్ములతో కుమ్ముతూ బీభత్సం సృష్టించింది. 

  • 'పవన్​ను తప్పుదోవ పట్టిస్తున్నారు!'

ఆన్​లైన్​ టికెట్స్​ విధానంపై ఇటీవలే పవన్​ కల్యాణ్​(Pawan Kalyan News) వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ చేసిన ప్రకటన అవాస్తవమని ప్రముఖ నిర్మాత నట్టికుమార్​ స్పష్టం చేశారు. ఫిల్మ్​ ఛాంబర్​ అధ్యక్షుడు నారాయణ దాస్​ నారంగ్​.. వ్యక్తిగతంగా ప్రకటన చేయరని వెల్లడించారు. ఈ విషయంలో అగ్ర నిర్మాతలంతా పవన్​ను తప్పుదోవ పట్టిస్తున్నారని నట్టి కుమార్​ ఆరోపించారు.

  • 'ఎయిర్​ ఇండియా' వార్తలను ఖండించిన ప్రభుత్వం..!

ఎయిర్​ ఇండియా(Air India news) పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారంలో బిడ్లకు(Air India disinvestment bids ) కేంద్రం ఆమోదం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. ఆ వార్తలు తప్పు అని పేర్కొంది కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం. ఏదైనా నిర్ణయం తీసుకుంటే(air india disinvestment news) మీడియాకు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

  • మరో భారత ప్లేయర్​ వీడ్కోలు.. 

హాకీ క్రీడాకారుల రిటైర్మెంట్​ పరంపర కొనసాగుతోంది. తాజాగా టీమ్​ఇండియాకు 14ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన సీనియర్​ క్రీడాకారుడు ఎస్​వీ సునీల్ (SV Sunil) ఆటకు వీడ్కోలు పలికాడు.

15:55 October 01

టాప్​న్యూస్​ @ 4PM

  • తెలంగాణ హరితనిధి యోచన..

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండేలా బిల్లు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. అటవీశాఖ సాయంతో పంచాయతీ సిబ్బంది నర్సరీలను పెంచుతున్నారన్నారు. తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన ఉందని సీఎం పేర్కొన్నారు. హరిత నిధికి తెరాస ప్రజాప్రతినిధులు అంగీకరించారని.. హరితనిధికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నామన్నారు.

  • పవన్​తో నిర్మాత భేటీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ మేరకు హైదరాబాద్​లో జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్​ను ఆయన నివాసంలో (tollywood producers meet pawan kalyan)కలుసుకున్నారు. నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, నవీన్, వంశీరెడ్డి, సునీల్ నారంగ్, బన్నీవాసులు... పవన్ కల్యాణ్​తో సమావేశమై చిత్రపరిశ్రమ సమస్యలపై చర్చించారు. ఇటీవలే మంత్రి పేర్ని నానిని కలిసి జరిగిన పరిణామాలపై చర్చించిన నిర్మాతలు... పవన్ కల్యాణ్​తో కూడా సమావేశం కావడం సినీ పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీసింది. 

  • డ్రోన్​పై మొసలి దాడి..

ఆస్ట్రేలియాలో మొసళ్లను చిత్రీకరిస్తున్న డ్రోన్‌పై అనూహ్యంగా ఓ మొసలి దాడి(crocodile attack drone) చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో డ్రోన్‌ పూర్తిగా ధ్వంసం కాగా దాడి దృశ్యాలు మాత్రం రికార్డు అయ్యాయి. ఉత్తర ఆస్ట్రేలియాలో మొసళ్ల వేట విపరీతంగా పెరగడంతో దానిపై ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పోరేషన్‌ డాక్యుమెంటరీ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో డార్విన్ పట్టణంలోని సరస్సులోని మొసళ్ల దృశ్యాలను డ్రోన్‌ సాయంతో చిత్రీకరిస్తుండగా ఒక్కసారిగా మకరం ఓ డ్రోన్‌పైకి(crocodile attack drone) దూసుకొచ్చింది. నీటిలో నుంచి అమాంతం పైకి లేచి దాడి చేసింది. ఈ క్రమంలో డ్రోన్‌ నీటిలో కుప్పకూలగా.. కొన్ని వారాల తర్వాత సరస్సు ఒడ్డున డ్రోన్​ను గుర్తించారు.

  • ఈ యాప్స్​ను వెంటనే డిలీట్​ చేయండి..

ప్రమాదకర 100కుపైగా యాప్స్​ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగూల్. వీటి ద్వారా వినియోగదారుల సమాచారం చోరీ అవుతోందని పేర్కొంది. ఈ యాప్స్ మీ మొబైల్​లో ఉంటే డిలిట్ చేయండంటూ హెచ్చరించింది.



 

14:36 October 01

టాప్​న్యూస్​ @ 3PM

  • ప్రతీ పైసాకు లెక్క చూపిస్తాం..

గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో పంచాయతీలు దివాళా తీశాయని శాసనసభ సమావేశాల్లో (Assembly sessions 2021) సీఎం కేసీఆర్​ (CM KCR in assembly sessions) ఆరోపించారు. ఒక వ్యక్తిపై సగటున రూ.650 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని స్పష్టం చేశారు.

  • కేంద్రమే చెబుతోంది..

దేశంలో రైతుల ఆత్మహత్యలు అత్యల్పంగా నమోదవుతున్న రాష్ట్రం తెలంగాణ అని.... కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. పాత 10 జిల్లాల్లో తెలంగాణ స్టేడ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లను ఏర్పాటు చేసి... రైతులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని.. కేటీఆర్‌ వివరించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి.. శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

  • కోర్టులను కొంచెం నమ్మండి..

దిల్లీ జంతర్​ మంతర్​ వద్ద సత్యాగ్రహ దీక్షకు(protest at jantar mantar) అనుమతించాలనే కిసాన్​ మహాపంచాయత్​(kisan mahapanchayat) పిటిషన్​పై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు(Supreme court). సాగు చట్టాలను(New farm laws) సవాలు చేస్తూ గతంలోనే పిటిషన్​ వేశారని, ఇంకా నిరసనలు చేపట్టడంపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టులపై రైతులు విశ్వాసం కలిగి ఉండాలని సూచించింది.

  • సాయిధరమ్​తేజ్​ 'రిపబ్లిక్​' టాక్​

'ప్రస్థానం' లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు దేవకట్ట నుంచి వచ్చిన మరో చిత్రం 'రిపబ్లిక్'. సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చకు దారితీసే వేదికగా నిలిచింది. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడం, ముందస్తు విడుదల వేడుకల్లో పవన్ కల్యాణ్ చలనచిత్ర పరిశ్రమపై వ్యాఖ్యానించడం రిపబ్లిక్ చిత్రంపై మరింత ఆసక్తిని రేకెత్తించేలా చేసింది. అయితే తేజ్​కు ఈ సినిమా బ్రేక్ ఇచ్చిందా? దేవకట్ట తన ప్రస్థానాన్ని 'రిపబ్లిక్'తో కొనసాగించాడా? ఈటీవీ భారత్ రిపబ్లిక్ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం


 

13:51 October 01

టాప్​న్యూస్​ @ 2 PM

  • హుజూరాబాద్‌ ఉపఎన్నికకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్​ వేశారు. ఆర్డీవో కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంది. 

  • ఈ నెల 4 వరకు గడ్డి అన్నారం మార్కెట్​ను అక్కడే ఉంచండి

గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు... బాటసింగారం మార్కెట్‌లో సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 4 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని సూచించింది. హోల్ సేల్ ఫ్రూట్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. కనీస వసతులు కల్పించకుండా మార్కెట్ తరలిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా... తాత్కాలిక మార్కెట్‌లో తగిన సదుపాయాలున్నాయని ప్రభుత్వం తెలిపింది. మార్కెట్‌లో సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం... ఈ నెల 4కి విచారణను వాయిదా వేసింది.  

  • కళాశాలలోనే విద్యార్థిని తల నరికేసిన ప్రేమోన్మాది

ప్రేమ పేరుతో యువతులు, బాలికలపై దారుణాలకు ఒడిగడుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అలాంటి ఘటనే కేరళ కొట్టాయంలో జరిగింది. ప్రేమను ఒప్పుకోలేదని కళాశాల ప్రాంగణంలోనే తోటి విద్యార్థిని తల నరికేశాడు ఓ ప్రేమోన్మాది.

  • ఒంటిపై బట్టల్లేకుండా చోరీలు

తమిళనాడులో ఓ దొంగ చెడ్డీ గ్యాంగ్​ను మించిపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఒంటిపై బట్టల్లేకుండా వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. టూ వీలర్​, ఫోర్ వీలర్ వాహన షోరూంలే లక్ష్యంగా కోయంబత్తూర్​, చెన్నై, మధురైలోని 17ప్రదేశాల్లో దొంగతనాలు చేశాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన సింగనళ్లూరు పోలీసులు ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. షోరూం బయటి వరకు దుస్తులు ధరించి వెళ్లే ఈ దొంగ.. లోపలికి మాత్రం నగ్నంగా ప్రవేశిస్తాడు. అయితే తన దుస్తులు చూసి పోలీసులు గుర్తుపట్టొద్దనే కారణంతోనే నగ్నంగా వెళ్తున్నట్లు అతడు విచారణలో తెలిపాడు.

  • ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు

కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా(corona cases globally) తగ్గుముఖం పడుతుండటం ఊరటనిస్తోంది. అంతకుముందు వారంతో పోల్చితే గతవారం కొత్త కేసులు, మరణాలు 10శాతం దిగొచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది(corona cases who data).

12:58 October 01

టాప్​న్యూస్​ @ 1 PM

  • వాటికి నిధులిస్తమని మేమెప్పుడు చెప్పినం?

గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో పంచాయతీలు దివాళా తీశాయని శాసనసభ సమావేశాల్లో (Assembly sessions 2021) సీఎం కేసీఆర్​ (CM KCR in assembly sessions) ఆరోపించారు. ఒక వ్యక్తిపై సగటున రూ.650 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని స్పష్టం చేశారు.

  • జూనియర్ ఆర్టిస్ట్ సూసైడ్..  కిరణ్ ఎక్కడ?

జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ(Jr. Artist suicide case) మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె ప్రియుడు కిరణ్​ కోసం గాలిస్తున్నారు. దాదాపు ఆరేళ్లు కిరణ్​తో అనురాధ(Jr. Artist suicide case) ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్​పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

  • అమరీందర్‌ సింగ్ కొత్త పార్టీ..?

పంజాబ్​లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం(amarinder singh news), సీనియర్​ నేత కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ కొత్త పార్టీ(amarinder singh new party) స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే 15రోజుల్లో కొత్త పార్టీపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

  • దేశ భద్రతే మా తొలి ప్రాధాన్యత

వాయు సేన(Indian air force) శక్తిని సరైన విధానంలో ఉపయోగించి దేశ భద్రతకు భరోసా కల్పించటమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు వైమానిక దళ అధినేత(New IAF chief of India) వివేక్​ రామ్​ చౌదరి (VR Chaudhari). ఎయిర్​ చీఫ్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ భవిష్యత్తు ప్రణాళికపై పలు విషయాలు వెల్లడించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంధిని సిద్ధం చేసేందుకు కృషి చేస్తామన్నారు.

  • మంధాన అరుదైన రికార్డు

ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న చారిత్రక డేనైట్ టెస్టులో స్మృతి మంధాన శతకం సాధించింది. తద్వారా పింక్ బాల్​ టెస్టులో శతకం సాధించిన మొదటి భారత మహిళా క్రికెటర్​గా రికార్డులకెక్కింది.

11:58 October 01

టాప్​న్యూస్​ @ 12 PM

  • తెలంగాణకు జరిమానా.!

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల(palamuru- rangareddy lift irrigation project) ప్రాజెక్టుపై తెలంగాణ(telangana government) ప్రభుత్వానికి జరిమనా విధించాలని ఎన్జీటీకి(National green tribunal) సంయుక్త కమిటీ సిఫారసు చేసింది. రూ. 3.70 కోట్లు జరిమానా చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని సంయుక్త కమిటీ పేర్కొంది. ఈ మేరకు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్జీటీకీ కమిటీ నివేదిక సమర్పించింది.  

  • రాష్ట్రంలో మరో 26 కేజీబీవీలు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మండలాల్లో మరో 26 కస్తూర్భా పాఠశాలలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Telangana Education Minister Sabitha) వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం 475 కేజీబీవీలు ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క బాలికకు నాణ్యమైన ఉచిత విద్య అందించడమే కేజీబీవీల ఉద్దేశమని స్పష్టం చేశారు.

  • కుప్పకూలిన 7 అంతస్తుల భవనం

హిమాచల్​ ప్రదేశ్​ శిమ్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏడంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాదం జరగడానికి ముందే నివాసితులను ఖాళీ చేయించారు అధికారులు. వారిని సురక్షిత ప్రదేశానికి తరలించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.

  • ఆడుకుంటూ ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడ్డ చిన్నారి

ఓ చిన్నారి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడిన ఘటన గుజరాత్​ సూరత్​లో జరిగింది. కతర్గామ్ ప్రాంతంలోని లక్ష్మీ రెసిడెన్సీలో ఎనిమిదో అంతస్తు బాల్కనీలో ఆడుకుంటూ.. గ్రిల్స్​లోకి దూరి.. అదుపు తప్పి పడిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

  • ఐపీఎల్​లో ధోనీ సరికొత్త రికార్డు

ఐపీఎల్​లో విజయవంతమైన కెప్టెన్​గా పేరు తెచ్చుకున్న ధోనీ.. మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. క్యాచుల్లో అందరి కంటే ముందు ఓ మార్క్​ను అందుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటి?

10:52 October 01

టాప్​న్యూస్​ @ 11 AM

  • త్వరలోనే శ్రీకారం

మూడురోజుల విరామం అనంతరం శాసనసభ సమావేశాలు(assembly sessions news) ప్రారంభం కాగా... ఒకటి రెండు మాసాల్లోనే.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు.. టెండర్లు పూర్తి చేసి... పనులు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్​రావు (minister Harish Rao) ఈ సభలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు

  • ఇంటికే డ్రగ్స్.. బాధితులే స్మగ్లర్స్!

భాగ్యనగరంలో యువత మత్తుకు బానిసవుతున్నారు. కోరుకుంటే ఇళ్లకే చేరుతున్న డ్రగ్స్​లో మునిగితేలుతున్నారు. పోలీసులు, ఆబ్కారీ అధికారులు ఎంత కట్టడి చేసినా.. ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. కొన్నిసార్లు బాధితులే స్మగ్లర్లుగా మారుతున్నారు. రెండేళ్ల వ్యవధిలో నగరంలో గంజాయికి అలవాటు పడిన 2వేల మంది విద్యార్థులను ఆబ్కారీ శాఖ గుర్తించింది.

  • ఈసారి బతుకమ్మ చీరల ప్రత్యేకతలేంటో తెలుసా?

తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ(Bathukamma Sarees distribution)ను పురస్కరించుకుని రాష్ట్ర సర్కార్ అందించే చీరలను శనివారం నుంచి పంపిణీ చేయనున్నారు. గ్రామ, వార్డు స్థాయి కేంద్రాలతో పాట ఇళ్ల వద్ద వీటిని అందజేస్తామని అధికారులు తెలిపారు. కరోనా దృష్ట్యా పంపిణీ విధానాన్ని నిర్ణయించే స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు ఇచ్చినట్లు వెల్లడించారు.

  • వరద గురించి ముందే తెలుసుకోవచ్చు..

నగరంలో ఎంత వర్షం కురిస్తే ఏ ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం ఉంది..? ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే 2040లో ఎక్కడెక్కడ వరద ముంపునకు గురయ్యే వీలుంది..? ఇలా హైదరాబాద్‌లోని వరద పరిస్థితులను మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ను వినియోగించి అంచనా వేసే పద్ధతిని బిట్స్‌-పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ పరిశోధకులు (BITS-Pilani Hyderabad Campus Researchers) ఆవిష్కరించారు.

  • అల్లు రామలింగయ్య విగ్రహ ఆవిష్కరణ

టాలీవుడ్​లో ఎన్నో వైవిధ్య పాత్రలతో మెప్పించిన అల్లు రామలింగయ్య(allu ramalingaiah age) వర్ధంతి సందర్భంగా అల్లు స్టూడియోలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన కుమారుడు అరవింద్ నిర్మాతగా రాణిస్తుండగా, మనవళ్లు హీరోలుగా చేస్తున్నారు.

09:53 October 01

టాప్​న్యూస్​ @ 10 AM

  • భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు (Stocks today) వారాంతంలో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 500 పాయింట్లకుపైగా కోల్పోయి 58,620 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 140 పాయింట్లకుపైగా నష్టంతో 17,477 వద్ద కొనసాగుతోంది.

  • అత్యాచారం కేసులో కార్పొరేటర్ భర్త అరెస్టు

వరంగల్‌లో అత్యాచారం కేసులో (Warangal rape case) కార్పొరేటర్ భర్త అరెస్టు అయ్యారు. అర్ధరాత్రి శిరీష్‌ను ఓరుగుల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ మిల్స్‌కాలనీ ఠాణాలో శిరీష్‌పై ఓ యువతి ఫిర్యాదు చేశారు. అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసు (cases filed) నమోదయ్యాయి. పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి  (rape ) పాల్పడినట్లు ఫిర్యాదు ఇచ్చారు. గత నెల 23న మిల్స్‌కాలనీ ఠాణా పోలీసులు కేసు నమోదు చేయగా... పరారీలో ఉన్న శిరీష్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

  • టీఎస్​ఆర్టీసీ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు

ఆర్టీసీ ఉద్యోగుల(TSRTC NEWS)కు శుభవార్త. మూడేళ్ల తర్వాత ఒకటో తేదీన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులంతా జీతాలు అందుకోనున్నారు. ఇకపైనా ప్రతి నెలా ఒకటిన జీతాలు చెల్లించాలని సంస్థ ఎండీ సజ్జనార్‌(TSRTC MD SAJJANAR) ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. తీవ్ర నష్టాలతో ప్రతి నెలా 7 నుంచి 14 లోపు విడతలు, జోన్ల వారీగా జీతాలు చెల్లించడానికి అవస్థలు పడుతున్న సంస్థ.. దసరా పండగ వేళ అక్టోబరు 1న అందరికీ జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. 

  • బస్సును ఢీకొన్న డంపర్​- ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్​లోని భింద్​ జిల్లాలో బస్సును డంపర్​ ఢీ కొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 13మంది గాయపడ్డారు.

  • 'ప్రాంతీయ భద్రతకు భారత్​-అమెరికా సైన్యాల సహకారం'

సీడీఎస్​ జరనల్ బిపిన్​ రావత్​... అమెరికా జాయింట్ చీఫ్స్​ ఆఫ్ స్టాఫ్​ ఛైర్మన్​ జనరల్​ మార్క్​ మిల్లేతో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత సహా ఇతర కీలక విషయాలపై చర్చించారు. ఇరు దేశ సైన్యాల శిక్షణ, అభ్యాసాల్లో సహకారాన్ని కొనసాగించాలని అంగీకారానికి వచ్చారు.


 


 

08:54 October 01

టాప్​న్యూస్​ @ 9 AM

  • మళ్లీ బాదుడు

భారత్​లో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​పై 23 పైసలు.. డీజిల్​పై 30 పైసలు పెరిగింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చమురు మార్కెట్​ సంస్థలు ప్రకటించాయి.

  • రాష్ట్రంలో నిలిచిపోయిన ధాన్యం మిల్లింగ్‌!

తెలంగాణలో క్షేత్రస్థాయి తనిఖీ తర్వాతే గడువు పొడిగిస్తామని కేంద్రం చెప్పడం వల్ల ధాన్యం మిల్లింగ్(Rice Milling in Telangana) నిలిచిపోయింది. గడిచిన యాసంగికి సంబంధించిన బియ్యం ఇచ్చేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. ఇంకా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నాయి.

  • వృద్ధులపై వేధింపులు

రెక్కల కష్టం చేతగాని సమయంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు, కుటుంబసభ్యులు... వృద్ధులను, వయసు పైబడిన వారిని(OLD AGE PEOPLE) సరిగా చూసుకోకుండా అక్కడక్కడా వేధింపులకు దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ(TELANGANA GOVENMENT) వయోవృద్ధ సహాయ కేంద్రానికి (ఎల్డర్‌లైన్‌-14567) వస్తున్న ఫిర్యాదులే ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

  • 'చేయాల్సింది ఇంకా చాలా ఉంది'

ఐపీఎల్​లో(ipl 2021) 11వ సారి ప్లేఆఫ్స్​కు అర్హత సాధించడంపై ధోనీ(Dhoni CSK) స్పందించాడు. ఓ మైలురాయిని చేరినప్పటికీ.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని అన్నాడు. తమ టీమ్ ప్రదర్శనను మెచ్చుకున్నాడు.

  • తుదిశ్వాస వరకు నా సోదరులతోనే ఉంటా

తనకు రాజకీయాలంటే ఆసక్తి పోయిందని నటుడు నాగబాబు(nagababu family) అన్నారు. తుదివరకు సోదరులతోనే ఉంటానని ఓ నెటిజన్​ ప్రశ్నకు సమాధానమిచ్చారు.



 


 


 


 

07:47 October 01

టాప్​న్యూస్​ @ 8AM

  • హుజూరాబాద్ ఉపఎన్నికకు నేడే నోటిఫికేషన్ 

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హుజూరాబాద్ ఉపఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ (Huzurabad By Election Notification) విడుదల కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్‌ ఆర్డీఓ రవీందర్‌రెడ్డి (Rdo Ravinder Reddy)ని రిటర్నింగ్ అధికారిగా నియమించిన ఈసీ... కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ర్యాలీలు రోడ్‌షోకు అనుమతి లేనందున కచ్చితంగా ఎన్నికల కమిషన్ సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థికి చెందిన నేరచరిత్రను పత్రికల్లో విధిగా ప్రకటనలు ఇవ్వాలని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ (Ec Officer Rv Karnan) ఆయా పార్టీలకు సూచించారు. కరీంనగర్ ఎస్​ఆర్​ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు.

  • అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్

సందర్శకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామోజీ ఫిల్మ్​ సిటీ మళ్లీ తెరుచుకోనుంది. అక్టోబర్ 8 నుంచి పర్యటకులను అనుమతించనున్నారు. సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. కొవిడ్​-19 మార్గదర్శకాలను పాటించేలా నిర్వహకులు అన్ని జాగ్రతలు తీసుకుంటున్నారు.

  • ఉపపోరు బరిలో దిగే కాంగ్రెస్​ అభ్యర్థి ఎవరో తేలేది నేడే

హుజూరాబాద్‌ ఉపఎన్నిక(Huzurabad By Election) షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమైన తెరాస, భాజపా.. ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. అయితే కాంగ్రెస్​ పార్టీ మాత్రం ఉప ఎన్నికలో బరిలోకి దింపే అభ్యర్థిపేరును ప్రకటించలేదు. కాంగ్రెస్​ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి పేరును ఇవాళ అధికారికంగా ఖరారు చేయనుంది(congress candidate to be announced on today).

  • పేరు మారాక.. లక్ష్యం చేరేనా?

పిల్లలు బడి మానెయ్యకుండా విద్యార్జన కొనసాగించడానికి మధ్యాహ్నభోజన పథకం దేశంలో సుమారు పాతికేళ్లుగా అమల చేస్తున్నారు. ఈ పథకమెంత సమున్నతమైనదైనా.. సువిశాల దేశంలో అమలు పరంగా కొన్ని పొరపాట్లు జరగడం, వాటిపై ఆరోపణలు రావడం సహజమే. అయితే ఈ పథకం 'పీఎం పోషణ్‌ శక్తి నిర్మాణ్‌'(PM Poshan Scheme)గా పేరు మారాక ఏమేరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందనేది వేచి చూడాల్సిందే.

  • బికినీలు వేసుకునే ఆడాలా?

బీచ్‌ హ్యాండ్‌బాల్‌ మ్యాచ్‌లో అమ్మాయిలు(Olympic Beach Volleyball womens) బికినీలు మాత్రమే వేసుకుని పోటీపడాలనే నిబంధనను సమీక్షించాలని అంతర్జాతీయ హ్యాండ్‌ బాల్‌ సమాఖ్యను అయిదు దేశాలు కోరాయి. లింగ సమానత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని సవరించాలని విన్నవించాయి.


 


 


 


 


 

06:59 October 01

టాప్​న్యూస్​ @ 7AM

  • తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల పర్వం

ఏపీ సర్కార్.. గాలేరు-నగరి ప్రాజెక్టు విస్తరణ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ లేఖ(Water dispute between Telangana and AP) రాశారు. మరోవైపు.. గోదావరి బేసిన్​లో నీటి లభ్యతను అంచనావేసి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరిగేవరకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదించవద్దని గోదావరి బోర్డును ఏపీ కోరింది.

  • తెలుగు అకాడమీ కేసులో కొత్త కోణాలు

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ (Fixed Deposits Scam In Telugu Academy) కేసు మలుపులు తిరుగుతోంది. కెనారా బ్యాంకు చందానగర్‌ శాఖ మేనేజర్‌.. అకాడమీ అధికారులపై సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.8 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు విత్‌డ్రా చేసుకొని... బోగస్‌ రసీదులను పంపించారని... నగదు కావాలంటే లేఖను పంపించారని ఫిర్యాదు ఇచ్చారు. అకాడమీ అధికారులు మరో రూ.11.45 కోట్ల ఎఫ్‌డీలు విత్‌డ్రా చేసుకున్నారని యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (UBI) పోలీసులకు తెలిపింది. మొత్తం రూ.62.45 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల లెక్కలపై పోలీసు అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. అకాడమీలో కొందరికి నిధుల గోల్‌మాల్‌పై సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

  • రైతులకు గండం తప్పదా!

దేశ ఆహార భద్రత పేరుతో బియ్యం, గోధుమలను మాత్రమే కోట్ల టన్నుల మేర కొనుగోలు చేస్తున్న కేంద్రం మిగతా పంటలను రాష్ట్రాలకు, వ్యాపారులకు వదిలేస్తోంది. అయితే అయితే నూతన వ్యవసాయ చట్టాల అమలు నేపథ్యంలో ప్రభుత్వాలు ఎంత ధర ఇచ్చి, ఎంతమేర కొనుగోలు చేస్తాయనేది కీలక ప్రశ్నగా మారింది.

  • తండ్రి నుంచి బ్రిట్నీ స్పియర్స్​కు స్వేచ్ఛ

పాప్​గాయని బ్రిట్నీ స్పియర్స్​ (britney spears news)​ చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం దక్కింది. ఆమె తండ్రిని((britney spears father)) సంరక్షుని బాధ్యతల నుంచి తప్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సుమారు 13 ఏళ్లుగా కుమార్తె జీవిత నిర్ణయాలను.. డబ్బులు, ఆస్తుల నిర్వహణను ఆయనే పర్యవేక్షిస్తూ వచ్చారు.

  • ఇకపై వాట్సాప్​ పేమెంట్స్​!

వాట్సాప్​ ద్వారా యూపీఐ పేమెంట్స్​ను(Whatsapp Payment India) మరింత సులభతరం చేసేలా.. ఓ కొత్త ఫీచర్​ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఛాట్​ కంపోజర్​లోనే రూపీ సింబల్​ను క్లిక్​ చేయడం ద్వారా పేమెంట్స్(Whatsapp Payment India)​ పూర్తి చేయొచ్చని తెలిపింది.

05:35 October 01

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు

  • ఇంటి వద్ద నుంచే ఓటు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటి నుంచే ఓటువేసే ఈ-ఓటింగ్ (E-Vote App) విధానం అందుబాటులోకి రాబోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఐటీ శాఖ, కేంద్రం పరిధిలోని ఐటీ విభాగం సీడాక్(Cedac), ఐఐటీ ప్రొఫెసర్లు సంయుక్తంగా ఈ-ఓటింగ్ యాప్‌ను తయారు చేశారు.

  • బీ-ఫారం అందజేత

హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election)లో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్​కు (Trs Candidate Gellu Srinivas Yadav) తెరాస అధినేత, సీఎం కేసీఆర్ (Cm Kcr) ప్రగతిభవన్​లో పార్టీ బీ- ఫారం అందజేశారు.

  • ఉభయసభల పునః ప్రారంభం

గులాబ్​ తుపాను కారణంగా మూడురోజుల విరామం తర్వాత ఇవాళ ఉభయసభలు పునః ప్రారంభంకానున్నాయి(Assembly Sessions). హరితహారంపై శాసనసభలో చర్చ జరగనుంది. 

  • పర్యావరణ ఉల్లంఘనలు

కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru Ranga Reddy Lift Irrigation Scheam- PRLIS) పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు సంయుక్త కమిటీ వెల్లడించింది.

  • స్వచ్ఛ భారత్ మిషన్ రెండో విడత

స్వచ్ఛ భారత్ మిషన్ రెండో విడత, అమృత్ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 4.28 లక్షల కోట్ల అంచనాలతో చేపడుతున్న ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టనున్నారు.

  • బండి తోలితే అంతే

చెల్లుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోతే బీమా దరఖాస్తును తిరస్కరించొచ్చని సుప్రీం కోర్టు(Supreme Court news today) ఆదేశించింది. కారు చోరీ వ్యవహారంలో ఈ కీలక తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు.

  • చైనాకు స్ట్రాంగ్ కౌంటర్

భారత్​పై డ్రాగన్ చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ(India China Border News) తీవ్రంగా ఖండించింది. వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభనకు చైనానే కారణమని స్పష్టం చేసింది. చైనా దుందుడుకు చర్యల వల్లే శాంతికి విఘాతం కలుగుతోందని వ్యాఖ్యానించింది.

  • నిరసనను అడ్డుకున్న తాలిబన్లు

తమ హక్కులను కాలరాయొద్దంటూ కాబుల్‌లో మహిళలు చేపట్టిన నిరసనను(Kabul Women Protest) అడ్డుకున్నారు తాలిబన్లు(Kabul News). వారిని అదుపు చేసేందుకు గాల్లో కాల్పులు జరిపినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది.

  • ప్లే ఆఫ్స్​కు సీఎస్కే

సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. తద్వారా ఈ సీజన్​లో ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

  • నా పెళ్లి అప్పుడే

వాయిదా పడుతూ వస్తున్న(ali richa marriage) తన పెళ్లి వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగుతుందని చెప్పాడు బాలీవుడ్ నటుడు అలీ ఫజల్​. ప్రేయసి రిచా చద్దాతో కొన్నేళ్లుగా ఇతడు సహజీవనం చేస్తున్నాడు.

Last Updated : Oct 1, 2021, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details