తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్​ టాప్​ న్యూస్​

etv bharat top news
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

By

Published : Aug 29, 2021, 5:55 AM IST

Updated : Aug 29, 2021, 10:15 PM IST

21:58 August 29

టాప్ న్యూస్​ @10PM

  • మమ్మల్ని తీసుకెళ్లిపోండి..

అఫ్గానిస్థాన్ నుంచి బయటపడేందుకు అక్కడి జర్నలిస్టులు తీవ్రంగా(journalists in afghanistan) ప్రయత్నిస్తున్నారు. దేశం నుంచి బయటపడేందుకు సహకరించాలని అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్​కు అభ్యర్థనలు పెట్టుకుంటున్నారు. దాదాపు రెండు వేల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

  • ఏం జరుగుతోంది?

పారాలింపిక్స్​లో ఆదివారం జరిగిన డిస్కస్​ త్రో పోటీలో కాంస్య పతకం విజేత ఫలితం హోల్డ్​లో పడింది. భారత్​కు చెందిన పారా అథ్లెట్ వినోద్​ 'డిసెబిలిటీ క్లాసిఫికేషన్​'పై సందేహాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

  • కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం..

పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ప్రజలకు అన్ని విషయాలను వివరించేందుకే ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టామని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​ గెలిచి తీరతారని బండి సంజయ్​ జోస్యం చెప్పారు.

  • పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి..

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి పర్యటించారు. పట్టణంలోని వెంకటసాయి గార్డెన్‌లో పీఆర్‌టీయూటీఎస్‌ కరీంనగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్‌ కృతజ్ఞత సభను నిర్వహించారు. పనిచేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని అండగా నిలిచి ఆశీర్వదించాలని మంత్రి కోరారు.

  • సైనికుడి కాల్పులు..

ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో ఓ పొలం వివాదంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో నియంత్రణ కోల్పోయిన ఓ మాజీ సైనికుడు.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు.

20:53 August 29

టాప్​ న్యూస్​ @9PM

  • రూ.21 కోట్ల గంజాయి పట్టివేత..

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద 3,400 కిలోల గంజాయి పట్టుబడింది. వీటి విలువ రూ.21 కోట్లు ఉంటుందని ఎన్‌సీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎన్​సీబీ అధికారులు చెప్పారు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. 

  • కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం..

పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ప్రజలకు అన్ని విషయాలను వివరించేందుకే ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టామని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​ గెలిచి తీరతారని బండి సంజయ్​ జోస్యం చెప్పారు.

  • ఫ్లిప్​కార్ట్ పార్శిళ్లలో రాళ్లు, పెంకులు..

తాము పనిచేసే కంపెనీకే సున్నం పెట్టారు నలుగురు కేటుగాళ్లు. జల్సాలకు అలవాటుపడి ఉద్యోగం ఇచ్చిన కంపెనీనే టార్గెట్​గా చేసుకుని మోసాలకు తెగబడ్డారు. ఫ్లిప్​కార్ట్ పార్శిళ్ల పేరు మీద లూటీలు చేయడం ప్రారంభించారు. అనుమానం వచ్చి కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఘరానా మోసం బయటపడింది.

  • ఎక్స్​పైరీ వైద్యం..

చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాల్సిన సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేవలం ఎనిమిది రోజుల వయసున్న బాలునికి నాలుగు నెలల కిందట ఎక్స్​పైరీ అయిన సెలైన్​ ఎక్కించి.. ఆ తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించారు. ఇదేంటని నిలదీస్తే.. నిర్లక్ష్యపు సమాధానాలతో మరింత కోపం వచ్చేలా చేస్తున్నారు.

  • కొడుకును చిత్రహింసలు పెట్టి..

భర్తపై ఉన్న కోపాన్ని కొడుకుపై చూపించింది ఓ కర్కశ తల్లి. చిన్నారి రెండు చేతులను వెనక్కి కట్టేసి.. నోటి మీద పదే పదే కొట్టింది. బాలుడు నోటి నుంచి రక్తం దారలు కడుతుంటే చూసి రాక్షసానందాన్ని పొందింది. చిన్నారి వెక్కి వెక్కి ఏడుస్తున్నా.. వదలకుండా అత్యంత దారుణంగా కొట్టింది. 

19:50 August 29

టాప్​ న్యూస్​ @8PM

  • రాకెట్ దాడి- చిన్నారి మృతి..

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్ అంతర్జాతీయ​ విమానాశ్రయం సమీపంలో మరో భారీ పేలుడు(Kabul Attack) సంభవించింది. ఎయిర్​పోర్టు వాయవ్యాన రాకెట్​తో ఈ దాడి జరిగినట్లు అఫ్గాన్ పోలీస్​ చీఫ్ రషీద్​ తెలిపారు.

  • భారత్​కు తొలి స్వర్ణం..

ఆసియా జూనియర్ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్ రోహిత్ చమోలీ(Rohit Chamoli) స్వర్ణం సాధించాడు. 48 కిలోల విభాగం ఫైనల్​లో మంగోలియాకు చెందిన ఒత్‌గోన్‌బయర్​ తువ్‌సింజయాను ఓడించి ఈ ఏడాది భారత్​కు తొలి స్వర్ణం అందించాడు. దుబాయ్​ వేదిక జరగుతున్న ఈ బాక్సింగ్​ ఛాంపియన్స్​లో భారత తరఫున గౌరవ్​ సైనీ(70 కిలోలు), భరత్​ జూన్​(+81 కిలోలు) పురుషుల విభాగంలో స్వర్ణం కోసం పోటీపడనున్నారు.

  • కొత్తగా 257 కేసులు..

రాష్ట్రంలో గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 257 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారిన ఒకరు మరణించారు. కరోనా నుంచి కొత్తగా 409 మంది కోలుకున్నారు.

  • 'శ్రీరాముడు లేకుండా అయోధ్య లేదు'..

ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్యను(Ayodhya News) సందర్శించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​. శ్రీరాముడు, అయోధ్య నగర ప్రాముఖ్యతను కొనియాడారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య అని పేర్కొన్నారు. గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో రామాయణ్ ఎన్‌క్లేవ్‌ను ప్రారంభించారు.

  • హాలీవుడ్​ భామ సందడి..

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో(RRR Movie) నటిస్తున్న హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ హైదరాబాద్‌ వీధుల్లో సందడి చేశారు. శిల్పారామం కూడా వెళ్లి వచ్చారు. తన రోజు ఎంతో సంతోషంగా గడిచిందంటూ ఇన్​స్టాలో ఫొటోలు పోస్ట్​ చేశారు.

18:48 August 29

టాప్ న్యూస్ @7PM

  • భారత్​కు మరో పతకం..

టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) భారత్​కు మరో పతకం లభించింది. ఆదివారం జరిగిన డిస్కస్​ త్రో ఎఫ్ 52 పోటీలో వినోద్​ కుమార్ కాంస్యం సాధించాడు. 

  • కాబుల్​లో పేలుడు!

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లో భారీ పేలుడు సంభవించినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఉగ్రదాదులు మరోసారి దాడి చేస్తారని అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

  • తెలుగు భాష మరింత వికసిస్తుంది..

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా... తెలుగు భాష పట్ల సీఎం కేసీఆర్​కున్న ప్రేమను ట్విట్టర్​ ద్వారా పంచుకున్నారు.

  • ఇవాళ, రేపు భారీ వర్షాలు..

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(imd hyderabad) వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు(telangana rains) కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

  • వ్యూహాలు మార్చాం..

అఫ్గానిస్థాన్​లో మారిపోతున్న సమీకరణాలు భారత్​కు సవాలుగా పరిణమించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్(rajnath singh) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాలను మార్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే క్వాడ్ ఏర్పడిందని, ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్​ల ఏర్పాటు కోసం కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు.

17:50 August 29

టాప్​ న్యూస్ @6PM

  • నిషాద్‌ కుమార్‌కు రజతం

టోక్యో పారాలింపిక్స్​లో భారత్​కు మరో రజత పతకం దక్కింది. హైజంప్​ టీ47 కేటగిరిలో నిషాద్​ కుమార్ 2.06 మీటర్ల ఎత్తు జంప్​ చేసి సిల్వర్​ మెడల్ సాధించాడు.

  • పనిమాది.. పేరు మీదా?

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో టీఎన్‌జీవోల అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సభకు మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్‌, హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు.

  • సందర్శకులకు ఫ్రీనెస్..

హైదరాబాద్ ట్యాంక్​బండ్​పై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇక ప్రతి ఆదివారం ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. సాయత్రం 5 నుంచి రాత్రి 10గంటల వరకు ట్యాంక్​బండ్ మీదుగా వాహనాల రాకపోకలను నియంత్రిస్తారు. ఆదివారం ఆటవిడుపు కోసం ట్యాంక్ బండ్ పైకి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం, వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్నారు.

  • వ్యూహాలు మార్చాం..

అఫ్గానిస్థాన్​లో మారిపోతున్న సమీకరణాలు భారత్​కు సవాలుగా పరిణమించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్(rajnath singh) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాలను మార్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే క్వాడ్ ఏర్పడిందని, ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్​ల ఏర్పాటు కోసం కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు.

  • హైదరాబాద్‌ వీధుల్లో హాలీవుడ్​ భామ

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో(RRR Movie) నటిస్తున్న హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ హైదరాబాద్‌ వీధుల్లో సందడి చేశారు. శిల్పారామం కూడా వెళ్లి వచ్చారు. తన రోజు ఎంతో సంతోషంగా గడిచిందంటూ ఇన్​స్టాలో ఫొటోలు పోస్ట్​ చేశారు.

16:50 August 29

టాప్​ న్యూస్ @5PM

  • చంద్రబాబును తిట్టాల్సిన అవసరమేంటి..

రూ.లక్షా.25 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు బిల్లులు చూపించి కల్వకుర్తి నుంచి శ్రీరాంసాగర్ వరకు ఏడేళ్లలో ఒక్క పని పూర్తి చేయలేదని టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి​ ఆరోపించారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా​ రైతుల వల్లే తనకు పీసీసీ పదవి దక్కిందని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. 

  • పని మాది.. పేరు మీదా..?

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో టీఎన్‌జీవోల అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సభకు మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్‌, హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు.

  • దేదీప్యమానంగా యాదాద్రి..

భక్తజన సందోహం ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి(yadadri) ఆలయ అభివృద్ధి పనులు చకాచకా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్(cm kcr) దిశానిర్దేశంతో ఈ పుణ్యక్షేత్రాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నారు. సకల హంగులతో నారసింహుని క్షేత్రాన్ని ముస్తాబుచేస్తున్నారు. అన్ని పనులు ముగింపు దశకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు.

  • 'గాడ్​ఫాదర్​'​లో విలన్​గా స్టార్​ నటుడు!

మోహన్​ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న 'లూసిఫర్'​ రీమేక్ 'గాడ్​ఫాదర్​' ​లో(chiranjeevi lucifer remake) స్టార్​ నటుడు మాధవన్​ విలన్​ పాత్ర పోషించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

  • మైనర్​కు కరోనా టీకా..

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తప్పిదం జరిగిందని సమాచారం. మధ్యప్రదేశ్​లో ఓ మైనర్​కు కరోనా టీకా (minor vaccine) వేసినట్లు తెలుస్తోంది. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

15:48 August 29

టాప్ న్యూస్​ @4PM

  • పాతబస్తీకి మెట్రో రైలు ఏమైంది..

రాబోయే ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ చేపట్టిన​ ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు షేక్​పేటకు చేరుకుంది. పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు రావడం లేదో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ప్రభుత్వం చెప్పాలని బండి సంజయ్​ ప్రశ్నించారు.

  • ఒలింపిక్స్‌కు పంపుతాం

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా వర్సిటీలో నిర్మించబోతున్న స్పోర్ట్స్ క్లస్టర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగ్ గౌడ్​ పాల్గొన్నారు.

  • అతిభారీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(imd hyderabad) వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు(telangana rains) కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

  • 'హాలీవుడ్‌ తాలిబన్‌'!

అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయాలతో తాలిబన్లు(Afghan Taliban) మరింత శక్తిమంతులుగా మారారు. ఈసారి వారు ఎక్కడైనా ట్విన్‌ టవర్ల తరహా దాడి చేసినా వారిని అంత తేలిగ్గా అధికారం నుంచి తప్పించలేరు. ఇప్పుడు వారి వద్ద సుమారు 167 హెలికాప్టర్లు, విమానాలు ఉన్నట్లు తేలింది. ఇవి ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ధ్రువీకరించిన లెక్క. ఇక హ్యాంగర్లలో ఉన్న వాటి లెక్క తెలియదు.

  • స్పేస్​లోకి చీమలు, రొయ్యలు, ఐస్​క్రీమ్

ఐస్​క్రీమ్, అవకాడోలు, నిమ్మకాయలు... ఏంటి? ఇదేమైనా గ్రోసరీ లిస్ట్ అనుకుంటున్నారా? కాదండోయ్! అంతరిక్షంలోకి నాసా పంపిన వస్తువుల జాబితా. ఇవే కాదు చీమలను కూడా పంపించింది. స్పేస్ఎక్స్(spacex launch) వ్యోమనౌక వీటిని నింగిలోకి చేర్చింది. అసలు ఇవి అంతరిక్షంలోకి ఎందుకు పంపించారంటే?

14:42 August 29

టాప్ న్యూస్​ @3PM

  • ఆ ముద్ర తొలగినట్లేనా?

అఫ్గానిస్థాన్​లో క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన అనంతరం తాలిబన్లపై(Afghan Taliban) అభిప్రాయాన్ని మార్చుకుంది ఐరాస భద్రతా మండలి(UNSC). ఉగ్రవాదానికి సంబంధించి ఆగస్టు 16న విడుదల చేసిన ఓ ప్రకటన నుంచి తాలిబన్ల పదాన్ని తొలగించింది. అఫ్గాన్​ నుంచి ఇతర దేశాల పౌరులను స్వదేశం తరలించడం వారి సహకారం లేకుండా సాధ్యమై ఉండేది కాదని భావిస్తోంది.

  • సీఎం కేసీఆర్‌కు లేఖ..

ఏపీలోని వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదును పునఃపరిశీలించి, ఉపసంహరించుకోవాలని కోరుతూ... ప్రకాశం జిల్లా తెదేపా ప్రజాప్రతినిధులు లేఖ రాశారు.

  • సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం..

ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. వాణీదేవితో శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్ధి రామచంద్రరావుపై 20,820 ఓట్లతో ఆమె గెలుపొందారు.

  • ఆ ఊళ్లో ప్రతీవిధిలో ఓ  బడి..

కరోనా కారణంగా పాఠశాలలు మూసి వేసిన సమయంలో పుస్తకానికి విద్యార్థులు దూరం కావొద్దనే ఉద్దేశంతో కొందరు ఉపాధ్యాయులు విభిన్న ఆలోచనతో పాఠాలను వారికి చేరువ చేశారు. గ్రామంలోని వీధుల్లో అక్షరమాల, ఆంగ్ల అక్షరాలు, అంకెలను ఫ్లెక్సీలు వేయించి విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ప్రతి వీధిలో ఓ ఇంఛార్జిని ఏర్పాటు చేసి కొవిడ్​ కాలంలో పిల్లలకు చదువును చేరువ చేశారు నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం శిల్గపురం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు.

  • మూవీ అప్​డేట్స్..

టాలీవుడ్​ కొత్త సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. ఆదివారం(ఆగస్టు 29) పుట్టినరోజు (Nagarjuna Birthday) జరుపుకొంటున్న కథానాయకులు అక్కినేని నాగార్జున, విశాల్​ కొత్త సినిమాల టైటిల్స్​తో పాటు ఫస్ట్​లుక్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

13:47 August 29

టాప్ న్యూస్ @ 2 PM

  • సురభి వాణీదేవి అనే నేను... 

ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. వాణీదేవితో శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్ధి రామచంద్రరావుపై 20,820 ఓట్లతో ఆమె గెలుపొందారు.

  • కాళేశ్వరం, దేవాదులతో సస్యశ్యామలం

దేవాదుల ప్రాజెక్టు పెండింగ్​ పనులపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాఠోడ్​ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతుందని.. అందుకు అనుగుణంగా ప్రాజెక్టు పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.

  • విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై నిషేధం(Flight Ban India) పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

  • అవే కరోనా సమస్యలు

కరోనా మహమ్మారితో(Corona Virus) ఆసుపత్రిపాలైన వారిలో ఏడాది తర్వాత కూడా ఏదో ఒక సమస్య పీడిస్తోందని ఓ అధ్యయనం తేల్చింది. కొందరు రోగులు(Covid patients) కోలుకోవడానికి ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతోందని వెల్లడించింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని మహమ్మారి అనంతరం అందించాల్సిన వైద్య సేవలకు ప్రణాళిక రచించాలని సూచించింది.

  • అదే కవిసమ్రాట్​

మహాకవి విశ్వనాథ సత్యనారాయణ జీవితాధారంగా రూపొందిన వెబ్​ఫిల్మ్​ 'కవిసమ్రాట్​'. ప్రముఖ హాస్యనటుడు ఎల్​బీ శ్రీరామ్​ నటించి.. స్వీయనిర్మాణంలో రూపొందిన చిత్రమిది. మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు కవి సత్యనారాయణ చేసిన కృషిని 'ఈటీవీ'తో చిత్రబృందం పంచుకుంది. ఆ విశేషాలు మీకోసం..

12:48 August 29

టాప్ న్యూస్ @1 PM

  • రెండోరోజు సంజయ్ యాత్ర

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ప్రారంభమైంది. మెహదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల నుంచి యాత్రను ప్రారంభించారు. నానల్‌నగర్, టోలిచౌక్ చౌరస్తా మీదుగా బండి యాత్ర సాగనుంది. సా.4 గం.కు గోల్కొండ కోటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

  • నారసింహుని సన్నిధిలో భక్తుల రద్దీ

శ్రావణమాసం(sravana masam).. మరోవైపు సెలవురోజు కావడంతో నారసింహుని(sri lakshmi narasimha swamy)చెంతకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం ఆదివారం ఉదయం నుంచే బారులు తీరారు. ధర్మ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

  • పట్టపగలు ఇంటి ముందే ఎంఐఎం కౌన్సిలర్​ హత్య

ఎంఐఎం కౌన్సిలర్​ను అతని ఇంటిముందే కాల్చి చంపారు దుండుగులు. బైక్​పై వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించి పరారయ్యారు.

  • డ్రగ్స్​ కేసులో బాలీవుడ్​ నటుడు అరెస్ట్​

మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్​ నటుడు అర్మాన్​ కోహ్లీని ఎన్​సీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. శనివారం సదరు నటుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

  • కళ్ల పరిరక్షణ కోసం ఇలా చేయండి!

పిల్లలతోపాటు ఆన్‌లైన్‌ తరగతుల్లో కూర్చోవడం, ప్రతిదానికీ మొబైల్‌పై ఆధారపడటం వెరసి గృహిణులకూ స్క్రీన్‌ వాడకం పెరిగిపోయింది. మరి కళ్ల ఆరోగ్యం సంగతేంటి?

12:06 August 29

టాప్ న్యూస్ @12 PM

  • మంత్రుల పర్యటనలో దొంగల చేతివాటం​..

ఇద్దరు మంత్రుల పర్యటనతో(ministers visit) ఆ ప్రాంతమంతా హడావిడిగా ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేశారు. ఇంతమంది మధ్యలోనూ జేబుదొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. మంత్రులకు స్వాగతం పలికే వేళ యథేచ్చగా నేతల జేబుల్లోంచి డబ్బును కొట్టేశారు.

  • అధునాతన యంత్రాలతో యాదాద్రి ప్రసాదం..!

తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ తరహాలో... యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి లడ్డూ, పులిహోర ప్రసాదాలను యంత్రాల ద్వారా తయారు చేసేందుకు యాడా సిద్ధమైంది. అందులో భాగంగానే ముంబయి, పుణేల నుంచి కోట్ల రూపాయలు పెట్టి యంత్రాలను కూడా తెప్పించారు.

  • అవన్నీ తిరిగిచ్చేయండి'.. పౌరులకు తాలిబన్ల ఆర్డర్

అఫ్గాన్​ ప్రజలకు తాలిబన్లు(Afghanistan Taliban).. కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాలు సహా ఇతర ప్రభుత్వ ఆస్తుల్ని వారంలోగా తిరిగిచ్చేయాలని డెడ్​లైన్​ విధించారు.

  • అసెంబ్లీ వేదికగా పార్టీ నేతలకు సీఎం హెచ్చరిక

కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు.. పార్టీ అధినేతలపై ప్రశంసలు(sycophancy in politics) కురిపించటం ఏ పార్టీలోనైనా కనిపిస్తుంది. కానీ, అలాంటి వాటికి తమ పార్టీ దూరం అంటున్నారు ఓ ముఖ్యమంత్రి(Tamil Nadu CM). ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో(Tamil Nadu Assembly) పొగడ్తలతో సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా.

  • క్రీడా దినోత్సవానికి కారణం అతడే!

భారతదేశంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని(National sports day) నిర్వహిస్తారు. ఈ వేడుకను రాష్ట్రీయ ఖేల్​ దివాస్​ అని కూడా పిలుస్తారు. అసలు ఈ క్రీడా దినోత్సాన్ని ఎందుకు జరుపుకొంటారో తెలుసుకుందాం.

10:43 August 29

టాప్ న్యూస్ @11 AM

  • అఫ్గాన్​ ప్రజలకు ఎందుకీ దుస్థితి?

క్షణమైనా తమ పసికందులను విడిచి ఉండని పచ్చిబాలింతలు కూడా... 'మీరైనా వేరే రాజ్యంలో బాగా బతకండి' అంటూ చంటిపిల్లల్ని కాబుల్‌ విమానాశ్రయంలో(Kabul airport) విసిరేస్తున్నారంటే ఒకనాటి తాలిబన్‌(Afghanistan Taliban) ఆటవిక పాలన వారినెంత వణికిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అసలు అఫ్గాన్​ అల్లకల్లోలం(Afghanistan crisis) వెనక ఉన్న కారణాలేంటి? నాటి పాలకులు ప్రజలకు చేసిన ద్రోహం ఏమిటి?

  • ఆ మనుమరాళ్లు పాడె మోశారు..!

సాధారణంగా ఎవరైనా చనిపోతే మగవారు మాత్రమే పాడే మోస్తారు. కానీ తాత మీద ఉన్న మమకారంతో అతని పాడెను... మనుమరాళ్లు మోశారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

  • విభజన 2 కాదు.. 3 దేశాలుగా!

భారత్‌, పాకిస్థాన్‌ల రూపంలో దేశాన్ని(Partition of India) రెండుగా చీల్చాలని నిర్ణయించాక కూడా బ్రిటిషర్ల మనసు సంతృప్తి చెందలేదు. చివరి రోజుల్లో.. మరో చీలికకు ఎత్తు వేశారు. అదే బంగాల్‌(Partition of Bengal)! భారత్‌, పాకిస్థాన్‌లతో పాటు సంయుక్త బంగాల్‌నూ ఓ ప్రత్యేక దేశంగా చేయాలని భావించారు.

  • 30 ఏళ్లలో ఎన్ని మార్పులో

సాంకేతికత(Technology news) విషయంలో గత 30 ఏళ్లు చాలా కీలకమైనవి. మానవ జీవితాన్ని మార్చేసిన ఎన్నో ఆవిష్కరణలు (Innovations in India) గత మూడు దశాబ్దాల్లోనే జరిగాయి. అవి మన రోజు వారీ జీవితాన్ని సౌకర్యవంతం కూడా చేశాయి. మరి ఆవిష్కరణలు ఏమిటి? మానవ జీవితాలను (How Human lifes Changed with Innovations) అవి ఎలా మలుపు తిప్పాయి?

  • పసిడి ధరలు ఇలా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్​, డీజిల్ ధరల్లోనూ (Fuel Prices) ఎలాంటి మార్పు లేదు.

09:34 August 29

టాప్ న్యూస్ @10 AM

  • భాజపా కార్యాలయ బేరర్లతో బండి సంజయ్ భేటీ...

భాజపా కార్యాలయ బేరర్లతో బండి సంజయ్ (Bandi Sanjay Kumar) సమావేశమయ్యారు. మెహదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన భేటీలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహణపై చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం పాద యాత్ర ప్రారంభం కానుంది.

  • భవీనా విజయానికి దేశమంతా గర్విస్తుంది 

టోక్యో పారాలింపిక్స్​లో రజతం సాధించిన టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి భవీనా పటేల్​కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

  • పెళ్లైన మూడు రోజులకే గర్భవతి

ప్రియుడి కారణంగా గర్భం దాల్చిన ఓ యువతి.. విషయం దాచి తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన మూడో రోజే విషయం తెలుసుకుని.. ఆమెను వదిలించుకున్నాడు. ప్రియుడి సలహాతో మరో వ్యక్తికి వలపు వల విసిరి లక్షల్లో సొమ్ము కాజేసింది. చివరికి అతడిని విడిచి పెట్టి మూడోపెళ్లి చేసుకుంది. చివరికి రెండో భర్త ఫిర్యాదుతో కటకటాలపాలైంది. ఈఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది.

  • నాలుగో రోజూ 40వేలకుపైగా కేసులు

భారత్​లో కరోనా (Corona Update) మళ్లీ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే మరో 45 వేలమందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. 460 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో కేసులు(Coronavirus) ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.

  • పాటల ప్రబంధం... స్వర సమ్మోహనం

దివి నుంచి భువికి జాలువారే పవిత్ర గంగా ప్రవాహం ఆయన స్వరం. ఆ గొంతు వింటే చాలు శ్రుతిలయలు మురిసిపోతాయి. స్వరజతులు సరాగాలు పోతాయి. అక్షరాలకు దైవత్వాన్ని అద్దగలిగే మార్మికత ఆయన సొంతం. శరీరంలోని అచేతనత్వాన్ని పారదోలే భక్తి సంగీతానికి భావోద్వేగపు పరిమళాలను పూసే గాత్రం ఆయనది. అలౌకిక ఆనందాన్ని అందిస్తున్న ఆ గాన గంధర్వుడే కేజే యేసుదాస్.

08:51 August 29

టాప్ న్యూస్ @9 AM

  • అఫ్గాన్​లో మళ్లీ పేలుళ్లకు అవకాశం..

కాబుల్​ విమానాశ్రయం(Kabul airport) వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొన్న వేళ.. మరోసారి పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. విమానాశ్రయం పరిసరాల నుంచి దూరంగా వెళ్లాలని తమ పౌరులకు సూచించింది.

  • తల్లి మందలించిందని

ఫోన్​ ఎక్కువగా చూస్తుందని... తల్లి మందలింపుతో పదోతగరతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.

  • చరిత్ర సృష్టించిన భవీనా

టోక్యో పారాలింపిక్స్​లో భారత టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి భవీనా పటేల్​ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన క్లాస్‌-4 టేబుల్​ టెన్నిస్​ ఫైనల్​ మ్యాచ్​లో చైనా ప్లేయర్​ యింగ్​ ఝోపై 0-3తో ఓడి.. రజత పతకాన్ని గెలుచుకుంది. 

  • రుచికి కొత్త చిరునామా... పెరటితోట!

ఇంటి పంటల పెంపకానికి పెద్ద ప్రణాళికలు, మదుపు అవసరం ఉండదు. చాలారకాల మొక్కలు, చెట్లు పెద్దగా సంరక్షణ చేయకపోయినా ఫలసాయాన్ని ఇస్తాయి. కంద, చేమ, అల్లం, మామిడిఅల్లం వంటి దుంప జాతులు, బొప్పాయి, జామ, దానిమ్మ, వంటి పండ్ల జాతులు ఈ కోవలోకే వస్తాయి.

  • నేనూ సగటు ఆడపిల్లలాగనే కదా..!

‘తెరిచిన పుస్తకం’- శ్రుతి హాసన్‌ గురించి తెలిసినవాళ్లు చెప్పే మాటిది. మనసులోనే కాదు.. తన జీవితంలో జరిగే దేన్నీ దాచుకోదు మరి! సూటిగా మాట్లాడటం.. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలనే పట్టుదల.. తప్పొప్పులతో సంబంధం లేకుండా తన నిర్ణయాలపై దృఢంగా నిలబడగలిగే తత్వం ఆమె సొంతం. అందుకే.. తండ్రికి వారసులిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. శ్రుతిగానే అందరికీ దగ్గరైంది. ఆమెను తాజాగా ‘వసుంధర’ పలకరించింది.

07:48 August 29

టాప్ న్యూస్ @8 AM

  • రాష్ట్రంలో నేడూ, రేపూ భారీ వర్షాలు

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడూ, రేపూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం విస్తారంగా వానలు కురిశాయి. వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతుండటంతో..... మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

  • తాలిబన్ల గుప్పిట్లోకి కాబుల్ విమానాశ్రయం

అఫ్గాన్ రాజధాని రాజధాని కాబుల్‌పై మరింతగా పట్టు బిగించారు తాలిబన్లు (Afghanistan Taliban). భారీగా ప్రజలు రాకుండా చర్యలను ముమ్మరం చేశారు. విమానాశ్రయ మార్గాల్లో(Kabul Airport) మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. చీకట్లోనూ దృశ్యాలు కనిపించేందుకు.. అఫ్గాన్‌ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రత్యేక కళ్లద్దాలను వారు వినియోగిస్తున్నారు.

  • అఫ్గాన్​ తాజా పరిస్థితులకు అమెరికానే కారణం

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు(Afghanistan Taliban) ఆక్రమించుకునేందుకు అమెరికాకి సరైన వ్యూహం, ప్రణాళిక లేకపోవడమే ప్రధాన కారణమని పలు దేశాల్లో దౌత్యవేత్తగా పని చేసిన తల్మిజ్​ అహ్మద్​ తెలిపారు. జిహాదీకి పాకిస్థాన్​, సౌదీతో పాటు పునాది వేసింది అమెరికానేనని ఆరోపించారు. అఫ్గాన్​ ఖనిజాలపై చైనా కన్నువేసిందన్నారు. ప్రస్తుత అఫ్గాన్​ పరిస్థితులతో(Afghan Crisis) భారత్​పై తక్షణ ప్రభావమేమీ ఉండదని అభిప్రాయప్డడారు.

  • ఏ వయసులో గర్భం దాలిస్తే మంచిది?

చిన్న వయసులోనే పిల్లల్ని కనటం మంచిది కాదని చాలా మంది అంటారు. అలాగని వయసు దాటాక కనటం అస్సలు శ్రేయస్కరం కాదనీ చెబుతుంటారు. మరి ఒక స్త్రీ ఏ వయసులో పిల్లల్ని కనటం మంచిది?. దీనిపై నిపుణుల సూచనలు ఏమిటో తెలుసుకోండి.

  • అనుసంధానానికి ఇబ్బందేం లేదు

ఆధార్​తో పాన్​, ఈపీఎఫ్​ఓల అనుసంధానంలో అంతరాయం కలుగుతోందన్న వార్తలపై స్పందించింది యూఐడీఏఐ. అన్ని సేవలు స్థిరంగా ఉన్నట్లు, సక్రమంగానే పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది.

07:10 August 29

టాప్ న్యూస్ @7 AM

  • అన్నదాతలపై పోలీసుల లాఠీఛార్జి

సాగు చట్టాలపై నిరసనలు(Farmers protest) చేస్తున్న రైతులపై హరియాణా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆందోళనలు చేస్తున్న రైతులపై లాఠీఛార్జి(Lathi charge by Police) చేశారు. ఇందులో 10 మంది అన్నదాతలకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రైతులు రక్తమోడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

  • అధిక బరువును తగ్గించే అల్పాహారం..

అధిక బరువుతో బాధపడేవారు దాన్ని తగ్గించుకోవడానికి... విపరీతమైన వర్కవుట్లు చేయడం లేదా... డైటింగ్‌ పేరుతో పూర్తిగా నోరు కట్టేసుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇవేవీ అవసరం లేకుండా అల్పాహారాన్ని ఎక్కువగా తీసుకుంటే.. బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.

  • అదృశ్యమైన పసికందు ఆచూకీ లభ్యం...

ఏపీలోని మార్కాపురం ఆస్పత్రిలో నిన్న అపహరణకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అపహరించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

  • ఆ వయసులోనే అతడితో ప్రేమలో పడ్డా!

సినిమా కెరీర్​లో తానెప్పుడూ నటించని పాత్రను 'డియర్​ మేఘ'(Dear Megha) కోసం చేసినట్లు హీరోయిన్​ మేఘ ఆకాష్​(Megha Akash) వెల్లడించింది. ఆమె టైటిల్​ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుశాంత్​ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటి మేఘ చిత్ర విశేషాలను మీడియాకు వెల్లడించింది.

04:38 August 29

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

కూకటివేళ్లతో పెకలిస్తాం

తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు కేసీఆర్‌ పాలనను చూసి రోదిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. కాషాయ శ్రేణుల హర్షాతిరేకాల నడుమ శనివారం బండి సంజయ్‌ 'ప్రజా సంగ్రామ' పాదయాత్ర ప్రారంభమైంది. 35రోజుల యాత్రలో తొలి అడుగు వేశారు. రెండో రోజు మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల నుంచి ప్రారంభమై..... లంగర్‌హౌజ్‌ మీదుగా బాపూఘాట్‌ వరకు సాగనుంది.


జాగ్రత్తలు పాటిద్దామిలా..

సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. కరోనా భయంతో తల్లిదండ్రుల్లో ఏదో తెలియని సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి నుంచి కాపాడుకుంటూ బడిబాట పట్టేదెలా..? తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి..? ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి..? బోధన ఏ విధంగా ప్రారంభించాలి..? మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలేమిటి..? తదితర అంశాలపై నిపుణుల సూచనలు..


భారీ వర్షాలు

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడూ, రేపూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం విస్తారంగా వానలు కురిశాయి. వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతుండటంతో..... మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.


సమీక్ష

రాష్ట్రంలో యాసంగి సీజన్ ధాన్యం మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మిల్లింగ్ వేగవంతం చేయడంలో భాగంగా హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో యాసంగి ధాన్యం మిల్లింగ్‌పై ఉన్నత స్థాయి సమీక్ష చేశారు.


దళితులు అందరికీ దళిత బంధు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం దళితులందరికీ అందుతుందని కరీంనగర్​ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమైన దళిత బంధు సర్వేను పరిశీలించారు.

సవాళ్లను ఎదుర్కొంటూ..

ప్రపంచంలో ఎక్కడైనా భారతీయుడు కష్టాల్లో ఉంటే.. దేశం తన పూర్తిశక్తిని ఉపయోగించి అతనికి అండగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది కరోనా సమయంలో కావచ్చు లేదా ప్రస్తుత అఫ్గానిస్తాన్ సంక్షోభంలో కావొచ్చని తెలిపారు. ఆపరేషన్ దేవిశక్తి కింద అఫ్గానిస్తాన్ నుంచి వందలాది మందిని భారత్‌కు తీసుకువస్తున్నామన్నారు.

అలసత్వం వద్దు

పండగల సీజన్​లో కరోనా(covid-19) కట్టడిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. రద్దీ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు అమలయ్యేలా చూడాలని పేర్కొంది. పలు జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా ఉందని.. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్చలు తీసుకోవాలని స్పష్టం చేసింది.


 

ఏ ఒక్కరినీ వదలం

అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్స్‌ స్థావరాలపై శనివారం జరిపిన డ్రోన్‌ దాడులు చివరికి కావని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడిలో తమ పౌరుల ప్రాణాలు బలిగొన్నవారిలో ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తేలేదన్నారు. రాగల 24-36 గంటల్లో మరోసారి పేలుళ్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.


అదొక్కటే దారి

ఇంగ్లాండ్​(IndvsEng)తో జరగబోయే తర్వాతి రెండు మ్యాచ్​ల్లో టీమ్​ఇండియా గెలవాలంటే నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్​మెన్​ సూత్రాన్ని పాటించాలని సూచించాడు భారత మాజీ కెప్టెన్​ దిలీప్​ వెంగ్​సర్కార్​. బ్యాటింగ్​ లైనప్​ మరింత బలంగా తయారవ్వాలంటే ఆరో బ్యాట్స్​మన్​గా సూర్యకుమార్​ యాదవ్​ను తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.


నాగ్​ రూటే సపరేటు!

మాస్‌ కథానాయకుడు అనే మాటకు అసలు సిసలు నిర్వచనం నాగార్జున (Akkineni Nagarjuna). 'శివ' అంటూ సైకిల్‌ చైన్‌ పట్టి యువతరాన్ని అలరించిన ఆయనే.. 'అల్లరి అల్లుడు'గా కుటుంబ కథల్లోనూ ఒదిగిపోయారు. 'మన్మథుడు'గా మగువల మనసునూ దోచారు. ఆ తర్వాత 'అన్నమయ్య' అంటూ భక్తిభావాన్నీ పండించారు.

Last Updated : Aug 29, 2021, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details