1. 'ఆత్మ నిర్భర్ యూపీ రోజ్‌గార్' ప్రారంభించిన మోదీ
ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన 'ఆత్మ నిర్భర్ ఉత్తర్‌ప్రదేశ్ రోజ్‌గార్ యోజన'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్థానికంగా ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం... వలసకూలీలకు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యం. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. సిరిసిల్ల జిల్లాలో హరితహారం.. మొక్కలు నాటిన కేటీఆర్, పోచారం
రాష్ట్రంలో ఆరోవిడత హరితహారం జోరుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సభాపతి పోచారం, మంత్రి కేటీఆర్ రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొక్కలు నాటారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
3. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులపై సమాచారం కోరిన కేంద్రం
రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొత్త ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం అదనపు సమాచారాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గోదావరి, కృష్ణా బోర్డు ఛైర్మన్లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటించారు. హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. రోడ్డుప్రమాదంలో దంపతులు, కుమారుడు దుర్మరణం
కారు, ట్యాంకర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు, వారి కుమారుడు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
6. శనివారం నుంచి దిల్లీలో సెరోలాజికల్ సర్వే
దిల్లీలో శనివారం నుంచి సెరోలాజికల్ సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సర్వే చేపట్టేందుకు అధికారులకు అవసరమైన శిక్షణ పూర్తయినట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
7. సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షల రద్దుకు సుప్రీం ఓకే
జులైలో జరగాల్సిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కేంద్రం చేసిన వినతికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. గత పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులకు మార్కులు నిర్ణయించేందుకు సీబీఎస్ఈకి అనుమతిచ్చింది. పరీక్షల రద్దుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
8. వికెట్ పడిన ప్రతిసారీ ఎగిరి గంతులేశాం
1983లో దిగ్గజ వెస్టిండీస్‌తో తలపడి.. భారత క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్‌కు గురువారం నాటికి 37 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా సచిన్ తెందుల్కర్ ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ.. సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
9. 104 రోజుల తర్వాత కిటకిటలాడిన ఈఫిల్ టవర్
ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌ను 104రోజుల అనంతరం సందర్శనకు అనుమతినిచ్చారు. కరోనా సంక్షోభం దృష్ట్యా మూతపడ్డ ఈఫిల్ టవర్.. ఇప్పుడు పర్యటకులతో కిటకిటలాడుతోంది. అయితే భౌతిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
10. 'ఆమెను సుశాంత్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు'
వచ్చే ఏడాది ప్రారంభంలో సుశాంత్ పెళ్లిచేసుకోవాలనుకున్నాడని అతడి తండ్రి కేకే సింగ్ చెప్పారు. తమతో అతడు జరిపిన చివరి సంభాషణ ఇదేనని గుర్తు చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.