తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ 10 న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP 10 NEWS 11 AM
టాప్​ 10 న్యూస్ @11AM

By

Published : Jun 27, 2020, 10:58 AM IST

1. రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో రోకలిబండతో భార్యను కొట్టి చంపాడో కసాయి భర్త. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

2. హైదరాబాద్​లో 8 వేలు దాటిన కరోనా కేసులు

గ్రేటర్‌ హైదరాబాద్​ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఈనెల 13 నుంచి ఇప్పటి వరకు చూస్తే కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. శుక్రవారం మరో 774 మందికి పాజిటివ్‌ వచ్చింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

3. 16 మంది ఎన్​బీఏ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్

వచ్చే నెల 30వ తేదీ నుంచి ఎన్​బీఏ కొత్త సీజన్​ మొదలు కానుంది. ఈ క్రమంలో చేసిన వైద్యపరీక్షల్లో 16 మంది ప్లేయర్లకు కరోనా సోకినట్లు తేలింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

4. మృతదేహాల తరలింపులో అయోమయం.. గంటలపాటు తప్పని నిరీక్షణ

కరోనాతో రోగి చనిపోతే మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడంలో గందరగోళం నెలకొంటుంది. ఎలా తరలించాలన్న అవగాహన పురపాలక అధికారుకులకు లేకుండా పోవడం, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కూడా ఈ వ్యవహారం తమది కాదన్నట్లుగా ఉండడం వల్ల అప్పటికే కొండంత దుఃఖంలో ఉన్న మృతుల కుటుంబీకులు మరింత కుంగిపోతున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

5. 'కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధికి భారీ బడ్జెట్ అవసరం'​

కొవిడ్​-19 మహమ్మారి వ్యాక్సిన్​, చికిత్స సాధనాల కోసం భారీగా నిధులు అవసరమవుతాయని పేర్కొంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు. వ్యాక్సిన్​ అభివృద్ధి వేగవంతం చేయకపోతే.. ప్రాణ, ఆర్థిక నష్టం భారీగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

6. శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్ సీఎం

కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్​ దర్శించుకున్నారు. సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

7. పుత్తడి ధరలకు రెక్కలు- రూ. 65వేల దిశగా..!

బంగారం ధరలు కనీవినీ ఎరుగని గరిష్ఠ స్థాయికి చేరుకోనున్నాయి. దీపావళి నాటికి పది గ్రాముల పుత్తడి అర లక్ష రూపాయలను దాటిపోనుంది. మరో రెండు సంవత్సరాల్లో ఇది రూ. 65 వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

8. 'ఫేస్ షీల్డ్'తో రొమాన్స్​ చేసిన ఆ హీరో

బాలీవుడ్​ నటుడు అపర్​శక్తి.. పోస్ట్ చేసిన ఓ ఫొటో అభిమానులను నవ్విస్తూనే ఆలోచింపజేస్తోంది. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ 'ఫేస్ షీల్డ్' పెట్టుకుని రొమాంటిక్​ సన్నివేశంలో నటిస్తున్నట్లు కనిపించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

9. బాయ్‌కాట్‌ చైనాపై 'ఆటో'.. ఇటో తేల్చలేం

సరిహద్దుల వద్ద చైనా వైఖరికి నిరసనగా భారత్‌లో 'బాయ్‌కాట్ ‌చైనా' ఉద్యమం నడుస్తోంది. నిన్న మొన్నటి దాకా మొబైళ్ల వరకే పరిమితమైన ఆ ఉద్యమం ఇపుడు వాహనాల వరకు చేరింది. చైనా తయారీ కార్ల కొనుగోలును రద్దు చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో గర్వంగా ఆ లేఖలను ప్రదర్శిస్తున్నవారూ ఉన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

10. గ్రీన్​ఇండియా ఛాలెంజ్​లో 'హాస్యబ్రహ్మ'

ఓ మొక్క నాటి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.. తన వంతు బాధ్యత చాటుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details