కీలక భేటీ
కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక సమావేశం జరగనుంది. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్..ఇంజినీర్లు, న్యాయవాదులు, ఈఎన్‌సీలు, అడ్వొకేట్ జనరల్‌తో భేటీ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తెతెదేపా కొత్త సారథి
తెలంగాణ తెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకమయ్యారు. తెతెదేపా అధ్యక్షుడిగా నర్సింహులును తెదేపా జాతీయాధ్యక్షులు చంద్రబాబు నియమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈటల యాత్ర షురూ
కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి భాజపా నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజా జీవన యాత్ర పేరుతో 270 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రారంభానికి ముందు ఈటల సతీమణి జమున వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇలాగైతే మూడోముప్పే!
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. పెళ్లిళ్లు, పేరంటాలు, జాతరలు, సమావేశాల వల్ల జనమంతా ఒక్కచోటకు చేరితే... కొవిడ్ మహమ్మారి విజృంభించే అవకాశాలున్నాయని వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలంతా ఎక్కడికెళ్లినా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని లేనిపక్షంలో కరోనా కాటు తప్పదని హెచ్చరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొత్తగా 38వేల కేసులు
భారత్‌లో కరోనా కేసులు(Covid 19 india) క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 38,164 మందికి వైరస్ సోకింది. మరో 499 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 38,660 మంది వైరస్‌ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.