సభా సమయం
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వచ్చే నెల 13 వరకు వీటిని కొనసాగించనున్నారు. పెట్రో ధరల పెరుగుదల, సాగు చట్టాల రద్దు, రఫేల్ ఒప్పందంపై దర్యాప్తు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని తాజా సమావేశాల్లో ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమమయ్యాయి. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం పక్కా ప్రణాళికలు రూపొందించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హుజూరాబాద్ నుంచే అమలు..
రాష్ట్రంలో అమలు చేయ తలపెట్టిన దళిత సాధికారత పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రైతుబంధు తరహాలోనే ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేవంత్ గృహనిర్బంధం
కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ భూములను సందర్శించాలని నిర్ణయించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కోకాపేట వెళ్లనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మొదటి ప్రమాద హెచ్చరిక
మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్‌సాగర్‌లోకి మూసీ వరద అధికంగా వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
టీకాతో రక్షణ
కరోనా టీకా(Corona Vaccine) రెండు డోసులు తీసుకున్న వారికి వైరస్ నుంచి ముప్పు తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. టీకా తీసుకున్న వారిలో మరణాల శాతం తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.