'ఎలుక' కథనానికి స్పందించిన మంత్రి
'ఆపరేషన్ కోసం దాచుకున్న 2 లక్షలు ఎలుకలు కొట్టేశాయి!' ఈటీవీభారత్ కథనాని(Etv Bharat Effect)కి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. ఎలుకలు కొరకడం వల్ల రూ.2 లక్షలు నష్టపోయిన రైతు రెడ్యాకు సాయం చేస్తానని ముందుకొచ్చారు. అంతేకాకుండా అతడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'పద్మశ్రీ'కి పలకరింపే కరవైంది!
కొన ఊపిరితో ఉన్న ఆదివాసీల కళలకు ప్రాణం పోసి ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారున్ని సమాజం మర్చిపోయింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతే అనారోగ్యంతో బాధపడుతుంటే పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. ప్రాచుర్యంలో ఉన్నప్పుడే హడావుడి చేసే ప్రభుత్వాలు.. క్షయవ్యాధితో కుమిలిపోతుంటే కనీసం అటువైపు కూడా తొంగిచూడట్లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దుర్గమ్మకు బంగారుబోనం
విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. గత పన్నెండేళ్ల నుంచి దుర్గమ్మకు బోనాలు సమ్పరిస్తుండటం ఆనవాయితీగా వస్తోందని భక్తులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
యాదాద్రిలో భక్తుల కిటకిట
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి(Yadadri Temple) ఆలయం కిటకిటలాడుతోంది. నేడు స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా.. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అఖిలపక్ష భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా జరిగేలా సహకరించాలని ఈ భేటీలో విపక్షాలను కోరనుంది కేంద్రం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.