కొత్తగా 41 వేల కేసులు
దేశంలో కొత్తగా 41,157 కరోనా కేసులు బయటపడ్డాయి. శనివారం నాటి కేసులతో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కరోనాతో మరో 518 మంది ప్రాణాలు కోల్పోయారు. 42,004 మంది వైరస్ నుంచి విజయవంతంగా కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జలసవ్వడి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు ప్రవాహం పెరుగుతోంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం జలాశయానికి 85వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ముందుగానే ఎస్సారెస్పీలోకి భారీగా ప్రవాహం వచ్చి చేరింది. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హుజూరాబాద్‌పై గురి
హుజూరాబాద్ ఉపఎన్నిక వ్యూహాలు ఖరారు చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. చలో రాజ్ భవన్ కార్యక్రమం విజయవంతం కావడంతో మరో పోరాటానికి సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో టీపీసీసీ సుదీర్ఘంగా చర్చించి కార్యాచరణ సిద్ధం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అభ్యుదయ రైతు
ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పంటలు పండించేందుకు సిద్ధమయ్యాడు. తనకిష్టమున్న రంగంలో కాలుమోపిన అతను సేంద్రియ పంటలు పండించి లక్షలు సంపాదిస్తున్నాడు. అంతేనా జాతీయస్థాయి పురస్కారానికి కూడా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనెవరో తెలుసుకుందామా...? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9 నిమిషాల్లో వెంకయ్య చిత్రం
విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి రెడీ అవుతున్నారు. ఆయన రాక కోసం శంషాబాద్‌లో భద్రతా సిబ్బంది వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ కుర్రాడు వచ్చి.. ఆయన్ని కలవాలని.. బహుమతి ఇవ్వాలని సిబ్బందిని కాళ్లావేళ్లా పడుతున్నాడు. చివరికి అనుమతి సాధించాడు. నేరుగా ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్లి తన విజ్ఞప్తి చేశాడు. సమయం కావస్తోన్నా.. విద్యార్థిని ప్రోత్సహించటం కోసం.. ఏకంగా తన ప్రయాణాన్నే కాస్త వాయిదా వేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.