ఏ బోర్డుకు లేనన్ని?
దేశంలోని ఏ నదీ యాజమాన్య బోర్డుకూ లేని విస్తృత అధికారాలను కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్రం కల్పించింది. ఏ బోర్డుకు తమ ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వాలపై చర్య తీసుకొనే అవకాశం లేదు. కానీ ఈ రెండు బోర్డులకు చర్యలు తీసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. తాజాగా కేంద్రం ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను, దీనికి ఆధారంగా తీసుకొన్న ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వైద్యవిద్యలో వైపరీత్యం
కొవిడ్ దెబ్బ 25,000 మంది వైద్యవిద్యార్థుల మీద పడింది. ప్రాక్టికల్స్ కొరవడడంతో రోగిని ప్రత్యక్షంగా పరీక్షించి, వారి వ్యాధుల్ని తెలుసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో వీరు రేపు నేరుగా రోగుల మీదే ప్రాక్టికల్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అప్పటివరకు స్పందించవద్దు..
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి ఖరారు ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. గెజిట్‌ను పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో అధ్యయనం చేశాకే.. సర్కార్ వైఖరి వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. నిపుణులు, అధికారులు, ఇంజనీర్లతో సంప్రదింపులు జరుపుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయమై ఇప్పుడే ఎవరూ స్పందించవద్దని నేతలకు సూచించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నేటి నుంచి థియేటర్లు ఓపెన్
సినిమా థియేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కోరింది. ఈ మేరకు ఛాంబర్ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను శనివారం కలిశారు. రాష్ట్రంలో థియేటర్ల పునఃప్రారంభానికి చొరవ చూపాలని కోరారు. దీంతో ఆదివారం నుంచి థియేటర్ల పునః ప్రారంభానికి ఎగ్జిబిటర్లు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
త్వరలోనే మరో దఫా
మరో విడత భూముల అమ్మకానికి సర్కార్ సిద్ధమవుతోంది. మొదటి దఫాలో మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా మరోమారు భూములు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూముల అమ్మకం ద్వారా రూ.పదివేల కోట్ల నిధులు రాబట్టుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.