'రాజీపడే ప్రసక్తే లేదు'
కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు. శనివారం నారాయణపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ప్రలోభాల పర్వం కొనసాగుతోంది'
హుజూరాబాద్‌లో తెరాస ప్రలోభాల పర్వం కొనసాగుతోందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ కూడా జరుగుతోందని ఆరోపించారు. నియోజకవర్గానికి చెందని వారికి సైతం ఓట్లు నమోదు చేస్తున్నారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జంతు ప్రేమికులకు శుభవార్త
జంతు ప్రేమికులకు జూ అధికారులు శుభవార్త తెలిపారు. కొవిడ్ కారణంగా మూతపడ్డ నెహ్రూ జంతు ప్రదర్శన శాల ఆదివారం నుంచి పునః ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలలుగా సందర్శనను నిలిపివేసిన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'పంచసూత్ర ప్రణాళికే రక్ష'
హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఒకటి "టెర్రస్ గార్డెన్", మరోటి 'కొత్త(కరోనా) కథలు". 80 మంది రచయితలు రాసిన కథా సంకలనాన్ని ఎస్పీ బాలుకు అంకితం చేయటం పట్ల ప్రచురణకర్తలను అభినందించారు. కరోనాను జయించాలంటే ప్రతీ ఒక్కరు పంచసూత్ర ప్రణాళికను పాటించాల్సిందేనని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కశ్మీర్లో ఎన్కౌంటర్
కశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతం అయినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.