'కృష్ణా జలాలపై రాజీపడం'
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నారాయణపేటకు 10 కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక ఉందని చెప్పారు. పక్కనే ఉన్న కర్ణాటకలో మన దగ్గర అమలవుతోన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతోందా? అని ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీఎంకు రేవంత్ లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖను రాశారు. సుమారు 2 లక్షల పోస్టులుంటే 50 వేలే భర్తీ చేస్తారా అని ప్రశ్నించారు. కరోనా వేళ స్టాఫ్ నర్సులను దేవుళ్లని పొగిడారు.. ప్రస్తుతం నర్సులు ప్రగతిభవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని లేఖలో వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సైనికా.. సెలవిక
ఏపీలోని గుంటూరు జిల్లా కొత్తపాలెంలో వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి. అంతకుముందు జశ్వంత్ నివాసం నుంచి కొత్తపాలెం శ్మశానవాటిక వరకు అంతిమ యాత్రలో వేలాది మంది జనం పాల్గొన్నారు. జై జవాన్, జశ్వంత్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఉక్కు పోరు 2.o
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్న వేళ.... ఉద్యమాన్ని ఉరకలెత్తించేలా కార్మికులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇన్నాళ్లు విశాఖలో నిరాహార దీక్షలకే పరిమితమైన ఆందోళనలను... ఇకపై దిల్లీని తాకేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే పరిశ్రమను... ప్రాణాలు అర్పించైనా రక్షించుకుంటామని అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారత్ టార్గెట్
దేశంలో 60వేల కిలోమీటర్ల మేర ప్రపంచ స్థాయి జాతీయ రహదారుల నిర్మాణమే తమ లక్ష్యమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. రోజుకు 40కిలోటమీటర్ల చొప్పును రోడ్లను నిర్మించాలని తలపెట్టినట్టు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.