ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రంలో (telangana) ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ (cm kcr) ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ (fill the 50 thousand jobs) అంశంపై అధికారులతో సమీక్షించిన ఆయన వెంటనే ఖాళీగా ఉన్న కొలువులు భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలలో కలిపి 50 వేల ఉద్యోగాలు మొదటి దశలో భర్తీ చేయాల్సిందిగా అధికారులకు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరోసారి ఫీవర్ సర్వే
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. వైద్యారోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఇంకా మహమ్మారి నియంత్రణలోకి రాలేదన్న సీఎం.. వైరస్ వ్యాప్తికి కారణాలను అధ్యయనం చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
13న కేబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గం వచ్చే మంగళవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కరోనా పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి స్థితిని సమీక్షించటంతో పాటు చికిత్స, సదుపాయాలు, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేవంత్ సంచలన వ్యాఖ్యలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో సరదాగా ముచ్చటించిన రేవంత్... కిషన్‌రెడ్డికి కేంద్ర కేబినెట్ హోదా తన వల్లే వచ్చిందని... కేసీఆర్ ఉన్నంత కాలం కేటీఆర్ సీఎం కాలేరని ఆసక్తికర కామెంట్లు చేశారు. 2022లో కేసీఆర్... ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చేప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జికా వైరస్‌పై కేంద్రం హైఅలర్ట్
జికా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆరుగురు సభ్యులున్న కేంద్ర నిపుణుల బృందం.. కేరళకు బయలుదేరింది. వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించడం సహా కేసుల నిర్వహణలో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహకరించనుంది. మరోవైపు.. వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను కేరళ ప్రభుత్వం రూపొందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.