ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రంలో (telangana) ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ (cm kcr) ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ (fill the 50 thousand jobs) అంశంపై అధికారులతో సమీక్షించిన ఆయన వెంటనే ఖాళీగా ఉన్న కొలువులు భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలలో కలిపి 50 వేల ఉద్యోగాలు మొదటి దశలో భర్తీ చేయాల్సిందిగా అధికారులకు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
13న కేబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గం వచ్చే మంగళవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కరోనా పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి స్థితిని సమీక్షించటంతో పాటు చికిత్స, సదుపాయాలు, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేవంత్‌పై రోజా ఫైర్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ’మా ఇంట్లో సీఎం కేసీఆర్, జగన్‌ల మంతనాలు జరిగాయని రేవంత్‌రెడ్డి అంటున్నారని, జగన్ మా ఇంటికి ఎప్పుడు వచ్చారో రేవంత్ రెడ్డి నిరూపించాలని’ ఆమె సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తగ్గిన కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 729 కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఆరుగురు మృత్యువాత పడ్డారు. కరోనా రికవరీ రేటు 97.67 శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జికా వైరస్‌పై కేంద్రం హైఅలెర్ట్
జికా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆరుగురు సభ్యులున్న కేంద్ర నిపుణుల బృందం.. కేరళకు బయలుదేరింది. వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించడం సహా కేసుల నిర్వహణలో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహకరించనుంది. మరోవైపు.. వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను కేరళ ప్రభుత్వం రూపొందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.